S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2018 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఆదివారం జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా 17 శాతం తక్కువగానే ఈసారి పోలింగ్ నమోదైందని వెల్లడించింది. మొత్తం 60 స్థానాల్లో 52 సీట్లకుగాను ఆదివారం ఎన్నికలు జరిగాయి. సీపీఎం అభ్యర్థి రామచంద్రనారాయణ దేవ్ మృతి కారణంగా చరిలాం నియోజకవర్గంలో ఎన్నికలు జరగలేదు.

02/19/2018 - 00:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ రాజధానిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో నిర్మించిన బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ తదితరులు పాల్కొన్నారు.

02/19/2018 - 00:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరిగిన అన్ని ఉద్యమాలకు భారతీయ జనతా పార్టీ, దానికి ముందు పనిచేసిన జనసంఘ్ సారథ్యం వహించాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

02/18/2018 - 03:49

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ మహాసభలు దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 16 నుంచి 18 వరకూ జరుగుతాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అనుభవం, యువ శక్తి, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

02/18/2018 - 02:18

ముంబయి, ఫిబ్రవరి 17: పంజాబ్ నేషనల్ బ్యాంకులో తలెత్తిన 11వేల కోట్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ, బీజేపీకి చిరకాల భాగస్వామి అని శివసేన ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధిస్తూ బీజేపీ ఎన్నికల నిధుల సేకరణలో నీరవ్ ఎలా సహాయపడ్డాడో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది.

02/18/2018 - 02:17

అజ్మీర్, ఫిబ్రవరి 17: ఒక వివాహ వేడుకలో గ్యాస్ సిలెండర్ పేలి ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బీవార్ పట్టణంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజ్మీర్ జిల్లా బీవార్‌లోని ఒక హోటల్‌లో వివాహ వేడుకలో హఠాత్తుగా సిలెండర్ పేలడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. వేడుకకు హాజరైనవారిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

02/18/2018 - 02:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జాతీయ బ్యాంకుల నుండి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దోచుకున్న నీరవ్ మోదీ, ఐపీఎల్ కుంభకోణం మూల పురుషుడు లలిత్ మోదీ దేశం విడిచి పారిపోవటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా సహాయం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు.

02/18/2018 - 02:15

కోజికోడ్, ఫిబ్రవరి 17: భారత్‌లో 65 శాతం జనాభా 35ఏళ్ల లోపువాళ్లేనని, యువ భారతాన్ని అవకాశంగా తీసుకుని జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, విద్యాసంస్థలు నవ భారత నిర్మాణానికి నడుం కట్టాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ఫరూక్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ, ఆధారపడే దయనీయ నుంచి బంధవిముక్తం చేయగల సాధనం ఒక్క జ్ఞానం మాత్రమేనన్నారు.

02/18/2018 - 02:13

కోల్‌కతా విక్టోరియా మ్యూజియంలో ఏర్పాటుచేసిన చంద్రుడి నమూనా చిత్రం

02/18/2018 - 02:11

ముంబయి, ఫిబ్రవరి 17: దేశంలో చదువుకుంటూ మధ్యలోనే ఆపేస్తున్న వారిలో ముస్లిం బాలికలు 72 శాతం కంటే ఎక్కువగానే ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం ఇక్కడ తెలిపారు. బీజేపీ మహారాష్ట్ర మోర్చా నిర్వహించిన ఒక కార్యక్రమంలో నఖ్వీ పాల్గొన్నారు.

Pages