S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/16/2017 - 01:20

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పోటీలో 3దంగల్2 సత్తా చాటింది. హర్యానా కుస్తీవీరుడు మహావీర్‌సింగ్ ఫొగట్, ఆయన ఇద్దరు తనయల జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రాన్ని మూడు ప్రధానమైన అవార్డులు వరించాయి. ఉత్తమచిత్రంతోపాటు దీనిని రూపొందించిన నితీశ్ తివారీకి ఉత్తమ దర్శకుడిగా, ప్రధానపాత్ర పోషించిన అమీర్‌ఖాన్‌కు ఉత్తమ నటుడిగా పురస్కారాలు దక్కడం విశేషం.

01/14/2017 - 02:38

న్యూఢిల్లీ, జనవరి 13: పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని విచారించేది లేదని, ఆయనకు సమన్లు పంపబోమని ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దుపై వివరణ కోరేందుకు మోదీని పిలిచే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ సభ్యుడు, పిఎసి చైర్మన్ కెవి థామస్ చేసిన వాదనను పిఎసి తోసిపుచ్చింది. బిజెపి సభ్యుల అభ్యంతరాలు కూడా ఇందుకు దారితీశాయి.

01/14/2017 - 02:29

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభలో ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలయిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్)ను సమర్థించే చట్టపరమైన నిబంధనలను తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్‌కు సూచించింది.

01/14/2017 - 02:23

న్యూఢిల్లీ, జనవరి 13:కొత్త ఆలోచనలకు తమ ప్రభుత్వం పట్టం కడుతుందని, అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు సమగ్ర ఆలోచనా దృక్పథంతోనే ముందుకు వెళ్లాలని, గట్టి ఫలితాలపైనే దృష్టి పెట్టాలని కోరారు.

01/14/2017 - 02:17

బరాసత్, జనవరి 13:పెద్ద నోట్ల రద్దును నిరసిస్తున్న తమ పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తనతో పాటు తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ అరెస్టు చేయాలని సిబిఐకి సవాలు విసిరారు.

01/14/2017 - 02:14

న్యూఢిల్లీ, జనవరి 13: కొత్త పేదరికం రేఖపై ఒక అభిప్రాయానికి రావడం కోసం నీతి ఆయోగ్ త్వరలోనే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పేదరికానికి సంబంధించి చాలా రాష్ట్రాల అభిప్రాయాలు కలవనందున దీనిపై ఒక నిపుణుల కమిటీ అవసరమని తాము ఇంతకు ముందే చెప్పామని, నిపుణుల కమిటీని ఇంకా నియమించలేదు కానీ, త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆ అధికారి చెప్పారు.

01/14/2017 - 02:12

న్యూఢిల్లీ, జనవరి 13:కోడి పందేలను రద్దుచేస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పందేలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వా యంత్రాంగానిదేనని స్పష్టం చేసింది. కోడి పందేలు రద్దు చేస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో పందేలు నిర్వహిస్తున్నారంటూ జాతీయ జంతు సంరక్షణ సంస్థ సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించింది.

01/14/2017 - 01:59

తిరువనంతపురం, జనవరి 13: కేరళలో అత్యం త ఎత్తయిన పర్వతాల్లో ఒకటయిన అగస్త్య కూడమ్‌ను మహిళలు ఎక్కడంపై ఎలాంటి నిషేధం లేదని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కె రాజు శుక్రవారం స్పష్టం చేశారు. కొండ శిఖరంపైకి వెళ్లేటప్పుడు మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని మాత్రమే అటవీ శాఖ తెలియజేసింది తప్ప పర్వతం ఎక్కడంపై ఎలాంటి నిషేధం లేదని మంత్రి స్పష్టం చేశారు.

01/14/2017 - 01:54

న్యూఢిల్లీ, జనవరి 13: పరిస్థితి తీవ్రమైతే తదుపరి దాడులు అనివార్యంగా మారితే మరోసారి ఆధీనరేఖ ప్రాంతంలో లక్షిత దాడులు జరపడానికి తాము వెనకాడేది లేదని ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ పాక్‌ను హెచ్చరించారు. పరిస్థితులు విషమిస్తే భారత్ ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి లక్షిత దాడులు నిదర్శనమన్నారు.

01/14/2017 - 01:47

న్యూఢిల్లీ, జనవరి 13: ఖాదీ గ్రామోద్యోగ్ కేలండర్, డైరీపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం ముద్రించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ సహా పలు సంస్థలు దీనిపై మండిపడుతుండగా పిఎంవో మాత్రం కొట్టిపారేసింది. అనవసర రాద్ధాంత చేయోద్దని సూచించింది.

Pages