S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/17/2016 - 04:52

భద్రాచలం, ఆగస్టు 16: ఛత్తీస్‌గఢ్, ఒడిషా సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పేరుమోసిన మావోయిస్టు జనమిలీషియా కమాండర్ అర్జున్ హతమయ్యాడు. చందోమేటా అటవీప్రాంతంలోని కందనార్ గ్రామ శివారుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చందోమేట జనమిలీషియా కమాండర్, మచ్‌కోట్ దళ సభ్యుడు అర్జున్ చనిపోయాడు.

08/17/2016 - 04:33

రాజమహేంద్రవరం, ఆగస్టు 16: సంస్కృత భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన మహామహోపాధ్యాయ, శాస్తన్రిధి విశ్వనాథ గోపాలకృష్ణశాస్ర్తీ రాష్టప్రతి పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 15 మందికి ఈ పురస్కారాలు ప్రకటించగా, రాష్ట్రం నుంచి విశ్వనాథ ఒక్కరే ఈగౌరవాన్ని పొంద డం విశేషం. విశ్వనాథ గోపాలకృష్ణ తండ్రి జగన్నాథ ఘనాపాఠి కూడా రాష్టప్రతి పురస్కారాన్ని పొందడం విశేషం.

08/17/2016 - 02:06

న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలో రాష్ట్రాలకు రాజకీయ సరిహద్దులు ఉంటాయిగానీ, నదుల సరిహద్దుల్లో మార్పులుండవని బ్రిజేష్‌కుమార్ ట్రిబున్యల్‌కు ఆంధ్ర స్పష్టం చేసింది. కృష్ణా జలాల వివాదంపై మంగళవారం ఏపీ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ, పుట్టుకనుంచి సముద్రంలో కలిసేవరకు నదిని ఒకే యూనిట్‌గా పరిగణించాలని కోరింది.

,
08/17/2016 - 00:19

శ్రీనగర్, ఆగస్టు 16: జమ్మూ, కాశ్మీర్‌లో మంగళవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. కర్ఫ్యూ, పోలీసు ఆంక్షలు, వేర్పాటువాదుల ఆందోళనల కారణంగా రాష్ట్రంలో 39 రోజులుగా సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. బుద్గాం, అనంత్‌నాగ్ జిల్లాల్లో రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. దీంతో కాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 63కు చేరుకుంది.

08/17/2016 - 00:15

న్యూఢిల్లీ, ఆగస్టు 16: పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చైనా వైఖరి మారుతుందా? నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా వెనకేసుకొచ్చిన చైనా కొత్త వ్యూహంతో ముందుకెళుతోందా? తాజాగా ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్ పాలనలో ఉన్న ప్రాంతంగా కాకుండా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌గా చైనా పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

08/17/2016 - 00:13

రెవారీ (హర్యానా), ఆగస్టు 16: దాయాది దేశంతో సత్సంబంధాలు పూర్తిగా బలహీనపడుతున్న నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ను ఓ నరకంగా అభివర్ణించారు. బలోచిస్తాన్‌లో తక్షణం మానవ హక్కుల ఉల్లంఘనను చర్యలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. సోమవారం పాకిస్తాన్ చొరబాటు చర్యల్ని భారత సైన్యం నిర్ద్వంద్వంగా నిరోధించగలిగిందని అన్నారు.

08/17/2016 - 00:11

బెంగలూరు, ఆగస్టు 16: కాశ్మీర్‌పై బెంగలూరులో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉద్యోగుల్లో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ మంగళవారం ఖండించింది. తమ ఉద్యోగులెవరూ కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

08/17/2016 - 00:07

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాశ్మీర్‌లో గత మూడు వారాలుగా ఎడతెగని రీతిలో జరుగుతున్న అల్లర్ల వెనుక సీమాంతర నిధుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అల్లర్లకు సారథ్యం వహిస్తున్న జమాతే ఇస్లామీ, దుక్‌త్రానన్ ఎ మిలత్ మిలిటెంట్ సంస్థలకు ఇప్పటి వరకూ 24 కోట్ల రూపాయలు అందినట్టుగా తెలుస్తోంది.

08/17/2016 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 16: హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని భారత్, మాల్దీవులు నిర్ణయించాయి. ఈ ప్రాంతంలో తన ఉనికిని చాటుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక అంశాలపై భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాల్దీవులు విదేశాంగ మంత్రి మహ్మద్ ఆసిమ్ చర్చించారు. వీరిద్దిరి మధ్యా అనేక అంశాలపై మంగళవారం చర్చలు జరిగాయి.

08/17/2016 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 16: భారత విమానాశ్రయాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయని ఇంటిలిజెన్స్ బ్యూరో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. బ్రస్సెల్స్ తరహాలో ఉగ్రవాద దాడి జరిగితే పరిస్థితి ఏమిటంటూ హెచ్చరికలు జారీ చేసింది. సరైన పరిమాణంలో నిధులులేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో సిఐఎస్‌ఎఫ్ ప్రత్యేక భద్రత కొరవడిన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ బ్యూరో ఈ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

Pages