S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలమూరు ఎత్తిపోతల నిర్వాసితుల ఆందోళన

మహబూబ్‌నగర్, జూన్ 10: పాలమూరు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులు శుక్రవారం ఆందోళనకు కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. ఏదుల రిజర్వాయర్‌లో(మిగతా 3వ పేజీలో)

హరితహారం ద్వారా 4.50 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

పాన్‌గల్, జూన్ 10: పాలమూరు జిల్లాలో హరిత హారం పథకం ద్వారా 4.50కోట్లు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని డిఆర్‌డిఏ పిడి మదుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో వన నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపడుకునేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. డి ఆర్ డి ఏ ద్వారా జిల్లాలో 60లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని ప్రతి మహిళా సంఘం సభ్యురాలు 10మొక్కలు నాటి పెంచేలా చూడాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో నయా దొరల పాలన!

గద్వాల, జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఘనమైన విజయాలు సాధించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, అమరవీరుల త్యాగాల ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను మరిచి అధికారమే పరమావదిగా తెలంగాణలో నయాదొరలపాలన తరహా రెండేళ్లుగా కొనసాగుతుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు సంకర్‌ప్రభాకర్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి హరిబాబు, కెఎన్‌పిఎస్ జిల్లా కమిటి సభ్యుడు రవికుమార్, డిటిఎఫ్ తాలుకా అధ్యక్షుడు రంజిత్‌కుమార్, సిఎల్‌సి జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్, రత్నంలు ఆరోపించారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 10: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నాఠు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేట, పాతతోట, సంజయ్‌నగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సంజయ్‌నగర్‌లో పవర్‌బోర్డుకు భూమిపూజ చేసి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. వార్డుల పర్యటన సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

పెద్దకొత్తపల్లి, జూన్ 10: పాలమూరు ఎత్తిపోతల పథకం కాలువ పనులలో భూములు కోల్పొతున్న కల్వకోలు, చెన్నపురావుపల్లి గ్రామాల రైతులు జీవో 123ను రద్దుచేసి నష్టపరిహారం ఇచ్చినాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు రైతులు చేరుకొని భూములు కోల్పొతున్న రైతులకు ఎలాంటి సమాచారంగాని, నోటీసులుగాని ఇవ్వకుండా పనులు చేస్తున్నారని, ఏ రైతుకు ఎంతమేర నష్టపరిహారం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్‌ఐ బాలరాజుకు వినతిపత్రాన్ని అందించారు.

ఫిట్‌నెస్ లేని బడి బస్సులను నడిపిస్తే చర్యలు

షాద్‌నగర్, జూన్ 10: ఫిట్‌నెస్ లేకుండా పాఠశాలలకు సంబంధించి బస్సులను నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ఎంవిఐ నాగరాజు వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, పురపాలిక సంఘంలో మొత్తం 112 స్కూల్ బస్సులు ఉన్నాయని, వాటిలో 60నుండి 70బస్సులు ఫిట్‌నెస్ చేయించుకున్నాయని వివరించారు. జూన్ 13వ తేది వరకు ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే బస్సులకు ఫిట్ చేయడం జరుగుతుందని, పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై స్కూల్ బస్సులు నడిపిస్తే యిజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మహబూబ్‌నగర్, జూన్ 10: మైనారిటీల అభివృద్ద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అదేవిధంగా మైనారీటీలు చదువులో కూడా రాణించాలనే దృక్పదంతో మైనారీటి స్టడీ సర్కిల్‌ళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వక్ప్‌కాంప్లేక్స్‌లో మైనారీటి స్టడీ సర్కిల్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ముస్లీం మైనారిటీల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

నిస్సిగ్గు రాజకీయాలు

ఈమధ్యన ఎమ్మెల్యేలు ఒక పార్టీలోనుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు వేస్తున్నారు. అంటే వీరు ఒక విధమైన కప్పలన్నమాట. అసలు ఒక పార్టీలో ఇమడలేని వాడు మరో పార్టీలో ఇమడగలడా? అనేది ఆశ్చర్యమే. ఇది రాజకీయ వ్యభిచారం తప్పించి మరేం కాదు. ఈ కప్పగెంతుల్ని ప్రోత్సహించేది ముఖ్యమంత్రులే కావడం వల్ల ముక్కుమీద వేలు వేసుకోవాల్సి వస్తున్నది. ఇలా పార్టీలు మారేవాళ్లకు విలువేముంటుంది? విలువలతో పని లేదనుకున్న వాడే అసలు సిసలైన రాజకీయవేత్త. వీళ్లు మళ్లీ నెగ్గుతారనేది అనుమానమే. కాని వారు నిస్సిగ్గుగా పోటీలోకి దిగుతారు. ఓడిపోడం ఖాయమని తెలిసి కూడా. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో రాజకీయ విలువలు చాలా గొప్పగా ఉండేవి.

తెలంగాణపై కనే్నసిన కమలం

తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ కనే్నసింది. ‘టార్గెట్-2019’గా పెట్టుకుని కమలనాథులు పని చేస్తున్నారు. అందుకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా పక్షం రోజుల్లో తెలంగాణకు శుక్రవారం మలివిడత వచ్చారు. ఏదైనా సమయం-సందర్భం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని పెద్దలంటారు. అలాంటి సమ యం-సందర్భం ఇప్పుడు తెలంగాణలో వచ్చిందని బిజెపి నాయకులు భావిస్తున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి

వైద్యం పేరిట దోపిడీ

తెలుగు రాష్ట్రాల్లో తామరతంపరగా పెరిగిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎక్స్‌రే అవసరమున్నా అవసరం లేకున్నా ఎక్స్‌రే రాస్తారు. స్కానింగ్, ఎంఆర్‌ఐ, సీటి స్కాన్, తర పరీక్షలు కూడా యదేచ్ఛగా రాసేస్తున్నారు. పరీక్షలో రోగి జబ్బు ఏమిటో తెలిసిపోయినప్పటికీ ప్రిస్క్రిప్షన్ రాయకుండా అక్కరలేని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు రాస్తున్నారు. తర్వాత పది దాక మందుగోలీలు, సిరప్‌లు, వాయిల్స్ రాస్తూ పేద ప్రజలను దోచేస్తున్నారు. సరైన డాక్టర్ పట్టా లేనివారు, విదేశాల్లో నకిలీ డాక్టర్ పట్టాలు పొందినవారు పెద్ద అక్షరాలతో బోర్టులు, ఫ్లెక్సీలు కట్టి రోగులను ఆకర్షిస్తున్నారు.

-రావుల రాజేశం

Pages