S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/09/2018 - 15:50

న్యూఢిల్లీ: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించింది. చత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించింది. ఈ నిషేధం ఈనెల 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుంది.

11/09/2018 - 12:38

చెన్నై:అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో మారన్ సోదరులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తమపైన, ఇతరులపైన సీబీఐ అభియోగాలు నమోదు చేయటాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వాదోపవాదాలు విన్న తరువాత జస్టిస్ జగదీష్ చంద్ర తీర్పును అక్టోబర్ 23కు రిజర్వ్ చేశారు. మారన్ సోదరులు చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది.

11/09/2018 - 12:37

న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాబుల్ సుప్రియో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి వెళుతుండగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆయన కారును ఓ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల కేంద్ర మంత్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి ట్వీట్‌లో తెలియజేశారు.

11/09/2018 - 12:36

న్యూఢిల్లీ: తాలిబాన్లతో చర్చలకు తొలిసారి భారత్ హాజరవుతోంది. రష్యా ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి అమెరికా, పాకిస్థాన్‌తో పాటు భారత్ కూడా పాల్గొననున్నది. ఈ సమావేశానికి తాలిబన్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. నిత్యం యుద్ధంతో భీతిల్లే ఆఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పే చర్యలకు భారత్ ఎల్లప్పుడు సహకరిస్తుందని భారత విదేశాంగ ప్రతినిధి రవిశ్‌కుమార్ అన్నారు.

11/09/2018 - 02:35

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య మేఘాలు మరోసారి విజృంభించాయి. వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ నగరంలో దీపావళి రోజు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాలుష్య ఉద్గారాలు తీవ్రరూపం దాల్చాయని అధికారులు వెల్లడించారు. రెండు గంటలు మాత్రమే బాణ సంచాకాల్చాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఎక్కడా అమలైన దాఖలాలు కనిపించలేదు.

11/09/2018 - 01:37

న్యూఢిల్లీ, నవంబర్ 8: పెద్ద నోట్ల రద్దుపై అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య గురువారం తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనగా, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సహజ శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2016 నవంబర్ 8వ తేదీన నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం విదితమే.

11/09/2018 - 01:33

కోల్‌కతా, నవంబర్ 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆర్‌బీఐని వశం చేసుకోడానికి కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని గురువారం ఇక్కడ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమైందని చిదంబరం అన్నారు.

11/09/2018 - 01:31

న్యూఢిల్లీ, నవంబర్ 8: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి అభియోగాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించింది. గురువారం సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ సీవీసీ కేవీ చౌదరిని కలిశారు. తనపై వచ్చిన అభియోగాలను తిరస్కరించినట్లు సమాచారం. తనపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా చేసిన అభియోగాలను తోసిపుచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

11/09/2018 - 01:31

తిరువనంతపురం, నవంబర్ 8: కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అక్షరలక్ష్యం’ పథకంలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో నూటికి 98 మార్కులు సాధించి రికార్డు సృష్టించిన 96 ఏళ్ల కాత్యాయని అమ్మకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్ బుధవారం ఒక ల్యాప్‌టాప్‌ను అందజేశారు.

11/09/2018 - 01:29

విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలంటూ గురువారం విడుదలైన
ఓ థియేటర్ వద్ద ధర్నా చేస్తున్న డీఎంకే నాయకులు

Pages