S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/09/2017 - 01:52

లక్నో, జనవరి 8: సమాజ్‌వాదీ పార్టీ ఒక వైపు నిట్టనిలువునా చీలిపోయినప్పటికీ పార్టీలో ఎలాంటి వివాదం లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. ములాయం తన సోదరుడు, పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ఆదివారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి..

01/09/2017 - 01:49

న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్‌సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎన్నికలకోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కింద ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎన్నికల కమిషన్‌ను కోరింది.

01/09/2017 - 01:49

చిత్రాలు....బెంగళూరులో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌లో మలేసియా ప్రత్యేక అధికారి ఎస్.సామివెల్లు, ఆరోగ్య శాఖ మంత్రి ఎస్. సుబ్రమణియమ్‌లతో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించేందుకు వస్తున్న ప్రధాని

01/09/2017 - 01:07

లక్నో, జనవరి 8: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తప్పతాగిన ఇద్దరు యువకులు కన్నూమిన్నూ కానకుండా కారు నడిపి, రోడ్డు పక్కన షెల్టర్‌లో నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను పొట్టనపెట్టుకున్నారు. హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని దాలిబాగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడం గమనార్హం.

01/09/2017 - 01:05

బెంగళూరు, జనవరి 8: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిపై ప్రదాని నరేంద్రమోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ చర్య ప్రజా వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్న వారిని ఆయన దుయ్యబట్టారు. వీరంతాకూడా దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్న అవినీతిని, నల్లధనాన్ని పూజించే వాళ్లంటూ విమర్శించారు.

01/09/2017 - 01:02

న్యూఢిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో సోమవారంనుంచి క్రెడిట్, డెబిట్ కార్డులపై లావాదేవీలు నిలిపి వేయాలన్న నిర్ణయాన్ని పెట్రో డీలర్లు వాయిదా వేసుకున్నారు. కార్డు చెల్లింపులపై ఒకశాతం అదనపు చార్జీ వసూలుకు నిరసనగా ఆదివారం అర్ధరాత్రినుంచే కార్డు లావాదేవీలను నిలిపివేస్తామని తొలుత హెచ్చరించిన డీలర్లు కేంద్ర ప్రభుత్వం జోక్యంతో అయిదు రోజుల పాటు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

01/09/2017 - 00:59

న్యూఢిల్లీ, జనవరి 8: పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు (నవంబర్ 8) దేశంలోని అన్ని బ్యాంకుల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలను విశే్లషించడంపై ఆదాయపన్ను (ఐటి) విభాగం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నిరుడు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9వరకు పొదుపు ఖాతాల్లో ఉన్న నగదు డిపాజిట్లపై నివేదిక సమర్పించాలని బ్యాంకులకు ఐటి విభాగం స్పష్టం చేసింది.

01/09/2017 - 00:55

న్యూఢిల్లీ, జనవరి 8: మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ‘నీట్’ పరీక్ష తరహాలో ఇంజనీరింగ్ కోర్సులకూ దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విషయమై సమాలోచనలు సాగుతున్నాయి. ఈ నెల చివర్లో జరగనున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఇ) భేటీలో ఈ విషయమై చర్చ జరగనుంది.

01/08/2017 - 08:25

న్యూఢిల్లీ, జనవరి 7: నోట్ల రద్దును పవిత్ర ఉద్యమంగా అభివర్ణించిన బిజెపి, నోట్ల రద్దు తర్వాత ఎదురయిన ఇబ్బందులను ప్రజలు చిరునవ్వుతో స్వీకరించారని పేర్కొంది. నల్లధనం అంతా ఇప్పుడు బ్యాంకుల్లో జమ అవుతోందని, ఫలితంగా ప్రభుత్వ రాబడి పెరిగి, జిడిపి వృద్ధి మరింత జోరందుకుంటుందని స్పష్టం చేసింది.

01/08/2017 - 08:24

న్యూఢిల్లీ, జనవరి 7: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందు అనుకున్నట్లుగా జనవరి 31వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ మర్నాడు (్ఫబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. జనవరి 31న రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

Pages