S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీడియాపై ఆంక్షలు

ప్రత్తిపాడు, జూన్ 9: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన సమాచారం సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీక్షను మొదలుపెట్టే సమయంలో మీడియాతో ముద్రగడ మాట్లాడుచున్నారని, లోపలికి వెళ్ళాలని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతించలేదన్నారు. ముద్రగడ ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లో కూర్చోవాలని సెలవిచ్చారు. అప్పటికే కొంతమంది ముద్రగడ నివాసంలోకి వెళ్లడంతో కొంతమందిని పంపించి, మరికొంతమందిని నిలువరించడంపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకోకు దిగారు.

పోలీసుస్టేషన్‌లో అక్రమ ప్రవేశంపై కేసు నమోదు

అమలాపురం, జూన్ 9: అమలాపురం పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా ప్రవేశించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతోపాటు 11 మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. మంగళవారం ఉదయం ముద్రగడతోపాటు పలువురు కాపు నాయకులు పోలీస్‌స్టేషన్‌ను చేరుకుని స్టేషన్‌లో బైఠాయించడం, వారిని నాటకీయ పరిణామాల మధ్య కిర్లంపూడి తరలించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ముద్రగడతోపాటు కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, నల్లా పవన్, నల్లా అజయ్, గోపు అచ్యుతరామయ్య, సూదా గణపతిలతో పాటు అల్లర్లకు పాల్పడిన మరో 34 మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు.

పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన నల్లా సోదరులు

అమలాపురం, జూన్ 9: పోలీసు అదేశాలు ధిక్కరించి దీక్షలు చేపట్టిన దివంగత నేత నల్లా సూర్యచంద్రరావు కుమారులు నల్లా అజయ్, సంజయ్‌లు కొద్దిసేపు అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ముద్రగడకు మద్దతుగా అజయ్, సంజయ్‌లు వారి స్వగృహంలో గురువారం దీక్షలు నిర్వహించారు. దీక్షలు సందర్భంగా నల్లా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపధ్యంలో పోలీసులు అజయ్, సంజయ్‌లను అరెస్టు చేస్తారన్న పుకార్లు గుప్పుమన్న కొద్దిసేపటికే వారిద్దరూ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. పోలీసులు యధావిధిగా వారి ఇంటి ఆవరణలో ఉన్నప్పటికీ అజయ్, సంజయ్‌లు కనిపించకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది.

హై టెన్షన్

కాకినాడ, జూన్ 9: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపధ్యంలో అనంతర పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య గురువారం సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడను ఆయన స్వగృహంలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు జరిగే సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముద్రగడ సహా ఆయన అనుచరులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఇదే సమయంలో సుమారు 50 మంది ముద్రగడ అనుచరులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కిర్లంపూడి నుండి కాకినాడ నగరంలోని త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌కు నేరుగా తరలించారు.

ఆర్టీసీ బస్సు బోల్తా

చింతూరు, జూన్ 9: మండలంలోని కాటుకపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు గురువారం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవరుకు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలావున్నాయి. తాండూరు డిపోకు చెందిన బస్సు తాండూరు నుండి చిడుమూరుకు గురువారం బయలుదేరింది. ఈ క్రమంలో మండలంలోని కాటుకపల్లి వద్ద ఉదయం 7 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవరు ఇస్మాయిల్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందిలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

కొబ్బరి అంతర్ పంటల్లో ఆంధ్రాదే అగ్రస్థానం

కడియం, జూన్ 9: కొబ్బరి అంతర పంటల్లో ఆంధ్రాదే అగ్రస్థానమని సెంట్రల్ ప్లాంటేషన్ రీసెర్చ్ ఇనె్వష్టిగేషన్ డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప అన్నారు. సిసిఆర్‌ఐ పరిశోథనా కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం కేంద్ర బృందం గురువారం కడియం వచ్చింది. పలు ప్రభుత్వ భూములను ఈ బృందం పరిశీలించింది. కొబ్బరి ఉత్పత్తిలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సిటిఆర్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కొబ్బరితో చాక్లెట్లు తయారీ, చక్కెర తయారీ, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నీళ్లు వంటి ఆహార పానీయాలు తీయవచ్చునని, వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండు ఉందన్నారు.

పడిగాపులు గాసినా దొరకని చినబాబు దర్శనభాగ్యం!

గుంటూరు, జూన్ 9: దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తమకు ఉందని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు వారి సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందనేది తేటతెల్లమైంది. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చారు. పార్టీ సంఘాల నాయకులతో పాటు రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆయన్ను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఆరుబయట గంటలకొద్దీ పడిగాపులు గాసినా చినబాబు దర్శనభాగ్యం కలగలేదు.

భర్త చేతిలో నవ వధువు హతం

జగ్గయ్యపేట, జూన్ 9: వివాహమై పట్టుమని రెండు నెలలు పూర్తి కాకుండానే ఒక నవ వధువు భర్త చేతిలో హత్యకు గురైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన జిడుగు రాణికి పెనుగంచిప్రోలుకు చెందిన వెంకట నారాయణ (21)తో ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం జరిగింది. బుధవారం భార్య రాణితో కలిసి వెంకట నారాయణ మేళ్లచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లారు.

రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు ఎన్‌ఓసి మెలిక

మంగళగిరి, జూన్ 9: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర పరిధిలోని 29 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను గురువారం మధ్యాహ్నం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపివేశారు. ఆయా గ్రామాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయాలంటే సిఆర్‌డిఎ అధికారుల నుంచి నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఓసి) తెచ్చుకుంటేనే చేస్తామని మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ బి నాగేశ్వరరావు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు మామూలుగానే రిజిస్ట్రేషన్లు చేశామని, జిల్లా రిజిస్ట్రార్ల నుంచి అందిన సమాచారం మేరకు రాజధాని గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపి వేశామని, ఎన్‌ఓసి తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన తెలిపారు.

గుంటూరులో కాపునాడు కార్యకర్తల బైండోవర్

గుంటూరు, జూన్ 9: కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్‌తో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున కాపునాడు కార్యకర్తలను బైండోవరు చేశారు. నగరంపాలెం, లాలాపేట, పాత గుంటూరు, కొత్తపేట పోలీసుస్టేషన్ల పరిధిలో 100 మందికి పైగా కార్యకర్తల నుంచి లిఖితపూర్వకమైన పత్రాలను తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపునాడు కార్యకర్తల ఇళ్ల దగ్గర పోలీసులు నిఘావేసి స్టేషన్లకు తరలించారు. దీంతో ఒకింత ఉద్రిక్తత నెలకొంది.

Pages