S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత ప్రపంచాన మేరునగధీరుడు ఎస్‌పి

గుంటూరు (పట్నంబజారు), జూన్ 10: సంగీత ప్రపంచంలో మేరుగనధీరుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అని రచయిత్రి ఎవికె సుజాత కొనియాడారు. అవగాహన సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం సంస్థ కార్యాలయంలో సినీ గాయకుడు ఎస్‌పి జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. నెలనెలా నిర్వహించే మనమూపాడుదాం రండి కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రచయిత్రి ఎవికె సుజాత మాట్లాడుతూ ఎస్‌పి బాలు అనే పదం వింటేనే లక్షలాది మంది సినీ అభిమానుల్లో సంగీతస్ఫూర్తి రగులుతుందన్నారు. విశ్రాంత ఇంజనీర్ ఘనశ్యామాచార్యులు మాట్లాడుతూ నిత్యనూతనంగా పాడటం ఒక్క ఎస్‌పికే సాధ్యమన్నారు.

కొనసాగుతున్న హైటెన్షన్

కాకినాడ, జూన్ 10: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా కాపునేతలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. ఈ బంద్ మాటెలా ఉన్నప్పటికీ ముద్రగడ అరెస్ట్ అనంతర పరిణామాలపై మాత్రం రెండోరోజైన శుక్రవారం కూడా హెటెన్షన్ కొనసాగింది. జిల్లా కేంద్రం కాకినాడ సహా పలు ప్రాంతాల్లో సాయుధ దళాలు భారీగా మొహరించడంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఫలితంగా పౌర జీవనానికి ఆటంకం కలుగలేదు. అయితే ముద్రగడ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో యధావిధిగా దీక్ష కొనసాగిస్తుండటం, మరోవైపు అరెస్ట్‌ల పరంపర కొనసాగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

రూ.7లక్షల విలువైన గంజాయి స్వాధీనం

రాజవొమ్మంగి, జూన్ 10: ఏజెన్సీ నుండి తమిళనాడుకు తరలిస్తున్న రూ.7లక్షల విలువైన ఎండు గంజాయిని శుక్రవారం జడ్డంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మారుమూల గ్రామాల్లో పండిస్తున్న గంజాయిని నలుగురు వ్యక్తులు కొనుగోలుచేసి అటవీ మార్గం గుండా జడ్డంగి సమీపంలోని అరటి తోటలో రహస్యంగా దాచారు. గంజాయిని అక్కడి నుండి తరలించేందుకు రహదారిపై అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నాలుగు బస్తాల్లో దాచి ఉంచిన 140 కిలోల గంజాయి బయటపడింది.

దళిత గిరిజనులకు అండగా ఉంటాం

ముమ్మిడివరం, జూన్ 10: రాష్ట్రంలోని దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పోరాడతానని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. శుక్రవారం స్థానిక కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో ముమ్మిడివరం నియోజకవర్గ దళిత, గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శివాజీకి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అధ్యక్షతన జరిగిన సభలో శివాజీ మాట్లాడారు. ముందుగా నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ చెల్లి శాంతికుమారి అంబేద్కర్, బుద్ధుని చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు.

ముద్రగడకు మద్దతుగా కిర్లంపూడి బంద్

ప్రత్తిపాడు, జూన్ 10: గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రడను అరెస్టుచేసినందుకు నిరసనగా కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేశారు. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలకు గురిచేసి పోలీసులు తీసుకుపోవడం అన్యాయమని పలువురు కాపు యువత విమర్శించారు. ప్రజా సమస్యల కోసం గతంలో ముద్రగడ ఆరుసార్లు నిరాహార దీక్షలు చేసిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రులెవరూ చంద్రబాబులా వ్యవహరించలేదన్నారు. ఈ చర్యతో సిఎం చంద్రబాబు పతనం ప్రారంభమైందన్నారు. భవిష్యత్తులో కాపుల తడాఖా ఏమిటో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు.

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

కొత్తపేట, జూన్ 10: సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా చట్టాలను అతిక్రమించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో కోనసీమ బంద్‌కు కాపు సంఘాలు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ శుక్రవారం కోనసీమలో పర్యటించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో సెక్షన్ 30తో పాటు సెక్షన్ 144 నెలాఖరు వరకూ అమలులో ఉందన్నారు. ఈ కారణంగా సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

నివురుగప్పిన నిప్పు..

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పోలీసు అదుపు, ఆసుపత్రికి తరలింపు నేపధ్యంలో జిల్లా అంతటా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో అణువణువు పోలీస్ పహారా కాశారు. సుమారు 6 వేల మంది ప్రత్యేక పోలీస్ బలగాలు జిల్లా అంతటా మోహరించాయి. భారీ సంఖ్యలో పోలీసులు మప్తీలో జిల్లాను చుట్టుముట్టారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ముద్రగడను శుక్రవారం పరామర్శించేందుకు వచ్చిన సమీప బంధువులను సైతం పోలీసులు ముద్రగడ దరికి చేరనీయలేదు. ఈనేపధ్యంలో జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది.

మందపల్లిని సందర్శించిన బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిఎం

కొత్తపేట, జూన్ 10: మండల పరిధిలోని మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామిని బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ పివి సుబ్బారెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ మర్యాదలతో దేవస్థానం ఛైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి దంపతులు స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఇఒ వెత్సా దేముళ్లు తదితరులు పాల్గొన్నారు.

ముద్రగడకు మద్దతుగా సెల్‌టవర్ ఎక్కిన యువకులు

మామిడికుదురు, జూన్ 10: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని ఉద్యమం సందర్భంగా ముద్రగడ అభిమానులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యువకులు శుక్రవారం నగరంలో సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే కిందకు దిగుతామని హంగామా సృష్టించారు. దీంతో రాజోలు సిఐ జివి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా అక్కడకి చేరుకున్న వందలాది మంది ముద్రగడ అభిమానులు డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. డిమాండ్లను ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళతానని పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళనకారులు వానరాశి ప్రసాద్, గిడుగు సురేష్ టవర్ దిగివచ్చారు.

కాపు నాయకులు జైలుకు తరలింపు

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపుగర్జన సందర్భంగా తుని విధ్వంసం కేసులో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు కాపునాయకులను శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు తరలించారు. వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, పల్లా విష్ణుమూర్తి, జి రాంబాబు, లచ్చిబాబు, చిక్కాలపల్లి సత్తిబాబులను కాకినాడ కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు తరలించారు.

Pages