S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్ దూకుడుకు కళ్లెం!

కడప, జూన్ 9:వైకాపా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో వైకాపా ప్రాధాన్యతను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబులు రెండురోజులపాటు జిల్లాలో మకాం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారయంత్రాంగంపై తెలుగుదేశం మార్క్ వేసుకోవడానికి శాఖ ల వారీగా అధికారులతో సమీక్షించా రు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో పనిచేసిన అధికారులు ప్రస్తుతం టిడిపి ప్రభుత్వంలో ఏ విధ ంగా వ్యవహరిస్తున్నారోనని వారి వ్యవహారశైలిపై బాబు గమనిస్తున్నట్లు తె లుస్తోంది.

అన్నదాతగా ఖ్యాతిగాంచిన కేరి

కడప,(కల్చరల్)జూన్ 9:దేశంలో పేద, సామాన్య ప్రజలకు సేవ చేసిన గొప్పసాంఘిక సంస్కర్తలలో విలియం కేరి ఒకరని అసోసియేషన్ ఫర్ యునైటెడ్ చర్చి ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కె.శ్యామ్యూల్‌బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక చిన్నచౌకులోని అశోక్‌నగర్‌లో ఉన్న హోళి జీసస్ క్రైస్ట్ కేథడ్రిల్ చర్చిలో విలియం కేరి వర్దంతి సందర్భంగా ఆయన స్మృతులను నెమరు వేసుకున్నారు. తొలుత విలియం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా బిషప్ శ్యామ్యూల్‌బాబు మాట్లాడుతూ 1761 ఆగస్టు 17న ఇంగ్లండులో విలియం కేరి జన్మించారన్నారు.

కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి

చాపాడు, జూన్ 9:మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, టిటిడి పాలకమండలి సభ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కేతవరం గ్రామంలో మాజీ సర్పంచ్ వీరప్రతాప్‌తోపాటు వారి అనుచరులు వంద కుటుంబాలు వైకాపా నుంచి టిడిపిలోకి పుట్టా సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మైదుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా పనిచేస్తున్నానని, అందుకు అనుగుణంగా టిడిపి కార్యకర్తలు కూడా తనకు అండదండగా నిలుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

12న తల్లిదండ్రుల పాదపూజ

రాజంపేట టౌన్, జూన్ 9:స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా తల్లిదండ్రుల పాద పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు టివి రమణారెడ్డి, అబ్దుల్లా, సి.చెంగయ్య తెలిపారు. తరాలు మారే కొద్ది తల్లిదండ్రులు-సంతానానికి మధ్య ఉండాల్సిన ఆత్మీయతా-అనురాగాలు తరిగి పోతున్న కారణంగా కుటుంబాలలో సుఖ సంతోషాలు దూరమై అశాంతి నిలయాలుగా తయారవుతున్న దృష్ట్యా ధార్మిక, నైతిక విలువలతో కూడి శాస్త్రోక్తంగా ఈ పాద పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.

చెంచులకు శాశ్వత ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి

కడప,(కల్చరల్)జూన్ 9: జిల్లాలో ఏళ్ల తరబడి నివసిస్తున్న చెంచులకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.అంకుశం అన్నారు. బుధవారం స్థానిక రా.రా గ్రంథాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు వంద సంవత్సరాలు పైబడి వివిధ ప్రాంతాల్లో చెంచులు నివశిస్తున్నారన్నారు. ప్రధానంగా కడప నగరంలోని పాలంపల్లె, అల్లూరుసీతారామరాజు నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 80 కుటుంబాల వారు వివిధ వృత్తులు చేసుకుని వారి పిల్లలను చదివిస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వం వీరిని చెంచులుగా పరిగణిస్తూ వచ్చిందని, విద్య, ఉద్యోగాలు కల్పిస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు.

నీరు-చెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు

రాజుపాళెం, జూన్ 9:మండలంలోని మడవంక నీరు-చెట్టు కార్యక్రమంతో దాని రూపురేఖలు మారిపోయాయి. పర్లపాడు నుండి తొండలదినె్న వరకు ఉన్న మడవంకలో పూడికతీత పనులు చేపట్టడం వలన అక్కడ వర్షం నీళ్లు నిలిచి ఉన్నాయి. వెంగళాయపల్లె గ్రామ సమీపంలోని మడవంక వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ వర్షం నీళ్లతో పరవళ్లు తొక్కుతోంది. గత రెండుమూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు పైతట్టు ప్రాంతాల నుంచి వచ్చిన వర్షం నీరంతా మడవంకలో చేరడంతో వర్షం నీటితో పొంగి ప్రవహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నీరు-చెట్టు కార్యక్రమంలో 20 రీచ్‌లలో రూ.కోటితో పూడికతీత పను లు జరిగాయి. ఇక రూ.30 లక్షలతో మడవంక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.

ఇ-పబ్లికేషన్స్‌లో టిటిడి ప్రచురణలకు విశేష ఆదరణ

తిరుమల, జూన్ 9: ధర్మ ప్రచారంలో బాగంగా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేందుకు ఇ-పబ్లికేషన్స్‌లో ఉంచిన టిటిడి ప్రచురుణలకు విశేష స్పందన లభిస్తోంది. టిటిడి ఇ ఒ డాక్టర్ డి సాంబశివరావు సూచనల మేరకు ఇప్పటి వరకు వివిధ భాషలకు చెందిన 3653 గ్రంథాలను టిటిడి వెబ్‌సైట్‌లోని ఇ-పబ్లికేషన్స్‌లో ఉంచింది. వీటిలో శ్రీవారి వైభవాన్ని తెలిపే పుస్తకాలతోపాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు పిల్లలు నుంచి పెద్దల వరకు అకట్టుకుంటున్నాయి. టిటిడి ముద్రించిన గ్రంథాలను, ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన గ్రంథాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించింది.

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, జూన్ 9: శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ హెచ్ ఎల్ దత్తు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ దర్శన సమయంలో శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు మహద్వారం వద్ద తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఇ ఓ రామారావు పట్టువస్త్రాలు, శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

లారీకి ప్రమాదం.. ట్రాఫిక్‌కు అంతరాయం

శ్రీ కాళహస్తి, జూన్ 9: పట్టణంలోని పానగల్లులో నక్కలకాలువ వంతెనపై ఒక లారీ ప్రమాదవశాత్తూ ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరు వైపు నుంచి తిరుపతి వైపు ఇనుపకమీలతో వెళ్తుండిన భారీ లారీ నక్కల కాలువ వంతెనపై అడ్డు తిరగడంతో వాహనం ఎటూ పోలేక రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వాహనం కొంత భాగం కాలువలోకి దూసుకెళ్లడంతో దాన్ని రోడ్డుపైకి తీసుకురావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంతేకాకుండా శ్రీ కాళహస్తి పోలీసులు కడపలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడంతో పోలీసు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సుమారు 10 గంటలకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

జిల్లాలో 62మండలాల్లో వర్షం

చిత్తూరు, జూన్ 9: జిల్లాలో 62మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. పుంగనూరులో అత్యధికంగా 69మి.మీ వర్షపాతం నమోదైంది. కెపి పల్లెలో 46మి.మీ, రామసముద్రం 40.6, సోమల 62.4, చిన్నగొట్టిగల్లు 23.4, నారాయణవనం 38.8, పుత్తూరు 24.2, పూతలపట్టు 21, తవణంపల్లె 24, పుంగనూరు 48, ఐరాల 38, పలమనేరు 25.4, పెద్దపంజాణి 35, తవణంపల్లె 24మీ.మీ వర్షపాతం నమోదైంది.

Pages