S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/05/2017 - 05:42

న్యూఢిల్లీ, జనవరి 4: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు అగ్ని పరీక్షగా మారతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ బ్యాంకుల ఏటిఎంలలో కొత్త నోట్లు పుష్కలంగా లభించకపోతే విజయం సాధించటం కష్టమని బిజెపి రాష్ట్ర నాయకులు తమ అధినాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

01/05/2017 - 05:30

న్యూఢిల్లీ, జనవరి 4: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ బడ్జెట్‌లో ప్రజలకు రాయితీలు ప్రకటించకూడదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనను ఫిబ్రవరి 1వ తేదీనుండి మరోతేదీకి మార్చాలంటూ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు పలు ఇతర ప్రతిపక్షాలు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి.

01/05/2017 - 05:29

న్యూఢిల్లీ, జనవరి 4: పార్లమెంట్ లోపల, ప్రాంగణంలో ఎంపీలకు ఎటువంటి ప్రవర్తనా నియమావళి లేదని లోక్‌సభ ఉప కార్యదర్శి సమాధానం ఇచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయవాది శ్రవణ్‌కుమార్ పార్లమెంట్‌లో ఎంపీలపై దాఖలైన ఫిర్యాదులు, వ్యవహార శైలిపై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

01/05/2017 - 05:29

అమేథీ, జనవరి 4: ముందు రోజు రాత్రిదాకా ఆ ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. అయితే తెల్లారేసరికి ఇల్లంతా శవాల దిబ్బలాగా మారిపోయింది. ఇంట్లోని మొత్తం 11 మంది శవాలుగా మారి ఉండడం చూసి పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని సుకుల్ బజార్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

01/05/2017 - 05:28

న్యూఢిల్లీ, జనవరి 4: దేశ రాజకీయాలను నిర్దేశించే ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్ర శాసనసభల ఎన్నికల నగారా మోగింది.

01/05/2017 - 05:08

న్యూఢిల్లీ, జనవరి 4:దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బిజెపినే మెజార్టీ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న 403 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి 206-216 సీట్ల మధ్య రావచ్చునని ఇండియాటుడే- ఆక్సిస్ సంస్థ అక్టోబర్- డిసెంబర్ మధ్యకాలంలో సర్వే నిర్వహించింది.

01/05/2017 - 05:08

న్యూఢిల్లీ, జనవరి 4: రాష్ట్రాల తీరంలోని ప్రాంతీయ సముద్ర జలాల్లో పన్ను ఎవరు వసూలు చేయాలనే అంశంపై జిఎస్‌టి సమాఖ్య రెండో రోజు సమావేశంలో ప్రతిష్టంభన నెలకొన్నది. ప్రాంతీయ సముద్ర జలాల్లో జరిగే వాణిజ్యంపై పన్ను వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో తీరప్రాంత రాష్ట్రాలు అంగీకరించలేదు.

01/04/2017 - 04:25

తిరుపతి, జనవరి 3: పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఐదుగురు ప్రముఖులు తిరుపతిలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డులు, సత్కారాన్ని అందుకున్నారు. సదస్సుకు హాజరైన నోబెల్ బహుమతి గ్రహీతలను ప్రధాని జాతీయ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష పతకంతో సత్కరించారు.

01/04/2017 - 04:15

తిరుపతి, జనవరి 3: దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలు, రైతులు, సామాన్యులకు సైతం సాంకేతిక ప్రయోజనాలు అందేందుకు శాస్తవ్రేత్తలు కృషి చేయాలని కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా తిరుపతిలోని ఎస్వీయు తారకరామా క్రీడామైదానంలో ప్రారంభమైన 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రసంగించారు.

01/04/2017 - 02:32

కోల్‌కతా, జనవరి 3: రోజ్‌వాలీ చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ను మంగళవారం సిబిఐ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో తృణమూల్ ఎంపీ తపస్ పాల్ అరెస్టయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఎంపీలను అరెస్టు చేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pages