S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/17/2017 - 00:46

న్యూఢిల్లీ,జూన్ 16: రాష్టప్రతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల శాసన సభలలోని ఒక్క ఎమ్మెల్యేకు ఒకే ఓటు విలువ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఏపీ విభజన తర్వాత మొదటి సారిగా జరగుతున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ మార్పు లేకుండా సమానంగా ఉండే విధంగా చర్యలు తీసుకొవాలని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

06/17/2017 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 16: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి అభసంశనకు తాజాగా చేసిన ప్రయత్నం మళ్లీ విఫలమైంది. గత కొద్ది నెలలుగా రాజ్యసభ ఎంపీలు జస్టిస్ నాగార్జున రెడ్డి అభిసంశనకు విఫలయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

06/17/2017 - 00:44

శ్రీనగర్, జూన్ 16: జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై భారీ ఆయుధాలు ధరించిన మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక స్టేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అచబల్ గ్రామం వద్ద సాయుధ మిలిటెంట్లు పోలీసు వాహనంపై దాడి చేశారు.

06/17/2017 - 00:43

న్యూఢిల్లీ, జూన్ 16: రాష్టప్రతి అభ్యర్థి పేరు చెప్పనంత వరకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బిజెపి త్రిసభ్య కమిటీ సభ్యులకు తెగేసి చెప్పారని తెలిసింది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై శుక్రవారం ఇక్కడ సోనియాగాంధీతో చర్చించారు.

06/17/2017 - 00:42

న్యూఢిల్లీ, జూన్ 16: మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితులుగా ఉన్న ట్రీనిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెట్ డైరెక్టర్ పిఎస్ పార్ధసారధి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెట్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేసింది.బెయిల్ కోసం పార్థసారధి,శర్మలు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌కే అగర్వాల్,జస్టిస్ సంజయ్ కిషాన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ

06/16/2017 - 03:18

న్యూఢిల్లీ, జూన్ 15: రాహుల్ గాంధీ తన అమ్మమ్మను చూసేందుకు ఇటలీకి వెళ్లిపోవటంపట్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నిక, ప్రతిపక్షం రైతుల సమస్యలపై ఎన్‌డిఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తన్న తరుణంలో రాహుల్ గాంధీ తన అమ్మమ్మను చూసేందుకు ఇటలీ వెళ్లటం ఏమిటంటూ పార్టీకి చెందిన కొందరు నాయకులు మండిపడుతున్నారు.

06/16/2017 - 03:16

కినాలూర్ (కేరళ), జూన్ 15: గతంలో ఎన్నడూలేని విధంగా దేశంలో క్రీడోత్సాహం వెల్లివిరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్రీడల్లో కెరీర్ ఆప్షన్‌గా తీసుకునేందుకు యువత పెద్దఎత్తున ముందుకు వస్తోందని తెలిపారు.

06/16/2017 - 03:14

న్యూఢిల్లీ, జూన్ 15: కొత్త రాష్టప్రతి ఎంపిక వ్యవహారంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గురువారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్‌సిపి అధినాయకుడు శరద్‌పవార్‌తో చర్చలు జరిపారు. తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు పెళ్లికి హాజరయ్యేందుకు గతరాత్రి ఆంధ్రప్రదేశ్ వెళ్లిన వెంకయ్య నాయుడు అక్కడే చంద్రబాబుతో కొత్త రాష్టప్రతి ఎంపికపై చర్చలు జరిపారు.

06/16/2017 - 03:13

న్యూఢిల్లీ, జూన్ 15: రాష్టప్రతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై బిజెపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రథయాత్ర ద్వారా బిజెపిని మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావటంతోపాటు పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన లాల్‌కృష్ణ అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయాలంటూ షాట్‌గన్‌గా గుర్తింపు పొందిన బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపీ శతృఘ్నసిన్హా ట్వీట్లయుద్ధం మొదలు పెట్టారు.

06/16/2017 - 03:11

డార్జిలింగ్, జూన్ 15: పశ్చిమ బెంగాల్‌లోని పర్వత ప్రాంతమైన డార్జిలింగ్‌లో వేర్పాటువాదులు, పోలీసులు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాద సంస్థ గోర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) చీఫ్ బిమల్ గురంగ్ నివాసం దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. తనీఖీల్లో భాగంగా పోలీసులు 300 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Pages