S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/10/2018 - 01:16

న్యూఢిల్లీ, నవంబర్ 9: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఈ నెలలో రెండోసారి వంట గ్యాస్ ధరలను పెంచారు. సిలిండర్‌కు రూ.2 చొప్పున పెంచారు. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 507.42 పైసలుగా నిర్ణయించారు. అంతకు ముందు ఈ ధర రూ. 505.34 పైసలు ఉండేది. ఈ వివరాలను చమురు మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమిషన్‌ను పెంచారు.

11/09/2018 - 23:04

ఎం-777 అమెరిన్ ఆల్ట్రా లైట్ హోవిజెర్స్, కే-9 వజ్ర సహా భారత ఆయుధాగారంలో
మూడు సరికొత్త ఆయుధాల నమూనాలను శుక్రవారం నాసిక్‌లోని డియోలలీ ఆర్టిలరీ సెంటర్‌లో స్వీకరిస్తున్న భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు.

11/09/2018 - 23:05

న్యూఢిల్లీ, నవంబర్ 9: పెద్దనోట్ల రద్దు చేసి రెండేళ్లయిన సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డిమోనిటైజేషన్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిందని, నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఆర్‌బీఐ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు.

11/09/2018 - 22:33

రాయిపూర్, నవంబర్ 9: చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 18 సంవత్సరాలైతే అందులో రికార్డుస్థాయిలో డాక్టర్ రమణసింగే 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను రాష్ట్రానికి ఇంకా చేయాల్సింది చాలా ఉందికాబట్టి ఈ ఎన్నికల్లోనూ తననే మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. ఢిల్లీ తనకు చాలా దూరమని, రాష్ట్ర అభివృద్ధే తనకు లక్ష్యమని ఆయన అన్నారు.

11/10/2018 - 04:41

లక్నో: వారణాసిలో గంగానదిపైన తొలి జల రవాణా మార్గం ఏర్పాటుకు నిర్మించిన బహుళ టర్మినల్ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12వ తేదీ సోమవారం జాతికి అంకితం చేస్తారు. తక్కువ ఖర్చు, పర్యావరణ పరిరక్షణకు జలరవాణా ఉపయోగపడుతుంది. ఈ నదిపై జల రవాణా అభివృద్ధికి మూడు టర్మినల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో తొలి టర్మినల్ నిర్మాణం పూర్తయింది.

11/09/2018 - 16:41

న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయానికి రాజకీయాలు అంటగట్టి అపవిత్రం చేయవద్దని మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ అన్నారు. కోర్టు తీర్పును అవకాశంగా తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శాంతి భద్రతలను కాపాడిల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. దీన్ని రాజకీయాలకు వేదికగా మలచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.

11/09/2018 - 16:40

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఒత్తిడికి ‘సర్కార్’ నిర్మాతలు తలొగ్గారు. జయలలితకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జయలలితకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె మాటలు వినిపించకుండా మ్యూట్ చేసేందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ను శుక్రవారం నుంచి ప్రదర్శించనున్నామని నిర్మాతలు వెల్లడించారు.

11/09/2018 - 16:40

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని నిధులు అడగటం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ శుక్రవారంనాడు ట్వీట్ చేశారు. ఆర్థిక గణాంకాలు గాడీలోనే ఉన్నాయని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారంతో ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. రూ.3.6 లక్షల కోట్లుగానీ రూ.1 లక్ష కోట్లుగానీ ఆర్బీఐని అడగాలనే ప్రతిపాదన లేదని అన్నారు.

11/09/2018 - 16:39

చత్తీస్‌గఢ్: మావోయిస్టుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన జగదల్‌పూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ అర్భన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ మద్దతునిస్తుందని అన్నారు. అర్భన్ నక్సల్స్ ఏసీ కారుల్లో తిరుగుతూ తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తూ ఆదీవాసీల జీవితాలను చిధ్రం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని అన్నారు.

11/09/2018 - 15:53

న్యూఢిల్లీ: మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్లారు. ఆయన మొదటి ప్రపంచ యుద్దం శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. తొలిరోజు భారతీయులనుద్దేశించి మాట్లాడతారు. పారిస్‌లో ఇండియన్ ఆర్మ్‌డ్ మెమోరియల్‌ను ప్రారంభించనున్నారు.

Pages