S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/07/2018 - 01:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు అంటగట్టడం దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉందని, బీజేపీకి చెందిన పలువురు నేతలు అనేక కేసుల్లో అక్రమార్కులుగా ఉన్న విషయాన్ని ఆ పార్టీ మరచిపోయిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

12/07/2018 - 01:38

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరా అని దేశప్రజలు ఒకవైపు చర్చించుకుంటుండగా, అధికారంలోకి వచ్చే వారెవరో చెప్పే నిర్ణయాత్మక ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరగడం, త్వరలోనే ఫలితాలు వెల్లడికావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగుస్తున్నందున, పొత్తులు, కత్తులు, ఎత్తులు విషయంపై ఒక నిర్ధారణకు రావచ్చునని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

12/07/2018 - 00:55

న్యూఢిల్లీ: మళ్లీ అయో ధ్య వేడి రాజుకుంటోంది. బాబ్రి మసీదు విధ్వంసం జరిగిన 26ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా అనుకూల, ప్రతికూల వాదులు తమ గళాన్ని వినిపించారు.

12/06/2018 - 17:25

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మ కేసులో గురువారంనాడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనంలో గురువారంనాడు వాదనలు జరిగాయి. అలోక్ వర్మ, ఆస్థానాలు పరస్పరం అవినీతి అరోపణలు చేసుకోవటంతో కేంద్రం వీరిని సెలవుపై పంపి వర్మ స్థానంలో నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. కాగా ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

12/06/2018 - 17:23

పంజాబ్: అమృతసర్ రైలు ప్రమాదంలో మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజ్యోత్ కౌర్‌లకు క్లీన్ చిట్ లభించింది. ప్రమాదం జరిగిన సమయంలో కౌర్ అక్కడ లేరని ప్రభుత్వం స్పష్టంచేసింది. దసరా వేడుకల సందర్భంగా రావణ దహన కార్యక్రమం అక్టోబర్ 19న జరిగింది. రైలు పట్టాలపై నిలబడి ఈ కార్యక్రమం జరుగుతుండగా రైలు దూసుకువచ్చి 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

12/06/2018 - 17:22

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేక్ దళిత ఎంపీ సావిత్రిభాయి పూలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ వల్ల సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగికి దళితులపై ప్రేమ ఉంటే వారిని రెట్టింపు ప్రేమించాలని అన్నారు.

12/06/2018 - 17:19

లక్నో:బులెంద్‌షెహర్ పోలీసు అధికారి హత్య కేసులో ఎ1 నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బులెంద్‌షెహర్‌లో అక్రమంగా గోవధ జరుగుతుందని అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. ఈ అల్లర్లలో ఓ పోలీసు అధికారి చనిపోయారు. పోలీసులు భజరంగ్‌దళ్ నాయకుడు యోగేశ్‌రాజు ఏ1 నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యోగేశ్‌రాజు తనకు అల్లరతో ఎటువంటి సంబంధం లేదని యోగేశ్‌రాజు వీడియో విడుదల చేశారు.

12/06/2018 - 13:29

న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ ఈ ఏడాద విజేతలను ప్రకటించంది. అవార్డులు గెలుచుకున్నవారి వివరాలు ఇలా ఉన్నాయ. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నవారిలో అనీస్ స‌లీమ్‌(ఇంగ్లీష్‌), రమాకాంత్ శుక్లా(సంస్కృతం), రాజేశ్ కుమార్ వ్యాస్‌(రాజ‌స్థానీ), రెహ్మాన్ అబ్బాస్‌(ఉర్దూ), లోక్‌నాథ్ ఉపాధ్యాయ‌(నేపాలీ), చిత్రముగ‌ల్‌(హిందీ), రామ‌కృష్ణన్‌(త‌మిళం) ఉన్నారు.

12/06/2018 - 13:09

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం పట్ల సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతున్నవారి సంఖ్య కంటే ఇది అధికంగా ఉందని పేర్కొంది. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

12/06/2018 - 13:07

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును నూటికి నూరుశాతం తిరిగి చెల్లిస్తాను. డబ్బు దోచుకున్నా అని వస్తున్న వార్తలను ఆపేయండని ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా అంటున్నారు. మళ్లీ ఈరోజు ఉదయం కూడా ట్విట్టర్‌లో మరోసారి అభ్యర్థించారు. దయచేసి నేను చేస్తున్న విజ్ఞప్తిని అగస్టా హెలికాఫ్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిష్టియన్ మిషెల్‌తో ముడిపెట్టి వార్తలు రాయవద్దని కోరారు.

Pages