S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒయాసిస్ 30

‘‘నాకే అనుకోండి. ఇవాళ మా ప్రిన్సిపాల్ రిజైన్ చేశాడు. కాశీలో వున్న అహోబలరావుగారికి ఫోన్ చేసి చెప్పాను. నన్ను ప్రిన్సిపాల్‌గా ఛార్జి తీసుకోమని చెప్పాడు. ఆయన రాగానే ఆర్డర్స్ ఇస్తానన్నారు..’’ అన్నది ఛాయ.
‘‘కంగ్రాట్స్.. మరి పార్టీ ఎప్పుడు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘దానికేం భాగ్యం.. రాత్రికి రండి..’’ అన్నది ఛాయ.
రాత్రి ఎనిమిదింటికి రణధీర్ వెళ్ళగానే ఛాయ నవ్వుతూ ఆహ్వానించింది.
ఉల్లిపొరలాంటి తెల్లని కుర్తా పైజమా ధరించింది. శరీర సౌష్టవం కనిపించీ కనిపించకుండా ఉంది.
‘‘ప్రిన్సిపాల్‌గారికి అభినందనలు..’’ అన్నాడు రణధీర్. ఛాయ షేక్ హ్యండిచ్చింది.

శ్రీధర

నేర్చుకుందాం

చ. ‘అనిల జవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం
చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూధము నిట్లు గ్రమ్మరిం
చునె యితఁ’డంచునుం దగిలి చూపఱు సాల్వ మహీశు విక్రమం
బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తులై

వారాంతంలో నష్టాల్లోకి..

ముంబయి, సెప్టెంబర్ 23: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గురువారం ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. బ్యాకింగ్ స్టాక్స్ లాంటి ఇటీవల లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సెనె్సక్స్ 105 పాయింట్లు నష్టపోయి 28,668.22 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 33.90 పాయింట్లు నష్టపోయి 8,831.55 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే సూచీలు గత నాలుగు వారాల్లో మూడు వారాలు లాభాలతోనే ముగియడం గమనార్హం.

ఎగుమతుల సబ్సిడీలు రద్దు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన రాయితీలను రద్దు చేసేందుకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రులు శుక్రవారం ఆమోదం తెలిపారు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు సురక్షితమైన, దీర్ఘకాలిక వ్యవసాయ వాణిజ్య విధానాల అమలుకు కట్టుబడి ఉంటామని ఉద్ఘాటిస్తూ ఈ సబ్సిడీల రద్దుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే శానిటరీ, ఫైటోశానిటరీ సమస్యలపై జరిపే చర్చల్లో శాస్ర్తియ సూత్రాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వీరు వక్కాణించారు.

సహారాకు చెందిన 13 ఆస్తులకు వచ్చే నెలలో సెబీ వేలం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్న మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థకు చెందిన మరో 13 ల్యాండ్ పార్శిళ్లను వచ్చే నెలలో వేలం వేయబోతున్నామని, వీటి మొత్తం రిజర్వు ధరను దాదాపు 1,400 కోట్ల రూపాయలు నిర్ణయించడం జరిగిందని సెబీ స్పష్టం చేసింది. గత జూలైలో వేలం వేయాల్సి ఉన్న 58 ఆస్తులకు అదనంగా వచ్చే నెలలో మరో 13 ఆస్తులను వేలం వేయబోతున్నామని, ఈ ఆస్తులన్నింటి రిజర్వు ధర దాదాపు 5 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని సెబీ పేర్కొంది.

పోస్టల్ పేమెంట్ బ్యాంక్ త్వరలోనే ఏర్పాటు

సింహాచలం, సెప్టెంబర్ 23: ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి బివి సుధాకర్ తెలిపారు. సింహాచలం వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఒక లక్షా ఏభైవేల పోస్ట్ఫాసుల్లో అన్‌లైన్ సేవలందించేందుకు నెట్‌వర్కింగ్ పూర్తయిందన్నారు. తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం గ్రామీణ డాక్ సేవక్ పేరుతో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ దశలో ఉందన్నారు.

సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయ. తల్లి చనిపోవడంతో మానవతా కారణాలపై ఇటీవల సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరికి ఇటీవల మంజూరు చేసిన బెయిల్‌తో పాటు అన్ని రకాల తాత్కాలిక ఊరటలను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. అంతేకాకుండా వీరందరినీ మళ్లీ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్, జస్టిస్ ఎఆర్.దవే, జస్టిస్ ఎకె.సిక్రీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

జాతీయ స్థాయి సలహా సంస్థగా ఏపి ట్రాన్స్‌కో

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు ఏపి ట్రాన్స్‌కో సేవలను జాతీయ స్ధాయిలో వినియోగించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ వివరాలను ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీని పటిష్టం చేయడానికి ఏపి ట్రాన్స్‌కోను సలహాదారుగా కేంద్రం నియమించిందని ఆయన చెప్పారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

Pages