S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2016 - 18:14

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్య విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని గతంలో వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ ఇపుడు మాట మార్చి, ఆ సంస్థతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి గురించే మాట్లాడానని అనడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంజి వైద్య గురువారం అన్నారు. ఆ వ్యక్తి ఎవరో, అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం ఉందో రాహుల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

08/25/2016 - 17:45

ఢిల్లీ: మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి యూటర్న్‌ తీసుకున్నారు. 'ఆరెస్సెస్‌ విద్వేషపూరిత అజెండాపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. నేను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను' అని రాహుల్‌ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

08/25/2016 - 17:32

బెంగళూరు: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ను నర్సాపురం నందిని దాబా వద్ద గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్తో పాటు మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య లో ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్థారించారు.

08/25/2016 - 17:23

కన్నూర్ (కేరళ) : కన్నూర్ జిల్లా ముజక్కున్ను‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుగేశ్‌పై 30 మంది సిపిఎం కార్యకర్తలు గురువారం దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుగేశ్‌ను తలస్సేరిలోని ఆసుపత్రికి తరలించారు. సుగేశ్‌పై దాడి నేపథ్యంలో కన్నూర్ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్న సుగేశ్‌పై సిపిఎం కార్యకర్తల గుంపు దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

08/25/2016 - 12:51

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. కశ్మీర్‌లో పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం.

08/25/2016 - 12:49

దిల్లీ: పీహెచ్‌డీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి, అఖిల భారత విద్యార్థి సంఘం సభ్యుడు అన్మోల్‌ రతన్‌ బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఓ సినిమా సీడీ తీసుకునేందుకు విద్యార్థిని హాస్టల్‌కు రాగానే, ఆమెకు డ్రగ్స్‌ కలిపిన కూల్‌డ్రింగ్‌ ఇచ్చి ఆమెపై రతన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

08/25/2016 - 11:15

దిల్లీ: నిర్భయ కేసులో దోషిగా దిల్లీ తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వినయ్‌శర్మ బుధవారం రాత్రి మాత్రలు మింగి, అనంతరం టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. జైలు సిబ్బంది హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఆసుపత్రికి అతడిని తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

08/25/2016 - 07:14

శ్రీనగర్, ఆగస్టు 24: కాశ్మీర్‌లోని అన్ని వర్గాలకు చేరువకావాలన్న లక్ష్యం దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కాశ్మీర్‌లో పర్యటించారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి కల్లోలిత రాష్ట్రానికి వచ్చిన ఆయన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపారు.

08/25/2016 - 07:12

న్యూఢిల్లీ, ఆగస్టు 24: జమ్మూకాశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సహకరించే ప్రతిఒక్కరితోనూ చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు.

08/25/2016 - 07:12

న్యూఢిల్లీ, ఆగస్టు 24: సరిహద్దు ఆవలనుంచి పాకిస్తాన్ జరిపే కాల్పుల్లో మృతిచెందే జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇక నుంచి రూ. అయిదు లక్షల చొప్పున నష్టపరిహారం పొం దనున్నారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు జరిపే దాడుల్లో మృతిచెందిన వారిలాగే ఇకనుంచి వీరుకూ డా రూ. అయిదు లక్షల చొప్పున నష్టపరిహారం పొందుతారు.

Pages