S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/16/2017 - 04:25

ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీలోని ఆర్మీహౌస్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్టప్రతి ప్రణబ్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తదితరులు. ఈ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తున్న జవాన్లు

01/16/2017 - 04:13

ఆదోని, జనవరి 15: రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న 16593 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 రిజర్వేషన్ బోగీ లేకుండానే ఆదివారం రాత్రి 8.33 గంటలకు ఆదోని రైల్వేస్టేషన్‌కు చేరింది. దీంతో ఆదోని రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఎస్-6 రిజర్వేషన్ బోగీ లేకపోవడంతో ఆందోళన చెందారు.

01/16/2017 - 02:51

న్యూఢిల్లీ, జనవరి 15: మణిపూర్‌లో జాతీయ రహదారులపై 75 రోజులుగా ఆర్థిక దిగ్బంధం కారణంగా జన జీవనం స్తంభించిపోయిన నేపథ్యంలో ఆదివారం పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు భద్రతా అధికారులు అక్కడి పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమైనారు.

01/16/2017 - 02:50

న్యూఢిల్లీ, జనవరి 15: సీనియర్ సిటిజన్లకోసం కొత్త జాతీయ విధానానికి ఆమోదం తెలపడానికి ముందు ఇప్పుడున్న జాతీయ విధానం అమలు, దాని ఫలితం ఎలా ఉన్నాయో ఏదయినా ఒక బయటి ఏజెన్సీ చేత అంచనా వేయించాలని ప్రధాన మంత్రి కార్యాలయం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖను కోరింది.

01/16/2017 - 02:48

న్యూఢిల్లీ, జనవరి 15: దేశ వ్యాప్తంగా దిగువ స్థాయి కోర్టుల్లో దాదాపు 2.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ కోర్టుల్లో దాదాపు 5 వేల న్యాయధికారుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

01/16/2017 - 02:33

న్యూఢిల్లీ, జనవరి 15: జాతీయవాదం అనే పదానికి ప్రస్తుతమున్న నిర్వచనానికి సరికొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) అధ్యాపకులు, ‘దేశం నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటి?’ (వాట్ ది నేషన్ రియల్లీ నీడ్స్ టు నో) అనే పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించారు.

01/16/2017 - 02:09

కొచుబేరియా, జనవరి 15: పశ్చిమ బెంగాల్‌లోని గంగా సాగర్ జాతరలో అదివారం తొక్కిసలాట జరిగి ఒక మహిళతో సహా 8 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

01/16/2017 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 15: సీనియర్ రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జీత్‌సింగ్ బర్నాలా (91) శనివారం కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పంజాబ్‌లో తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత బర్నాలాది. 1985లో రాజీవ్-లోంగోవాల్ ఒప్పందం తరువాత రెండు సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

01/16/2017 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 15: లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించడానికి గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. ఈ విషయమై కేంద్రం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు ఉద్యోగులు ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే వీటిని సమర్పించడానికి గడువు డిసెంబర్ 31.

01/16/2017 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్డీటీవీ కన్సల్టెంట్ ఎడిటర్ బర్ఖాదత్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 21 సంవత్సరాలుగా ఎన్డీటీవీలో పనిచేసిన బర్ఖాదత్ కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయాలని భావిస్తున్నట్లు ఆమె తన రాజీనామా అనంతరం వెల్లడించారు. ఇటీవలే ఆమె వాషింగ్టన్‌పోస్ట్ ప్రపంచ అభిప్రాయ విభాగంలో కాలమిస్టుగా చేరారు.

Pages