S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/19/2017 - 03:15

న్యూఢిల్లీ, నవంబర్ 18: నేషనల్ హెరాల్డ్ కేసుతో తీర్పు రాకుండా పిటిషనర్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సోనియా, రాహుల్‌తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలపై స్వామి అవినీతి ఆరోపణలు చేశారు.

11/19/2017 - 03:11

ముంబయి/జైపూర్, నవంబర్ 18: సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రంపై తలెత్తిన వివాదం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని, సమాచార ప్రసార మంత్రి స్మృతి ఇరానీ తక్షణం స్పందించాలని బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)ను బహిష్కరించాలని చలనచిత్రం వర్గాలకు పిలుపునిచ్చారు.

11/19/2017 - 02:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ శనివారం ఇక్కడ కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, దీంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథమే మారిపోయిందని, అందువల్లనే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రాహుల్ రాయ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.

11/19/2017 - 02:57

చెన్నై, నవంబర్ 18: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జయలలిత నెచ్చెలి, ప్రస్తుతం జైలులో ఉన్న వీకే శశికళ ఉపయోగించిన గదిలో, కార్యాలయ బ్లాక్‌లో శుక్రవారం రాత్రి తనిఖీలు ప్రారంభించినట్లు ఐటీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి శనివారం తెలిపారు.

11/19/2017 - 02:52

జమ్ము, నవంబర్ 18: ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ (పీవోకే)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, సినీ నటుడు రిషికపూర్‌లపై ‘దేశద్రోహ నేరం’ కింద కేసులు నమోదు చేయాలని సుకేశ్ ఖజూరియా అనే సామాజిక కార్యకర్త ఇక్కడి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటిజన్స్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా గతంలో పనిచేసిన ఖజూరియా..

11/19/2017 - 02:51

న్యూఢిల్లీ, నవంబర్ 18: రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20, 21 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ శనివారం తెలిపింది.

11/19/2017 - 02:50

బలియా (యూపీ), నవంబర్ 18: వివాదాస్పద అయోధ్య సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరపుతానంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న ప్రకటనలను సమాజ్‌వాదీ పార్టీ ఎద్దేవా చేసింది. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలన్న కుట్రలో భాగమే రవిశంకర్‌ను రంగంలోకి దించారని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామశంకర్ విద్యార్థి విమర్శించారు.

11/19/2017 - 02:50

న్యూఢిల్లీ, నవంబర్ 18: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కుల రాజకీయం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరోసారి విజయం సాధించటం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీ, ఈసారి ఏ విధంగానైన అధికారంలోకి రావాలనే పట్టుదలతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకులు కుల సమీకరణాలకు తెరతీశారు.

11/19/2017 - 02:49

కోచి, నవంబర్ 18: హిమచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కఠోర దీక్షతో పనిచేస్తున్నారని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గెలుపు తథ్యమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

11/19/2017 - 01:50

న్యూఢిల్లీ, నవంబర్ 18: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును ఆమోదించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సోమవారం సమావేశం కానుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం మొదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Pages