S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2017 - 01:21

రోహ్తక్ (హర్యానా), ఆగస్టు 28: రేపిస్ట్ బాబాకు తగిన శిక్షే పడింది. ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాసచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు.

08/29/2017 - 01:18

న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారతదేశ 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. డిసెంబర్ 16 గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నేరగాళ్లకు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలని కూడా తీర్పు చెప్పింది ఈయనే.

08/29/2017 - 01:15

న్యూఢిల్లీ, ఆగస్టు 28: డోక్లామ్ బలాబలాల పరీక్షలో చైనాపై భారత్ విజయం సాధించింది. డోక్లామ్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు రెండు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఈ మేరకు సైన్యాల ఉపసంహరణ ప్రారంభమైందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు.

08/28/2017 - 02:22

న్యూఢిల్లీ, ఆగస్టు 27: స్పష్టమైన లక్ష్యాలతో 2020 నాటికి నవ భారత దేశ నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 80 మంది అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల బృందంతో ఆదివారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ విజ్ఞప్తి చేశారు.

08/28/2017 - 02:20

పాట్నా, ఆగస్టు 27: కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా ‘మంచి రోజుల’ జాడ తెలియడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం పాట్నాలో జరిగిన విపక్షాల ర్యాలీలో మాట్లాడిన మమత దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు చెక్కలు కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం, లాలూ ప్రసాద్ విజయం తథ్యమంటూ జోస్యం చెప్పారు.

08/28/2017 - 02:13

చెన్నై, ఆగస్టు 27: దేశం పురోగమించడానికి ప్రజలంతా సంఘటితం కావాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం అన్నా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

08/28/2017 - 02:11

న్యూఢిల్లీ, ఆగస్టు 27: స్వచ్ఛతే సేవ అన్న సరికొత్త ఉద్యమాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ, దేశంలో 67శాతం మంది జనాభాకు ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయని, అలాగే 2 లక్షల 30వేల గ్రామాలు మరుగుదొడ్ల సమస్యకు దూరమయ్యాయని స్పష్టం చేశారు.

08/28/2017 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశంలో యువత కంప్యూటర్‌లలో ఆటలు ఆడటం మాని, మైదానాలకు వెళ్లి ఆడాలని, చెమటోడ్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ యువ దేశమని, ఇది క్రీడల్లో ప్రతిఫలించాలని ఆయన అన్నారు. ప్లేస్టేషన్‌లో ఆడటం కంటే, మైదానాల్లో ఆడటం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జయంతిని గుర్తు చేసుకున్నారు.

08/28/2017 - 02:07

చండీగఢ్, ఆగస్టు 27: ఈ నెల 25న సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుకావడం కోసం డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పంచకుల వచ్చినప్పుడు ఆయన భద్రతా వలయంలోని ఏడుగురు భద్రతా సిబ్బందిపై దేశద్రోహం, హత్యాయత్నం ఆరోపణల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో హర్యానా పోలీసుకు చెందిన అయిదుగురు పోలీసులు కూడా ఉన్నారు.

08/28/2017 - 02:07

న్యూఢిల్లీ, ఆగస్టు 27: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్‌ను సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం దేశ రాజధానిలో జరిగిన హింసాకాండలో అల్లర్లకు పాల్పడిన పదిమందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతి నగర్‌లో బస్సును తగలబెట్టిన ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pages