S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గైర్హాజరైతే కఠిన చర్యలు

హైదరాబాద్, జూన్ 9: వైద్యులు తమ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, పదే పదే విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల బదిలీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గురువారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. బదిలీల ప్రక్రియ శుక్రవారం నుండి 10 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

మైనింగ్ సంస్థలన్నింటికీ రేటింగ్ వ్యవస్థ

హైదరాబాద్, జూన్ 9: దేశంలో ఉన్న మైనింగ్ సంస్థలు అన్నింటికీ రేటింగ్ ఇచ్చే వ్యవస్థను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. మైనింగ్ సంస్థలకు రేటింగ్‌ను ఇవ్వడం కోసం కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్టు గవర్నమెంట్ అందించనుంది. గురువారం నాడు కవాడిగూడలోని కేంద్రీయ సంస్థల కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అధికారుల మధ్య ఒప్పందంపై బల్విందర్‌కుమార్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

పేదలకు దివ్య దర్శనం

విజయవాడ, జూన్ 9: రాష్ట్రంలో పేదలకు దేవుని దర్శనాన్ని మరింత సులభంగా, ఉచితంగా జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్య దర్శనం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ వినూత్న పథకం వలన చాలా మంది నిరుపేదలు తిరుమల వెంకన్న స్వామి దగ్గర నుంచి మిగిలిన దేవుళ్లందరినీ పైసా ఖర్చు లేకుండా దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల్లోని పేదలను, అలాగే మిగిలిన వర్గాల్లోని నిరు పేదలను ఒక్కో జిల్లా నుంచి పది వేల మంది పేదలను ఎంపిక చేస్తుంది. వీరికి ఉచిత రవాణా, దర్శనం, పూజలు చేయించి తిరిగి వెనక్కు తీసుకువస్తుంది.

రాకెట్ లాంచర్లతో మావోల యుద్ధం

చింతూరు, జూన్ 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగావ్ జిల్లాలో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్యాంపుపై మావోయిస్టులు బుధవారం అర్థరాత్రి మెరుపుదాడి చేశారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు. కొండాగావ్ జిల్లాలోని రణపాల్ వద్ద ఉన్న 41వ బెటాలియన్‌కు చెందిన ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ క్యాంపును సుమారు వంద మంది మావోయిస్టులు మూడు వైపుల నుండి చుట్టుముట్టారు. అనంతరం నాలుగు రాకెట్ లాంచర్లతో క్యాంపుపై దాడి చేశారు.

మత్స్య సంపద పెంపునకు చర్యలు

అనంతపురం, జూన్ 9 : వర్షాకాలంలో జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు అన్నారు. గతేడాది ప్రభుత్వ పరంగా 75 లక్షల వివిధ రకాల చేపల్ని ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈఏడాది క్యాప్టివ్ రేరింగ్ పాండ్స్, సొసైటీల ఆధ్వర్యంలో గణనీయంగా చేపల్ని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 470 లక్షల చేప పిల్లల్ని ఉత్పత్తి చేయగా, ఈఏడాది 900 లక్షల పిల్లల్ని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం జిల్లా మత్స్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.

రైతులు నూతన పద్ధతులు పాటించాలి

రాప్తాడు, జూన్ 9: మండల పరిధిలోని రామినేపల్లి గ్రామ రైతుల పొలాల్లో గురువారం మంత్రి పరిటాల సునీత మహిళా రైతులతో కలిసి వేరుశెనగ పొలంలో వేరుశెనగ విత్తనాలు విత్తారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లాలో ముందస్తు వర్షాలు కురవడంతో అన్ని పొలాలు సాగు చేసుకున్నారని, అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండాలని రైతులందరూ సుభిక్షంగా వుంటే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అదేవిధంగా అగ్రికల్చరర్ జెడి శ్రీరామమూర్తితో రైతులకు సూచనలు, సలహాలు సూచించారు. విత్తనాల నాణ్యత, విత్తనాలు విత్తుకునేందుకు సరైన సమయం ఇదేనని, తదితర విషయాలపై సూచనలు తెలిపారు.

మోదీ నేతృత్వంలో అభివృద్ధి ఉద్యమం

గుంతకల్లు, జూన్ 9 : దేశంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధి ఉద్యమం చేపట్టినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఇల్లూరు గోపాలకృష్ణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోని పని చేసిన ప్రధానమంత్రులు విదేశాలకు అప్పులు కోసం వెళ్లేవారన్నారు. అయితే మోదీ సంస్కరణల వల్ల దేశం అభివృద్ధి చెందుతోందన్నా. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పును రూ, 40 వేల కోట్లను తీర్చారన్నారు. ఇకపోతే ప్రాంతీయ పార్టీల కులతత్వ పార్టీలుగా మారాయన్నారు.

నవధాన్య వ్యవసాయానికి కృషి

అనంతపురం సిటీ, జూన్ 9: జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో నవధాన్య వ్యవసాయాన్ని అమలుచేయడం జరుగుతోందని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించి నవధాన్య వ్యవసాయ పద్ధతి అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో, పాత పద్ధతులను పునరుద్ధరించడంతలో భాగంగా జిల్లాలో నవధాన్య వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహిస్తున్నామన్నారు.

నేరాలు తగ్గుముఖం

పెనుకొండ, జూన్ 9 : అనంతపురం, చిత్తూరు జిల్లా పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఫ్యాక్షన్ ఉన్న గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఆయా కార్యకలాపాలు పూర్తిగా రూపుమాపినట్లు తెలిపారు. ర్యాగింగ్, నిర్భయ, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పాత కేసులను సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. మహిళా డిఎస్పీలను ఎక్కువ మందిని నియమించి మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆగస్టు నాటికి హంద్రీనీవా పూర్తి

ఆత్మకూరు, జూన్ 9: మండల పరిధిలో వై.కొత్తపల్లి వద్ద హంద్రీనీవా కాలువపై నిర్మిస్తున్న రెండు బ్రిడ్జిలు రెండవ ప్యాకేజీలో చాలా కీలకమైనవని ఎలాగైనా ఆగస్టు నాటికి పూర్తి చేయించాలనే కృతనిశ్ఛయంతో ఉన్నామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వై.కొత్తపల్లి సమీపంలో 237 కి.మీ. దూరంలో నున్న రెండవ ప్యాకేజిలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతి ఆలస్యంగా వచ్చిందని అందుకే మార్చి నాటికే పూర్తికావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

Pages