S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2017 - 02:50

ఇంఫాల్, మార్చి 4: మణిపూర్ అసెంబ్లీలో 38 సీట్లకు శనివారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. 84 శాతం పోలయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయడానికి జనం బారులుతీరారు. దాదాపు అన్ని బూత్‌ల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

03/05/2017 - 02:48

జాన్‌పూర్, మార్చి 4: దేశ భద్రతకోసం సర్జికల్ దాడులకు నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు వాటిని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. సమాజ్‌వాది పార్టీకి అవినీతి తప్ప మరోటి తెలియదని, మహిళల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.

03/05/2017 - 02:46

వారణాసి, మార్చి 4: హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి శనివారం ఎన్నికల నినాదాలు, రోడ్‌షోలతో హోరెత్తిపోయంది. ప్రధాని నరేద్ర మోదీకి సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రధాని మోదీ రోడ్‌షోకు అనూహ్య స్పందన కనిపించింది. బిజెపి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు జేజేలు పలికారు.

03/05/2017 - 02:41

మథుర, మార్చి 4: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా సూచనప్రాయంగా తెలిపారు. రామ మందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ‘వారం రోజుల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

03/05/2017 - 02:37

ముంబై, మార్చి 4: ముంబై మేయర్ పదవి శివసేనకే దక్కనుంది. ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో బిజెపి, శివసేన రెండు సీట్ల తేడాతో సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబైలో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయ. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన శివసేన 84 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తే 82 సీట్లు గెలుచుకున్న బిజెపి రెండోస్థానంలో నిలిచింది.

03/05/2017 - 02:26

ఫతేహాబాద్, మార్చి 4: కాలప్రవాహం లో అంతర్వాహినిగా మారిన సరస్వతి నది జాడలు తెలుసుకోవడం కోసం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో హరప్పా నాగరితకు ముందు నాటి అవశేషాలు బయల్పడ్డాయి. ఇవి దాదాపు 6 వేల ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు.

03/05/2017 - 02:25

న్యూఢిల్లీ, మార్చి 4: ఉత్తరప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్ ప్రసారం, ప్రచురణలపై నిషేధాన్ని మార్చి 9వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

03/05/2017 - 02:10

న్యూఢిల్లీ, మార్చి 4: ఉత్తరప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్ ప్రసారం, ప్రచురణలపై నిషేధాన్ని మార్చి 9వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

03/05/2017 - 01:54

న్యూఢిల్లీ, మార్చి 4: సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య పూర్తి అవగాహన కుదిరింది రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇకమీదట రాష్ట్రాల్లో చెక్ పోస్టులు ఉండవని, దేశవ్యాప్తంగా ఈ-వే బిల్ వ్యవస్థ అమల్లోకి రాబోతోందన్నారు. శనివారం కుదిరిన అవగాహన మేరకు సరుకుల గుర్తింపు, ధరలు, పరిమాణం తదితర వివరాల తనిఖీ అధికారం రాష్ట్రాలకే ఉంటుందన్నారు.

03/05/2017 - 01:42

న్యూఢిల్లీ, మార్చి 4: సముద్ర తీరంనుంచి పనె్నండు నాటికల్ మైల్స్ దూరం వరకు జరిగే వాణిజ్య లావాదేవీలను ఆయా రాష్ట్రాల పరిధిలోకి వచ్చేలా జిఎస్‌టి చట్టంలో సవరణలు చేశారు. ఆయా రాష్ట్రాల సముద్ర తీరంలో జరిగే లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జిఎస్‌టి సమాఖ్య సమావేశాల్లో వాదించారు.

Pages