S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/18/2017 - 01:24

న్యూఢిల్లీ,జనవరి 17: భారత దేశంతో చర్చలు జరపాలంటే ఉగ్రవాదానికి దూరం కావాలసిందేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. నరేంద్ర మోదీ మంగళవారం ‘రైజీనా డైలాగ్’ రెండవ వార్షిక సదస్సులో మాట్లాడుతూ భారతీయుల సర్వతోముఖాభివృద్ధి కోసం దేశాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రోత్సాహాన్ని అందించడాన్ని మోదీ ఖండించారు.

01/18/2017 - 01:20

న్యూఢిల్లీ, జనవరి 17: ‘వీధి కుక్కలకూ జీవించే హక్కుంది’.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలను పూర్తిగా నిర్మూలించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించినప్పుడు తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. వీధి కుక్కలను ఏరివేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ విషయంలో బ్యాలెన్స్, సరయిన పద్ధతి ఉండాలని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్ బానుమతిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

01/17/2017 - 04:05

న్యూఢిల్లీ, జనవరి 16: చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రులకు రెండు సంవత్సరాల పాటు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి (కారా) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఒకవైపు దత్తత ఇవ్వడానికి కారా వద్ద కేవలం 1,800 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉండటం, మరోవైపు పిల్లల అదృశ్యం, పిల్లల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో కారా ఈ సూచన చేసింది.

01/17/2017 - 04:03

న్యూఢిల్లీ, జనవరి 16: ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జెరూసలెం మత్తయ్యను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య పేరును తొలగిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

01/17/2017 - 03:40

న్యూఢిల్లీ, జనవరి 16: ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించిన దర్యాప్తు సమగ్ర నివేదికను అందించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అల్లర్లపై కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలంటూ దాఖలైన పిటిషన్ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది.

01/17/2017 - 03:11

రుషీకేశ్ (ఉత్తరాఖండ్), జనవరి 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) వంటి సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెద్ద నోట్లు రద్దు చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఒక రోజు ముందు మాత్రమే మోదీ ఆర్‌బిఐ గవర్నర్‌కు తెలిపారని రాహుల్ పేర్కొన్నారు.

01/17/2017 - 03:09

న్యూఢిల్లీ, జనవరి 16: ఉత్తరాఖండ్ పిసిసి మాజీ చీఫ్ యశ్‌పాల్ ఆర్య సోమవారం బిజెపిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని దక్కించుకోవటానికి బిజెపి రచిస్తున్న వ్యూహాల్లో కాంగ్రెస్‌కు మొదటి దెబ్బ పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య, పాజీ ఎమ్మెల్యే కేదార్‌సింగ్ రావత్ కమలం పార్టీలోకి మారిపోయారు.

01/17/2017 - 03:08

లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభం అవుతుంది. తొలి దశలో ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగనున్న 73 నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం వెలువడుతుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింల ప్రాబల్యం గల 15 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ 73 నియోజకవర్గాలలో నామినేషన్ల ప్రక్రియ కూడా మంగళవారం మొదలవుతుంది. ఈ నెల 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

01/17/2017 - 03:07

న్యూఢిల్లీ, జనవరి 16: సామాజిక మాద్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్‌లో ప్రైవసీకి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్)లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

01/17/2017 - 03:12

లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి అండగా నిలబడిన ముస్లిం మతస్థుల పట్ల ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని, తన సూచనను పట్టించకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని అఖిలేశ్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు.

Pages