S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/28/2017 - 02:46

మావు (యూపి) ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్‌లో ఓటమి దాదాపు ఖరారని నిర్ధారించుకున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్ పార్టీలు కొత్త గేమ్‌కు తెరలేపాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మావులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘మూడో దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎస్పీ, బిఎస్పీలకు తమ ఓటమి ఖాయమని అర్థమైపోయింది. దీంతో కొత్త అంకానికి తెరలేపాయి.

02/28/2017 - 02:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎర్నాకులం (కేరళ)- హౌరా (పశ్చిమ బెంగాల్)ల మధ్య నడిచే అంత్యోదయ (అన్‌రిజర్వ్‌డ్) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సోమవారం ప్రారంభించారు.

02/28/2017 - 02:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో 54 మంది కోటీశ్వరులు రంగంలో ఉన్నారు. మార్చి 4న ఇక్కడ మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయని ఎలక్షన్‌వాచ్ అంట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్) సంస్థ వెల్లడించింది. 167 మంది అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన తరువాత ఏడిఆర్ ఈ వివరాలు అందజేసింది.

02/28/2017 - 02:41

లక్నో, ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సోమవారం జరిగిన ఐదో విడత ఎన్నికల్లో 57.36 శాతం పోలింగ్ నమోదయంది. సాయంత్రం 4 గంటలకు 1.81 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 57.36 శాతం పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 11 జిల్లాల పరిధిలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరిగాయి. అమేధీ, ఫైజాబాద్‌లపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

02/28/2017 - 02:39

బాలియా, ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్‌లో గూండారాజ్యాన్ని పారదోలతానని బిఎస్పీ అధినేత్రి మాయవతి ఇచ్చిన హామీని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవా చేశారు. పేరు మోసిన నేరగాళ్లు ముక్తార్ అన్సారీ, అతడి సోదరుడు అఫ్జల్ ఫొటోలు పోస్టర్లలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్న బిఎస్పీకి గూండా రాజ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని షా విరుచుకుపడ్డారు.

02/28/2017 - 02:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కార్గిల్ అమర జవాను కెప్టెన్ మన్‌దీప్‌సింగ్ కూతురు ఫేస్‌బుక్‌లో ఏబివిపికి వ్యతిరేకంగా మొదలు పెట్టిన ప్రచారం సామాజిక మాధ్యమంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాలతో ట్విట్టర్ యుద్ధం మొదలైంది. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని అయిన గుర్మెహర్ కౌర్ (24) ఫేస్‌బుక్‌లో ‘నేను ఏబివిపికి భయపడను, నా తండ్రిని పాకిస్తాన్ చంపలేదు.

02/27/2017 - 03:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత నావికాదళం తన యుద్ధ సన్నద్ధతను సమీక్షించుకునేందుకు భారీ విన్యాసాలను నిర్వహించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న జలాంతర్గామితో పాటు, యుద్ధ విమానాల్ని తీసుకువెళ్లే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, సుఖో య్-30, జాగ్వర్ ఫైటర్ జెట్‌లు, వంటి వాటితో ఆపరేషనల్ ఎక్సర్‌సైజ్ (ట్రాపెక్స్- 2017) నిర్వహించింది.

02/27/2017 - 02:58

షిల్లాంగ్, ఫిబ్రవరి 26: మేఘాలయలోని పశ్చిమ కాశి హిల్స్ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది చనిపోగా, మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న కాంక్రీట్బారికేఢ్ను ఢీకొని బోల్తాపడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లా ప్రధాన కేంద్రమైన నోంగ్‌స్టోయిన్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని దోహ్‌క్రోహ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

02/27/2017 - 02:57

మహరాజ్‌గంజ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 26: ఉత్తరప్రదేశ్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నాశనం చేస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలతో సంతుష్ట, కుల, వారసత్వ రాజకీయాలకు తెరపడటం ఖాయమని ఆయన అన్నారు.

02/27/2017 - 02:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సైన్యంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఆదివారం ఉదయం పుణె జోన్‌లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆర్మీ పరీక్షను రద్దు చేసింది. కాగా ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి థానె పోలీసులు 18 మందిని అరెస్టు చేసి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ధ్రువీకరించడంతో ఈ పరీక్షను రద్దు చేశారు.

Pages