S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/11/2017 - 05:31

80 వేల కోట్ల రుణాలు చెల్లించేశారు
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
ఐటి శాఖ పరిశీలనలో తేలిన లెక్కలు
నోటీసుల జారీ యోచనలో అధికారులు

01/11/2017 - 05:16

ప్రపంచ వృద్ధికి మనమే ఊతం
ప్రజాస్వామ్యం, జనాభా,
డిమాండే మూల స్తంభాలు
ఆర్థిక సంస్కరణలకు మరింత ఊపు
రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు
ఎఫ్‌డిఐలు అపారం, జిడిపి పరుగులు
గుజరాత్ గ్లోబల్ సదస్సులో మోదీ

01/11/2017 - 05:14

న్యూఢిల్లీ, జనవరి 10: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సిఎం కావాలని కలలు కంటున్నారు. అయితే ఆయన ఆలోచనే ఇపుడు వివాదాస్పదమైంది. కేజ్రివాల్ ఢిల్లీనుంచి పారిపోతున్నారా? అంటూ కాంగ్రెస్, బిజెపిలు విమర్శలకు తెరలేపాయ. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి మెజారిటీ లభిస్తే కేజ్రీవాల్ ఢిల్లీ సిఎం పదవికి రాజీనామా చేసి పంజాబ్ సిఎం పదవి చేపట్టాలని అనుకుంటున్నారు.

01/11/2017 - 05:10

న్యూఢిల్లీ, జనవరి 10:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ కంటే పెద్దగా, మెరుగైన పట్టణంగా నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే అత్యుత్తతమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దుతానని 2024లో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారేనాటికల్లా ఈ లక్ష్యాన్ని సాధిస్తానని ఉద్ఘాటించారు.

01/10/2017 - 03:25

న్యూఢిల్లీ, జనవరి 9: పెద్ద నోట్ల రద్దుకు దారితీసిన పరిస్థితుల గురించి విచారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజాపద్దుల కమిటీ ముందుకు రప్పించాలని ఆలోచిస్తున్నట్లు ఆ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కురుప్పస్సేరి వర్కేయి థామస్ చెప్పారు.

01/10/2017 - 02:37

జమ్ము, జనవరి 9: జమ్మూకాశ్మీర్‌లో సోమవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. జమ్ములోని అఖ్‌నూర్ సెక్టార్‌లో గల బట్టాల్ గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న జనరల్ ఇంజినీరింగ్ రిజర్వ్ ఫోర్స్ (జిఆర్‌ఇఎఫ్) క్యాంపుపై మిలిటెంట్లు జరిపిన దాడిలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు.

01/10/2017 - 02:36

బెంగళూరు, జనవరి 9: విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే భారతీయ యువత అందుకు తగ్గ రీతిలో విద్యాపరంగాను, సాంకేతికపరంగాను నైపుణ్యానికి పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. తగిన అర్హతలు లేకపోవడం వల్ల అనేక దేశాల్లో తాత్కాలిక ప్రాతిపదికను వెళ్లిన భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

01/10/2017 - 02:34

న్యూఢిల్లీ, జనవరి 9: తన కుమారుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఏవో చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ములాయం సోమవారం సోదరుడు శివపాల్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు, అత్యంత సన్నిహితుడైన అమర్‌సింగ్‌తో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీని కలిసి చర్చలు జరిపారు.

01/10/2017 - 02:32

న్యూఢిల్లీ, జనవరి 9: పంజాబ్‌లో దశాబ్దంపాటు అధికారానికి దూరమై తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కుప్పలుతెప్పలుగా హామీలు గుప్పించింది. పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సోమవారం విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

01/10/2017 - 02:28

న్యూఢిల్లీ, జనవరి 9: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సిబిఎస్‌ఇ పది, పనె్నండవ తరగతి పరీక్షలను వారం రోజులపాటు వాయిదా వేశారు. తాజా షెడ్యూలు ప్రకారం మార్చి 9నుంచి ఈ పరీక్షలు మొదలవుతాయి. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 20వరకు జరుగుతాయి.

Pages