S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యో..పాపం!

హిందూపురం, జూన్ 9 : దేశాలు దాటుకుని సంతానోత్పత్తి కోసం దశాబ్దాల కాలంగా వస్తున్న విదేశీ అతిథులు పాపం... అర్ధాకలితో చనిపోతున్నాయి. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం వీరాపురానికి ఎర్రమూతి కొంగలు (సైబీరియన్ పక్షులు) ప్రతియేటా విచ్చేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పెద్దసంఖ్యలో విదేశీ విహంగాలు సంతానోత్పత్తి కోసం వీరాపురం చేరుకున్నాయి. అయితే గతంలో తరహాలోనే ఆహారం కోసం పక్షులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

హిందూపురం, జూన్ 9 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టిడిపి నేతల సవాల్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికంగా ఉంటూ ప్రజాసేవకు అంకితమవుతానని చెప్పిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా విచ్చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

ప్రతి వర్షం నీటి చుక్క నిల్వ చేసుకోవాలి

అనంతపురం సిటీ, జూన్ 9: వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, నీటి పారుదల శాఖ అధికారులతో నగరంలోని మున్సిపల్ అతిథి గృహంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నందున ప్రతి వర్షపు చుక్క వృథా కాకుండా చెరువులు, కుంటలలో నిల్వ చేసుకోవాలని సూచించారు. పని ఇస్తేనే చెరువు వద్దకు పోతాననే భావన నాయకులకు ఉండకూడదన్నారు.

నైపుణ్య శిక్షణతో బంగారు భవిత

అనంతపురం, జూన్ : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్యం పెంపొందించుకోకపోవడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాట వేసుకోవచ్చని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక పివికెకె డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణలో భాగంగా పివికెకె ఇంజినీరింగ్ కళాశాలలో ఈఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 15 కంపెనీల ద్వారా 284 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు.

విదేశీ విద్యాసంస్థల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

అనంతపురం, జూన్ 9: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులు అప్రమత్తతంగా వ్యవహరించాలని ఐటిశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. చేరబోయే విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలను ఇంటర్‌నెట్ ద్వారా సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. గురువారం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే విద్యార్థులు ముందుగా అక్కడి పద్ధతులు, వివరాలు తెలుసుకోవాలన్నా రు. ఎంపిక చేసుకున్న విద్యాసంస్థ లు, యూనివర్సిటీలకు గుర్తింపు ఉం దా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలన్నారు. ఏజెన్సీల ద్వారా విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేవారు అ క్కడి విద్యాసంస్థలకు గుర్తింపు లేదని తెలుసుకుని అవస్థలు పడుతున్నారన్నారు.

విద్యార్థి ఆత్మహత్య

చిలమత్తూరు, జూన్ 9 : మండల పరిధిలోని దేమకేతేపల్లికి చెందిన ఆదిలక్ష్మమ్మ, గోపాల్ కుమారుడు గొల్ల బాలు (13) గురువారం ఆత్మహత్య చేసుకునాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఉన్నత పాఠశాలలో బాలు తొమ్మిదో తరగతి చదువుతుండగా కనీసం సెలవు రోజుల్లో అయినా ఇంట్లో పనులు చేయాలని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలు పక్కనే ఉన్న మల్బరీ షెడ్డులోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై జమాల్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బావిలో మహిళ శవం లభ్యం

గ్రామాల్లో విద్యుత్‌శాఖ దాడులు

ఓబులవారిపల్లె, జూన్ 9:మండలంలోని ఓబులవారిపల్లె, చిన్నఓరంపాడు, గాదెల, చిన్నంపల్లె, గొబ్బివారిపల్లె గ్రామాలలో గురువారం ట్రాన్స్‌కో ఏఇ యోగానంద్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై 60 కేసులు నమోదు చేసి, రూ.2.20 లక్షల జరిమానా విధించామని ఏఇ తెలిపారు. అధిక ఓల్టేజీ వాడుతూ లోఓల్టేజీ చూపే వారిపై 60 కేసులు నమోదు చేసి రూ.90 వేల జరిమానా విధించామన్నారు. గ్రామాలలో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒకరు తమ ఇళ్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ మీటర్లను కూడా వారి స్థాయిని బట్టే తక్కువ ధరలకే ప్రభుత్వం అందజేస్తోందన్నారు.

మహాసంకల్పం పేర కోట్లు దుర్వినియోగం

కడప, జనవరి 9:ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి రెండుసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడపలో బుధవారం మహాసంకల్పం సభ ఏర్పాటుతోపాటు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం, ముఖ్యమంత్రి బాబు రెండేళ్లపాలనలో ప్రజాసంక్షేమం కోసం పాటుపడింది శూన్యమని జిల్లాకు చెందిన వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, మేయర్ కె.సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్ గూడురు రవి తదితరులు విలేఖర్ల సమావేశంలో బాబు పాలనపై ధ్వజమెత్తారు.

జగన్ విమర్శలు తిప్పికొట్టండి

కడప, జూన్ 9:వైకాపా నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి జిల్లాలో తెలుగుదేశం కేడర్ విఫలవౌతోందని జగన్ ఆరోపణలను నేతలంతా మూకుమ్మడిగా ఎదుర్కోవాలని, ఆదిపత్యపోరు, వర్గపోరుకు స్వస్తిచెప్పి పార్టీని బలోపేతం చేయాలని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు తెలుగుతమ్ముళ్లకు క్లాస్ తీసుకున్నారు. జిల్లాలో ఆయన రెండురోజుల పాటు మకాం వేసి బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో నియోజకవర్గాల వారీగా నేతలతో వ్యక్తిగతంగా పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సమర్థవంతంగా పనిచేయండి

కడప, జూన్ 9:జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ఉన్న వనరులతో ప్రజలకు దోహదపడే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఆధికారుల సమీక్షా సమావేశంలో అధికారులకు సుదీర్ఘంగా హితబోధ చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్టవ్య్రాప్తంగా ఏ ప్రాంతంలో ఎంతవర్షపాతం నమోదు అవుతుందో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుంటున్నామని అధికారులు కూడా సాంకేతిక పరంగా ముందుకు పోవాలన్నారు.

Pages