S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2017 - 23:59

భువనేశ్వర్, జూన్ 13: రాష్ట్భ్రావృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నవీన్‌పట్నాయక్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేసే అర్హత లేదని కేంద్ర మంత్రి వికె సింగ్ స్పష్టం చేశారు. ‘అభివృద్ధిని కిందిస్థాయికి తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 17 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెడి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి’ అని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సింగ్ అన్నారు.

06/13/2017 - 23:59

భువనేశ్వర్, జూన్ 13: జనానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పాస్‌పోర్టు సదుపాయాన్ని మరింత చేరువ చేయడం కోసం రాబోయే రెండేళ్లలో దేశంలోని 800 జిల్లా ప్రధాన పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ మంగళవారం ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు.

06/13/2017 - 23:58

చెన్నై, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, తమిళనాడు ఇసుక మైనింగ్ వ్యాపారి జె శేఖర్ రెడ్డిపై జరుపుతున్న మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన 50 కిలోల బరువుండే బంగారు దిమ్మలు, గోల్డ్ బార్‌లను అటాచ్ చేసింది.

06/13/2017 - 03:03

చిత్రం.. ఢిల్లీలో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

06/13/2017 - 03:01

కోల్‌కతా, జూన్ 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించడంతో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ రిటైర్మెంట్‌లోను సరికొత్త రికార్డు సృష్టించారు. సోమవారం ఆయన కోల్‌కతా హైకోర్టు జడ్జిగా రిటైరయ్యారు.

06/13/2017 - 03:00

పాట్నా, జూన్ 12: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది సామెత. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ భార్య రబ్రీ దేవి అక్షరాలా ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. బిహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తన ఇద్దరు కుమారులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వి ప్రసాద్ యాదవ్‌లకు ఎలాంటి అమ్మాయిలు భార్యలుగా రావాలని కోరుకుంటున్నారో కూడా ఆమె బహిరంగంగానే ప్రకటించారు కూడా.

06/13/2017 - 02:58

బెంగళూరు, జూన్ 12: అధికారంలో ఉన్నవాళ్లు జవాబుదారీగా వ్యవహరించడానికి, పౌరుల హక్కులను కాపాడడానికి బాధ్యతాయుతమైన, స్వేచ్ఛాయుత మీడియా అవసరమని ఉప రాష్టప్రతి హమిద్ అన్సారీ అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్‌రాయ్ నివాసాలపై సిబిఐ ఇటీవల దాడులు జరపడం, పత్రికా స్వేచ్ఛపై అధికార దాడిగా ఈ దాడులను ఎన్డీటీవీ అభివర్ణించడం తెలిసిందే.

06/13/2017 - 02:56

బెంగళూరు, జూన్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితులను చితకబాదడం, మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేయడం, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లను బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడ్డంద్వారా నిజం గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

06/13/2017 - 02:54

న్యూఢిల్లీ, జూన్ 12: ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన నిబంధన వివక్షాపూరితమైందని, రెండు వర్గాలను సృష్టిస్తుందన్న వాదన నమ్మదగ్గదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

06/13/2017 - 02:52

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయులకు సైతం సాధికారికత కల్పించడం ద్వారా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే తన మాటను నిలబెట్టుకున్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

Pages