S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/20/2017 - 02:55

గోరఖ్‌పూర్, ఆగస్టు 19: గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పెద్ద సంఖ్యలో చిన్నారుల మరణానికి ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఇంతకుముందు కూడా బిఆర్‌డి ఆస్పత్రిని సందర్శించానని, చాలా కొరతలున్నందున ఆస్పత్రికి నిధులు అవసరమని మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పానని, అయితే ఎలాంటి చర్యా తీసుకోలేదని రాహుల్ అన్నారు.

08/20/2017 - 02:49

హైదరాబాద్, ఆగస్టు 19: కేరళలో జరుగుతున్న మత మార్పిడులపై రాష్ట్రప్రభుత్వం నివేదిక కోరామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ పేర్కొన్నారు.

08/20/2017 - 02:23

స్వచ్ఛ్భారత్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శనివారం తమిళనాడులోని మదురై జిల్లా కలెక్టర్
వీర రాఘవరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన మానవ హారం

08/20/2017 - 02:21

న్యూఢిల్లీ, ఆగస్టు 19: మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ శవమై కనిపించిన ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోటల్‌లోని సూట్‌ను మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ బృందం మరోసారి పరిశీలించనుంది. ఈ సూట్‌కు వేసిన సీలును తెరవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన హోటల్ మేనేజిమెంట్ ఈ విషయాన్ని శనివారం న్యాయస్థానానికి తెలియజేసింది.

08/20/2017 - 01:35

పాట్నా, ఆగస్టు 19: ఎన్డీఏ కూటమిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతత్వంలోని జెడి(యు) మళ్లీ భాగస్వామిగా మారింది. శనివారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

08/20/2017 - 01:10

ముజఫర్‌నగర్, ఆగస్టు 19: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది మృతి చెందారు. 80మందికిపైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం కథౌలీ ప్రాంతంలో హైస్పీడ్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అతి వేగంగా వెళ్తుండటంతో దాదాపు 14బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపై ఒకటి ఎక్కేసాయి. ట్రాక్ పక్కనే ఉన్న ఓ ఇంటిపై బోగీలు పడటంతో ఇల్లు ధ్వంసమైంది.

08/19/2017 - 03:19

బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు గోపాల్‌గంజ్‌లో ఓ వృద్ధురాలిని మంచంమీద సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న బంధువులు. భేటియాలో ఎయర్‌ఫోర్సు సిబ్బంది వేసిన ఆహారం పాకెట్లను తీసుకెళుతున్న వరద బాధితులు.
వరద ప్రాంతాల ప్రజలకు సహాయార్ధం ఆహారం, నిత్యావసరాలతో కూడిన వ్యాన్‌కు జెండా ఊపి ప్రారంభిస్తున్న బీహార్ డిప్యూటీ సిఎం సుశీల్‌కుమార్ మోదీ

08/19/2017 - 03:14

లక్నో, ఆగస్టు 18: గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దాఖలయిన ఒక ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై పూర్తి వివరాలతో ఒక కౌంటర్ అఫిడవిట్‌ను ఆరువారాల్లోగా దాఖలు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ జనరల్‌ను శుక్రవారం ఆదేశించింది. అనంతరం హైకోర్టు లక్నో బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.

08/19/2017 - 03:13

చెన్నై, ఆగస్టు 18: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు, శిక్షాకాలం పూర్తి కాకముందే తమను విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసుకొన్న ఒక పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వం తాజాగా మరో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలనుకున్నామని శుక్రవారం చెప్పడంతో మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది.

08/19/2017 - 03:12

న్యూఢిల్లీ, ఆగస్టు 18: అత్యాచారానికి గురయిన పదేళ్ల బాలికకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, చండీగఢ్ పాలనాయంత్రాంగం సమాధానాలను కోరింది. అత్యాచారం కారణంగా గర్భవతి అయిన ఆ బాలిక గురువారం ఓ శిశువుకు జన్మనిచ్చింది కూడా.

Pages