S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/01/2017 - 03:28

హైదరాబాద్, ఫిబ్రవరి 28: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డిఆర్ డోలె బర్మన్ నియమితులయ్యారు. డైరెక్టర్ అరుణ బహుగుణ పదవీ కాలం ముగిసినందున మంగళవారం పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్‌గా బర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 (జమ్ము అండ్ కాశ్మీర్ కేడర్) బ్యాచ్‌కు చెందిన బర్మన్ ఇండోర్‌లోని నార్త్, ఈస్టర్న్ అకాడమీలో డైరెక్టర్‌గా ఉన్నారు.

03/01/2017 - 03:24

హైదరాబాద్, ఫిబ్రవరి 28: పుణెకు చెందిన ఓ ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్‌నగర్‌లోని నిసా కేంద్రంలో మంగళవారం ఎస్‌ఐ స్వాతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహరాష్ట్ర పుణెలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న స్వాతి తన స్నేహితురాలిని కలిసేందుకు ఈనెల 24న హైదరాబాద్‌కు వచ్చింది. ఎస్‌ఐ స్వాతి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ అని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

03/01/2017 - 03:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశంలో వివిధ నగరాల్లో హైదరాబాద్ నగరానికి పట్టణ ప్లానింగ్‌లో నాలుగో స్థానం, పట్టణ పరిపాలనలో ఐదోస్థానం లభించింది. దేశం వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నాలుగు అంశాల్లో జనాగ్రహ అనే స్వచ్ఛంద సంస్థ 2016 సంవత్సరానికి ర్యాంకులను మంగళవారం నాడు ఢిల్లీలో ప్రకటించింది. మొత్తం 80 అంశాలను పరిగణలోకి తీసుకోన్న ఈ సంస్థ మొత్తం 21 నగరాల్లో అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది.

03/01/2017 - 01:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: హైకోర్టు విభజన అనివార్యంగా ఆలస్యమవుతోందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ప్రధాని మోదీ ఆరా తీసినట్టు తెలిసింది. హైకోర్టు విభజనకు కేంద్రంపై తెలంగాణ వత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ఈ అంశం ఇరువురి భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

03/01/2017 - 01:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి 375 మిలియన్ డాలర్ల (రూ.2500 కోట్లు) రుణం గ్రాంట్ల ద్వారా ఇచ్చేందుకు ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ఆమోదం తెలిపింది. ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా మంగళవారం భారత ప్రభుత్వం, ఎడిబి మధ్య ఒప్పం దం కుదిరింది.

02/28/2017 - 05:07

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 27: మరో మూడు భారీ ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇటీవల 104 ఉపగ్రహాలను ప్రయోగించి విజయం సాధించిన ఇస్రో శాస్తవ్రేత్తలు అదే ఉత్సాహంతో మరో భారీ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేష్ కేంద్రం వేదిక కానుంది.

02/28/2017 - 04:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్టప్రతితో పాటు, హోంశాఖ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. గవర్నర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్టప్రతితో చర్చించినట్టు తెలుస్తోంది.

02/28/2017 - 03:32

చెన్నై, ఫిబ్రవరి 27: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షపై రాష్టమ్రుఖ్యమంత్రి పళనిస్వామికి అసెంబ్లీ స్పీకర్‌కు, కార్యదర్శి, హోమ్‌కార్యదర్శికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాత్కాలిక న్యాయమూర్తి హుతువాది రమేష్, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.

02/28/2017 - 02:49

లక్నో, ఫిబ్రవరి 27: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ విభజన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ బిఎస్పీ అధినేత్రి మాయవతి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నిద్రాణంగా ఉన్న విభజన డిమాండ్‌కు ఒక్కసారిగా కదలిక వచ్చింది. ‘బిఎస్పీ అధికారంలోకి వస్తే ఇక వౌనం వహించం. యూపీని నాలుగు చిన్న రాష్ట్రాలుగా చేసి చూపుతాం.

02/28/2017 - 02:48

డియోరియా (యూపీ), ఫిబ్రవరి 27: ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైలు హామీ ఏమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ఆనక వాటి అమలు విషయంలో ఘోరంగా విఫలమయ్యారని సోమవారం ఆరోపించారు. ఇంకో చాన్స్ ఎలాగూ ఉండదు కాబట్టి బుల్లెట్ రైలు హామీ అమలుచేసి చూపండి అంటూ సవాల్ చేశారు.

Pages