S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/17/2016 - 00:04

న్యూఢిల్లీ, ఆగస్టు 16: స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రజా ఉద్యమంగా మారుతోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారంనాడు ఢిల్లీలో స్వచ్ఛ్భారత్‌లో ‘‘ప్రజల భాగస్వామ్యం -ప్రజా ఉద్యమం’’ వర్క్‌షాప్‌ను వెంకయ్య ప్రారంభించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతన పద్ధతులపై ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని అన్నారు.

08/17/2016 - 00:04

పాట్నా, ఆగస్టు 16: జిఎస్‌టి బిల్లును ఆమోదించిన తొలి బిజేపీ యేతర ప్రభుత్వంగా బీహర్ నిలిచింది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన వస్తుసేవల పన్ను బిల్లును బీహార్ ఆసెంబ్లీ రాటిఫై చేసింది. 1991 తరువాత అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణగా మారిన జిఎస్‌టి బిల్లును దేశంలోని 50శాతం రాష్ట్రాలు కనీసంగా ఆమోదించాల్సి ఉంది.

08/16/2016 - 16:57

దిల్లీ: కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాదనలు ప్రారంభమయ్యాయి. కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలకు పంపకం చేయాలని ఆంధ్రప్రదేశ్‌; తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నీటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర గతంలో వాదనలు వినిపించాయి. ఈ అంశంపై ట్రైబ్యునల్‌లో మూడు రోజుల పాటు వాదనలు కొనసాగనున్నాయి.

08/16/2016 - 12:20

శ్రీనగర్‌: జమ్ము- కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య మంగళవారం జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతిచెందారు. మగమ్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ వాహనంపైకి కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.

08/16/2016 - 12:14

సతారా: మహారాష్ట్రలోని సతారాకు చెందిన డాక్టర్‌ సంతోష్‌ పాల్‌ నేర ప్రవృత్తితో ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాడు. ఇటీవల ఓ మహిళ కన్పించకుండా పోయిన కేసులో సంతోష్‌పాల్‌ను అనుమానించి పోలీసులు అరెస్టు చేశారు. తాను ఇప్పటివరకు ఆరుగురిని చంపినట్లు పాల్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. పాల్‌ ఫాంహౌస్‌లో మృతుల అవశేషాలను పోలీసులు గుర్తించారు.

08/16/2016 - 04:05

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో పెట్రోలు ధరను లీటరుకు రూపాయి డీజిల్ ధరను లీటరుకు 2రూపాయలు తగ్గాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 60.09 డీజిల్ లీటర్ రూ. 50.27 కు ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ముడి చమురు రేట్లలో వచ్చిన మార్పుల నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించారు. చివరి సారిగా గత నెల 31న వీటి రేట్లు తగ్గాయి.

08/16/2016 - 04:03

హైదరాబాద్, ఆగస్టు 15: జెఎన్‌టియు హైదరాబాద్ రెక్టార్‌గా పనిచేసిన ఒఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి గుజరాత్ గాంధీనగర్‌లోని పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం యూనివర్శిటీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్‌ను ఈ యూనివర్శిటీలో డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తారు. నరేంద్రమోదీ స్వయంగా ఈ యూనివర్శిటీ ఏర్పాటులో కీలక భూమికను పోషించారు.

08/16/2016 - 04:02

సూళ్లూరుపేట, ఆగస్టు 15: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంనుంచి ఈ ఏడాది నాలుగు ప్రయోగాలు చేపడుతున్నట్లు షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన షార్‌లో జాతీయ జెండా ఆవిష్కరించించారు. అనంతరం కల్పన అంతరిక్ష నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ షార్ కేంద్రం నుంచి ఈ ఏడాది రెండు జిఎఎస్‌ఎల్‌వి, ఒక పిఎస్‌ఎల్‌వి, మరో ఏటివి ప్రయోగం ఉంటుందన్నారు.

08/16/2016 - 03:45

చిత్రం.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపన చేస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు తదితరులు

08/16/2016 - 03:36

చిత్రం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద వందన సమర్పణ చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో త్రివిధ దళాధిపతులు దల్బీర్ సింగ్ సుహాగ్, అనూప్ రాహా, సునీల్ లాంబా.

Pages