S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/18/2016 - 00:13

గోపాల్ గంజ్, ఆగస్టు 17: మద్యనిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 12 మంది చనిపోయారు. అయితే అధికారులు మాత్రం వారు చనిపోవడానికి వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదని అంటూ దర్యాప్తుకు ఆదేశించారు.

08/17/2016 - 17:46

ఢిల్లీ: కృష్ణా జలాల పంపకంపై ట్రైబ్యునల్‌ ఎదుట మహారాష్ట్ర వాదనలు వినిపించింది. విభజన చట్టం సెక్షన్‌ 89 ప్రకారం జల వివాదం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినదేనని, మళ్లీ కేటాయింపులు చేయాలని తెలంగాణ వాదించడం సరికాదని కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చాక ఏపీ పిటిషన్ వేసి నిర్ణయాన్ని అడ్డుకుందని మహారాష్ట్ర ప్రభుత్వ లాయర్ అన్నారు. . బి.కె.

08/17/2016 - 17:49

ఢిల్లీ: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. పంజాబ్ రాష్ట్రానికి వి.పి.సింగ్ బద్నోర్‌ను, అసోం రాష్ట్రానికి భన్వర్‌లాల్ పురోహిత్‌ను, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా జగదీష్ ముఖిని నియమించారు.

08/17/2016 - 16:46

ముంబయి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడి పెళ్లి సందర్భంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్ వివాహం నగరంలోని నాగ్‌పడా ప్రాంతంలోని మసీదు వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు జరిగింది. పెళ్లి వేడుకలను దావూద్ ‘స్కైప్’లో వీక్షిస్తాడన్న ప్రచారం కొద్ది రోజులుగా ఊపందుకుంది.

08/17/2016 - 16:14

దిల్లీ: 18 ఏళ్లు దాటితేనే దహీ హండీ (ఉట్టి కొట్టే కార్యక్రమం)లో పాల్గొనాలని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 18 ఏళ్ల లోపు పిల్లలు దహీహండీలో పాల్గొనరాదని, ఒకరిపై ఒకరు ఎక్కే పిరమిడ్‌ ఎత్తు కూడా 20 అడుగులకు మించరాదని 2014లో బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాంబే హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థిస్తూ 18ఏళ్లు దాటితేనే దహీహండీలో పాల్గొనాలని, .

08/17/2016 - 15:31

చెన్నై: ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేసినందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోని మొత్తం 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. జయలలిత డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ఆందోళన చెయ్యడంతో అసెంబ్లీ స్పీకర్‌ పి.ధనపాల్‌- డీఎంకే నేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ సస్పెండ్‌ చేశారు. డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపారు.

08/17/2016 - 13:57

పట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లా హరాఖువా గ్రామంలో కల్తీ మద్యం తాగి 13మంది మృతి చెందారు. సోమవారం స్థానిక దుకాణాల్లో కొందరు కూలీలు కల్తీ మద్యం తాగారు. మంగళవారం సాయంత్రం చాలామంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వగా వారిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 13మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

08/17/2016 - 12:23

దిల్లీ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తెలంగాణ ఎమ్మెల్యేలకు, స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ కురియన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

08/17/2016 - 11:18

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

08/17/2016 - 11:16

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్వాజా బాగ్‌లో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు సహా పోలీసు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

Pages