S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2017 - 01:40

ముంబయి, మార్చి 4: దేశమంతటా ఒకే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని జూలై ఒకటి నుంచి అమలు చేసే దిశగా మరో కీలక అడుగుపడింది. ముంబయిలో శనివారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జిఎస్‌టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) చట్టాల ముసాయిదాలకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. రాష్ట్రాలు చేసిన 26మార్పుల సిఫార్సులను కౌన్సిల్ పూర్తిగా అంగీకరించింది.

03/04/2017 - 04:22

భద్రాచలం, మార్చి 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం మెరుపుదాడి చేసి ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వ్యూహాత్మకంగా యు ఆకారంలో చుట్టుముట్టి భద్రతా బలగాలపై నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు.

03/04/2017 - 03:00

మీర్జాపూర్, మార్చి 3: ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు కరెంట్ షాక్‌లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

03/04/2017 - 02:59

చెన్నై, మార్చి 3: మన ప్రాంతంలో ఎల్లవేళలా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రగతి, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపాలని కోరుకునే వారి చర్యలను గట్టిగా తిప్పికొట్టవలసిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ‘బహుళ ధ్రువ, బహుముఖ ప్రపంచంలో భారత్ బాధ్యతాయుతమైన ఎదుగుతున్న దేశం.

03/04/2017 - 02:57

వారణాసి, మార్చి 3: ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్నికల వేడి రాజుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వారణాసి ఒకటి. పోలింగ్ గడువుసమీపిస్తున్న దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు దీనిపైనే దృష్టి సారించాయి.

03/04/2017 - 02:55

న్యూఢిల్లీ, మార్చి 3: బినామీ లావాదేవీలు జరిపే వారు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఎదుర్కోవడంతో పాటుగా ఆదాయం పన్ను చట్టం కింద భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆదాయం పన్ను శాఖ శుక్రవారం హెచ్చరించింది. ‘1988 నాటి బినామీ లావాదేవీల చట్టం ఇప్పుడు 2016 నవంబర్ 1నుంచి అమలులోకి వచ్చింది గనుక బినామీ లావాదేవీలకు పాల్పడవద్దు. నల్లధనం అనేది మానవత్వానికే మాయని మచ్చ.

03/04/2017 - 02:53

న్యూఢిల్లీ, మార్చి 3: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌పై తాము జరిపే జిహాదీ దాడిలో చేతులు కలుపుతాడని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ వెల్లడించింది. జమాత్ ఉద దవాతో కలిసి దావూద్ కంపెనీ జిహాదీ కార్యక్రమాలు నడుపుతోందని జైషే చీఫ్ హాఫీజ్ సరుూద్ కొడుకు తల్హా చెప్పాడు. హఫీజ్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నందున అతడి కొడుకు తల్హా సంస్థ బాధ్యతలు చూస్తున్నాడు.

03/04/2017 - 02:51

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రపంచ శ్రేణి నగరంగా రూపు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్న అమరావతి నగరానికి చేయూతను అందజేసేందుకు ఖ్యాతి గాంచిన సంస్థ ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (టెరి-్ఢల్లీ) ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గ్రీన్ ఎనర్జీలో నూతన సాంకేతిక విధానాలను అమలు చేసేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది.

03/04/2017 - 02:51

న్యూఢిల్లీ, మార్చి 3: దేశంలో 2,400 సింహాలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే వెల్లడించారు. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని శుక్రవారం ఆయన తెలిపారు. సింహాల సంఖ్య విషయానికి వస్తే ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం అంటే 70 శాతం అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వ్యన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీ జూలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

03/04/2017 - 02:02

న్యూఢిల్లీ, మార్చి 3: రుణభారం, పంటల వైఫల్యం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు దారితీస్తున్న వాస్తవ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళుతోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pages