S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/28/2017 - 01:06

న్యూఢిల్లీ, ఆగస్టు 27:మత విశ్వాసాల పేరిట ఎలాంటి హింసాకాండను సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. డేరా బాబా గుర్మీత్ సింగ్‌ను ఓ అత్యాచార కేసులో కోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో జరిగిన హింసాకాండను పరోక్షంగా ప్రస్తావించిన మోదీ ‘ఎవరికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు. ఎవరైనా చట్టం ముందు తల వంచాల్సిందే’నని ఉద్ఘాటించారు.

08/27/2017 - 03:43

పంచకుల, ఆగస్టు 26: ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో హర్యానాలోని వివాదాస్పద డేరా సచ్చా సౌదా ఆశ్రమం అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషిగా ప్రకటించింది. కాగా, ఆయనకు విధించే శిక్షను సోమవారం (28న) ప్రకటిస్తామని జడ్జి తెలిపారు.

08/27/2017 - 03:41

పంచకుల (హర్యానా), ఆగస్టు 26: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను శుక్రవారం స్థానిక కోర్టు దోషిగా ప్రకటించిన వెంటనే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున హింసాకాండకు దిగడంతో రాష్టమ్రంతా ఒక్కసారిగా భగ్గుమంది. పంచకులలో డేరా సచ్చాసౌదా బాబా మద్దతుదారులు వాహనాలను, ప్రైవేటు ఆస్తులను తగుల బెట్టడంతో పాటు హింసాకాండకు దిగారు.

08/27/2017 - 03:37

చండీగఢ్, ఆగస్టు 26: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా ఆశ్రమం చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే ఆయనకు ఉన్న జడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించడం జరిగిందని హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎస్ ధేసి శనివారం ఇక్కడ చెప్పారు. అంతేకాదు, రామ్ రషీమ్‌ను రోహ్టక్ జైల్లోప్రత్యేక వ్యక్తిగా చూస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు.

08/27/2017 - 03:35

నల్లగొండ/చిట్యాల, ఆగస్టు 26: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్హ్రీమ్‌సింగ్ అలియాస్ డేరా బాబాకు నల్లగొండ జిల్లాలో సైతం ఆస్తులున్నాయ. ఆశ్రమ స్థాపన పేరుతో పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని భూముల కొనుగోలు చేపట్టారు. 55 ఎకరాల భూములు రైతుల నుండి కొనుగోలు చేశారు.

08/27/2017 - 03:46

చండీగఢ్, ఆగస్టు 26: డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌ను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత శుక్రవారం పంచకులలో చెలరేగిన హింసాకాండ పట్ల హర్యానా ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రధాని నరేంద్ర మోదీపై సైతం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి.. బిజెపికి కాదు’ అని వ్యాఖ్యానించింది.

08/27/2017 - 03:31

పూర్నియా, ఆగస్టు 26: బిహార్‌లో వరద పీడిత ప్రాంతాల్లో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణ సహాయం కింద 500 కోట్ల రూపాయల సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపనున్నట్టు మోదీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వేకు సంబంధించిన వివరాలు పిఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

08/27/2017 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయాల కంటే విదేశీ పర్యటనల పట్ల ఎక్కువ మక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ‘బిజెపి బగావో-దేశ్‌కు బచావో’ (బిజెపిని పారదోలండి, దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తుంటే, వీటికి హాజరుకాకుండా నార్వే ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఓస్లో వెళ్లిపోయారు.

08/27/2017 - 01:31

పంచకుల/ సిర్సా, ఆగస్టు 26: బాబా ముసుగులో ఓ దొంగసన్యాసి తాను చేసిన నేరానికి శిక్ష వేసినందుకు 37మంది ప్రాణాలను బలిగొన్నాడు. వందల కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసానికి కూడా కారణమైనాడు.

08/27/2017 - 01:25

శ్రీనగర్, ఆగస్టు 26: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ పోలీస్ క్యాంప్‌పై శనివారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనూహ్యమైన ఈ దాడిలో నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లతో సహా మొత్తం 8మంది భద్రతా సిబ్బంది మరణించారు. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు.

Pages