S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్ర స్మగ్లర్ సంగీతా ఛటర్జీ అరెస్టుకు రంగం సిద్ధం

చిత్తూరు, జూన్ 9: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతున్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతాఛటర్జీ అరెస్టుకు చిత్తూరు జిల్లా పోలీసులు రంగం సిద్ధం చేశారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కలకత్తాకు వెళ్లాయి. ఆమెపై జిల్లాలో నమోదు అయిన కేసుల విచారణ కోసం రావాల్సి ఉండగా రాకపోవడాన్ని జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. ఇటీవల చిత్తూరు పోలీసులు కలకత్తాకు చెందిన బడా స్మగ్లర్ లక్ష్మణన్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు కలకత్తాలో దాడులు నిర్వహించారు.

రానున్న మూడేళ్లలో జిల్లాలో 90 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు

తిరుపతి, జూన్ 9: చిత్తూరు జిల్లాలో రానున్న మూడేళ్లలో 90 పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగాను 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్‌జైన్ అన్నారు. ఎస్వీ యూనివర్శిటీలోని సెనెట్ హాల్లో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, ఉపాధి, సాంకేతికత, నైపుణ్యాల అమలులో జిల్లాలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై తొలి సమావేశం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

పీలేరు, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నదని పీలేరు మాజీ ఎమ్మెల్యే జవి శ్రీనాద్ రెడ్డి అన్నారు. గురువారం కోటపల్లి హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మన అంగన్‌వాడీ పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం జరుగుతున్నదని, అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు, యుక్తవయస్సు కలిగిన స్ర్తిలకు పౌష్టికాహారం అందించడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.

నెలాఖరులోగా కుప్పంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

తిరుపతి, జూన్ 9: కుప్పం నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈనెలాఖరులోగా పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులను ఆదేశించారు. స్థానిక జీవనోపాధి వనరుల కేంద్రంలో గురువారం కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో నీరు-చెట్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈనెల 18వ తేదీన కుప్పం లో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించడం జరుగుతుందని, ఈసందర్భంగా అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలన్నారు. ఏనుగుల నియంత్రణ కోసం అటవీశాఖ అధికారులతో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

కోనసీమలో కొబ్బరి పార్కు

అంబాజీపేట, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలకు అనువుగా ఉన్న కోనసీమలో కొబ్బరి పరిశ్రమల పార్కు నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామని సిపిసిఆర్‌ఐ డైరెక్టర్ చౌడప్ప తెలిపారు. గురువారం అంబాజీపేటలో సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిపిసిఆర్‌ఐ) ప్రాంతీయ కార్యాలయం కడియం మండలం జేగూరుపాడు శివారు మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు చేయనున్నందున పరిశీలన నిమిత్తం జిల్లాకు రావడం జరిగిందన్నారు.

ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారు

కాకినాడ, జూన్ 9: జిల్లా అధికారులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఇష్టారాజ్యంగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని అధికార, ప్రతిపక్షానికి చెందిన పలువురు ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సాధారణ సమావేశం స్ధానిక జడ్పి సమావేశ మందిరంలో జడ్పి ఛైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా వ్యవసాయ శాఖపై చర్చను ప్రారంభించారు.

జిల్లాలో నెలఖారు వరకు సెక్షన్ 144, 30 యాక్టు అమలు

జగ్గంపేట, జూన్ 9: జిల్లాలో ఈ నెలాఖరు వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144, 30 యాక్టు అమలులో ఉందని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. జనవరి 31న జరిగిన తుని రైలు దహనం ఘటనలో సిబిసిఐడి 67 కేసులు నమోదు చేసిందని, దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఏడుగురిని సిబిసిఐడి వారు అదుపులోకి తీసుకుని కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారన్నారు.

జిల్లాలో 1.5 కోట్ల మొక్కలు పంపిణీ

కాకినాడ, జూన్ 9: జిల్లాలో నీరు-చెట్టు పధకం కార్యక్రమం కింద సామాజిక వనాల అభివృద్ధి కార్యాచరణపై జిల్లా సామాజిక అటవీశాఖ ప్రచురించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ జడ్పి సమావేశపు హాలులో గురువారం ఆవిష్కరించారు. జిల్లాలో నీటి సదుపాయం ఉన్న 200 పాఠశాలల్లో వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ నామన రాంబాబు, జడ్పి సిఇఓ కె పద్మ, డివిజనల్ అటవీ శాఖాధికారి ఎవిఎస్‌ఆర్‌కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

కోనసీమలో హైటెన్షన్

అమలాపురం, జూన్ 9: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో దీక్ష చేపట్టిన నేపధ్యంలో కోనసీమ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ముద్రగడ అమరణ నిరాహార దీక్షకు మద్దతుగా దీక్షలు చేపట్టాలని టిబికెజెఎసి పిలుపునివ్వడంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో కోనసీమ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టిబికె జెఎసి చైర్మన్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక గడియారపు స్తంభం వద్ద దీక్షల సన్నాహాలను పోలీసులు అడ్డుకున్నారు.

నిఘా నీడలో కిర్లంపూడి: అప్రకటిత కర్ఫ్యూ

ప్రత్తిపాడు, జూన్ 9: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షతో కిర్లంపూడి, ప్రత్తిపాడు ప్రాంతాలు పోలీసు నిఘా నీడలోకి వెళ్లాయి. ప్రత్తిపాడు నుండి కిర్లంపూడికి వెళ్లేవారిని పోలీసులు తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు. ప్రత్తిపాడు గ్రామంలోకి కూడా ఎవ్వరూ రాకుండా బైపాస్ నుంచే పంపిస్తున్నారు. చివరకు బస్సులు కూడా రానీయలేదు. ప్రత్తిపాడు నుంచి కిర్లంపూడికి వెళ్లే మార్గంలో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలో అయితే ఏకంగా బెటాలియన్లకు బెటాలియనే్ల దిగాయి. ముద్రగడ ఇంటికి రెండుపక్కలా పూర్తిగా దిగ్బంధించారు. ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు.

Pages