S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/17/2018 - 16:46

న్యూఢిల్లీ: భారత్, ఇరాన్ మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. చర్చల అనంతరం సుమారు తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.రోహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు.

02/17/2018 - 17:09

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

02/17/2018 - 16:49

చెన్నై: ఫిల్మ్‌స్టార్ కమల్‌హాసన్ త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి టీఎన్ శేషన్‌ను కమల్ కలిశారు. చెన్నైలో ఆయన నివాసంలో కమల్ భేటీ అయ్యారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌తో సుమారు 15 నిమిషాల పాటు కమల్ మాట్లాడారు.

02/17/2018 - 06:38

కైలాసహర్ (త్రిపుర), ఫిబ్రవరి 16: రాష్ట్రంలో అభివృద్ధిపై అటు సీపీఎం కాని, ఇటు బీజేపీ కాని శ్రద్ధ చూపవని, సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, త్రిపుర ప్రజలు అందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అధికారం కోసం బీజేపీ మాదిరిగా తాము తప్పుడు వాగ్దానాలు చేయబోమని స్పష్టం చేశారు.

02/17/2018 - 05:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ టీడీపీ, వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు బీజేపీ నేతలు తోసిపుచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ అధికార ప్రతినిధి నరసింహరావుశుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు.

02/17/2018 - 05:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: తనను ప్రధానిగా కాకుండా హితుడిగా, సన్నిహితుడిగా భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు ఉద్భోధించారు. శుక్రవారం ఇక్కడ తల్కతోరా స్టేడియంలో జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది పిల్లలు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.

02/17/2018 - 05:03

అదనంగా 14.75 టీఎంసీ కావేరీ జలాలు కేటాయిస్తూ సుప్రీం తీర్పు

పదిహేనేళ్లపాటు అమలు సీఎం సిద్దరామయ్య హర్షం తమిళనాడు అసంతృప్తి
జలాలపై ఏ రాష్ట్రానికీ యాజమాన్య హక్కు లేదన్న అత్యున్నత న్యాయస్థానం

కావేరీ నీళ్లకొరకు
చావోరేవో తెగింపు జగడమె పెంచెన్
చివరికి ఈ న్యాయము
ఎవరికి నీళ్లిచ్చె కళ్లెవరివి కార్చెన్!

02/17/2018 - 05:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఏఐసీసీలో అత్యున్నత నిర్ణాయిక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేశారు. దాని స్థానంలో 34మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని నియమించారు. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలను ఈ కమిటీ సారధ్యంలో నిర్వహించనున్నారు. పార్లమెంటులో బడ్జెట్‌పై మలి విడత చర్చ మొదలయ్యేలోగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారని భావిస్తున్నారు.

02/17/2018 - 05:18

ముంబయి, ఫిబ్రవరి 16: దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. 11,400 కోట్ల రూపాయల భారీ కుంభకోణం కేసులో సూత్రధారి నీరవ్ మోదీకి చెందిన జువెలరీ సంస్థ గీతాంజలి గ్రూప్‌పై సీబీఐ శుక్రవారం నాడు మరో కేసు నమోదు చేసింది. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నీరవ్ సంస్థలు, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది.

02/17/2018 - 01:09

చెన్నై, ఫిబ్రవరి 16: కావేరీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ప్రభుత్వం చేతగానితనంవల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ప్రతిపక్ష డీఎంకె దుమ్మెత్తిపోసింది. అయితే కావేరీ జలాల్లో న్యాయమైన వాటా కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది.

Pages