S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/16/2019 - 00:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో గురువారం జరిగిన పాక్ మిలిటెంట్లు జరిపిన ఉగ్ర ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని సీఆర్‌పీఎఫ్ హెచ్చరించింది. సీఆర్‌పీఎఫ్ దళాలపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో శుక్రవారం నాటికి 40 మంది జవాన్లు అసువులు బాశారు. ‘ఉగ్ర దాడిని మరిచిపోం. వారిని వదిలిపెట్టం.

02/16/2019 - 00:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాశ్మీర్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని, పాకిస్తాన్‌పై దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీహెచ్‌పీ వర్కింగ్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఆర్మీ పాకిస్తాన్‌పై దాడి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. మతంపేరుతో మారణహోమం సృష్టిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులను సహించరాదన్నారు.

02/16/2019 - 00:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వెంకయ్య నాయుడు గత సంవత్సర కాలంలో చేసిన ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్ స్పీచేస్ వాల్యూమ్-వన్’ పుస్తకాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు.

02/15/2019 - 23:58

లక్నో/బెంగళూరు, ఫిబ్రవరి 15: చిరునవ్వుతో ఉద్యోగంలోకి..అదే చిరుదరహాసంతో మృతువు ఒడిలోకి..! ఇదే దేశ సేవే పరమార్థంగా జీవితాన్ని త్యాగం చేసే సైనికుల కథ. తమ కుమారులు దేశం కోసమే మరణించారన్న ధీమా ఆయా కుటుంబాలను ఊరడిస్తున్నా..చేతుల్లో పెంచిన కొడుకు పోయాడన్న బాధ మాత్రం వారికి తీరనిదే. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌పూర్ నుంచి కర్నాటకలోని గుడిగెరె వరకు దేశవ్యాప్తంగా అనేక గ్రామాలు సైనిక దళాల్లోకి యువతను పంపుతాయి.

02/15/2019 - 23:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ‘్భరత ప్రజల రక్తం ఉడికిపోతోంది. పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 40మంది జవాన్లను బలిగొన్న పుల్వామా పైశాచిక ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛను భద్రతా దళాలకు ఇస్తున్నామంటూ సంచలన ప్రకటన చేశారు.

02/15/2019 - 23:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర దాడి జరిగినందుకు నిరసనగా పాకిస్తాన్‌కు కల్పించిన మోస్ట్ ఫెవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) స్థాయిని భారత దేశం ఉపసంహరించింది. పుల్వామా దాడి గురించి వివరించి, ఇకమీదట అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు శనివారం మోదీ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది.

02/15/2019 - 22:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో అమరుడైన భారత్ జవాన్‌కు చెందిన శవపేటికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ భుజంపై పెట్టుకుని మోసారు. భారత త్రివర్ణ పతాకం కప్పిన ఒక సైనికుడి శవపేటికకు ముందు భాగంలో రాజ్‌నాథ్ ఒకవైపు, డీజీపీ మరోవైపు మోసి ఇతర అధికారులతో కలిసి ముందుకు సాగారు.

02/15/2019 - 22:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిని భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం ప్రతిపక్షం ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

02/15/2019 - 22:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భావ స్వేచ్ఛను, తెలుసుకునే హక్కును హరించి వేసే సమాచార టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66ఏను కోర్టు కొట్టివేసిందని, ఈ అంశంపై ప్రజలకు తెలియచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించ్ది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 2015 మార్చి 24వ తేదీన ఇచ్చిన తీర్పులోకొట్టివేసింది.

02/15/2019 - 22:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: మతపరమైన సంప్రదాయాలు, ఆచారాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని , ఈ విషయంలో లక్ష్మణ రేఖను అత్యుత్సాహంతో దాటే ప్రయత్నం చేయడం వల్ల మీడియాలో ప్రచారం మాత్రం లభిస్తుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఒక రోజు మీడియాలో పేరు కోసం భిన్నత్వంలో ఏకత్వం మధ్య అలరారుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేయరాదన్నారు.

Pages