S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తగ్గిన కార్ల అమ్మకాలు

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో గత నెల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మే నెలలో దేశ వ్యాప్తంగా 1,60,371 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో ఈ అమ్మకాలు 1,58,996 యూనిట్లకు తగ్గాయి. భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) గరువారం విడుదల చేసిన తజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల మందగమనం కొనసాగుతుండటం, సెడాన్ల కంటే ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యుటిలిటీ వాహనాల (యువిల) వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ‘సియామ్’ స్పష్టం చేసింది.

చర్మ సమస్యలకు ఆయుర్వేదంతో చెక్

హైదరాబాద్, జూన్ 9: చర్మ, శిరోజాల సమస్యల నివారణకు ఆయుర్వేద శాస్తప్రరమైన ఔషధులను తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు బయోటీక్ సంస్ధ ఒక ప్రకటనలో వెల్లడించింది. డిస్నీ ఇండియా సంస్ధ భాగస్వామ్యంతో ఈ మందులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆ సంస్ధ ఎండి వినిత్ జైన్ తెలిపారు. తమ సంస్ధలో అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు వివిధ వ్యాధులపై పరిశోధనలు చేపట్టారన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన చర్మవ్యాధి నిపుణుల పరిశోధనలు, సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బేబీ కిడ్స్‌కు సంబంధించి సమస్యల నివారణకు మందులు తయారుచేసినట్లు చెప్పారు.

బెంగళూరులో గ్లోబల్ డిజైన్ సెంటర్

హైదరాబాద్, జూన్ 9: ఇంజనీరింగ్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న సియాంట్ సంస్ధ బెంగళూరులో గ్లోబల్ డిజైన్ సెంటర్‌ను ప్రారంభించింది. వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్ధాయి సలహాలు ఇచ్చేందుకు అవసరమైన టెక్నాలజీ తమ వద్ద ఉన్నట్లు ఆ సంస్ధ ఎండి బి కృష్ణ తెలిపారు. సివిల్, స్ట్రక్చరల్, భవన సమాచారం మోడలింగ్‌ల సమాచారంపై ఆధునిక సొల్యూషన్స్ సేకరించామన్నారు. ఇందులో వంద మంది ఇంజనీర్లును నియమించనున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి పూర్తి స్ధాయిలో ఈ సెంటర్ పనిచేస్తుందన్నారు.

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చేతులు కలపండి

హౌరా, జూన్ 9: రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమతో చేతులు కలపాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్లను అభివృద్ధి చేసి మరింత ఆధునీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేలతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గురువారం హౌరా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సురేష్ ప్రభు అన్నారు. మెట్రో రైల్వేతో పాటు తూర్పు, ఈశాన్య రైల్వేలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ఈసందర్భంగా ప్రారంభించారు.

పదమూడు టెస్టులు.. ఆరు కొత్త కేంద్రాలు

ముంబయి, జూన్ 9: నాలుగు దేశాలతో జరిగే 13 టెస్టు మ్యాచ్‌లకు ఆరు కొత్త కేంద్రాలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఖరారు చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం టెస్టు హోదాను సంతరించుకోనున్నాయి. గురువారం ఇక్కడి బోర్డు కార్యాలయంలో జరిగిన టూర్ ప్రోగామ్స్, ఫిక్స్‌చర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మన దేశంలో టెస్టు సిరీస్‌లు ఆడతాయి. మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లను బిసిసిఐ ధ్రువీకరించింది.

నన్ను అవమానించారు

తిరువనంతపురం, జూన్ 9: కేరళ క్రీడా శాఖ మంత్రి జయరాజన్ తనను కించ పరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఒలింపియన్ అంజూ బి జార్జి ఆరోపించింది. కేరళ క్రీడా మండలి (కెఎస్‌సి)కి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తాను అదే హోదాలో వివిధ అంశాలపై చర్చించడానికి జయరాజన్‌ను కలిశానని, ఆ సందర్భంలో ఆయన తనను యుడిఎఫ్ ఏజెంటుగానూ, అక్రమాలకు పాల్పడే వ్యక్తిగానూ అభివర్ణించి కించపరిచారని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. నిజనాకి తాను ఏ పార్టీకి చెందిన దానిని కానని తెలిపింది. గత యుడిఎఫ్ ప్రభుత్వం తనను కెఎస్‌సి అధ్యక్షురాలిగా నియమించిందని, తాను తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నానని తెలిపింది.

ఫ్రాన్స్, రుమేనియా తొలిపోరు

పారిస్, జూన్ 9: మినీ సాకర్ వరల్డ్ కప్‌గా పిలిచే యూరోపియన్ చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. యూరో ‘2016’లో జరిగే తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్, రుమేనియా జట్లు ఢీ కొంటాయి. మొట్టమొదటిసారి ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొంటున్నాయి. 1998లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వగా, ఆ జట్టును దిడియర్ డెస్‌చాంప్స్ విజయపథంలో నడిపించాడు. అతనే ఇప్పుడు ఫ్రాన్స్‌కు జాతీయ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. డెస్‌చాంప్స్ సామర్థ్యంపై అపారమైన నమ్మకం ఉన్న అభిమానులు ఈసారి యూరో కప్ తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా, శ్రీకాంత్

సిడ్నీ, జూన్ 9: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న హైదరాబాదీ సైనా 21-12, 21-14 తేడాతో మలేసియా క్రీడాకారిణి జిన్ వెయ్ గోను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో స్థానం కోసం ఆమె థాయిలాండ్‌కు చెందిన రెండోసీడ్ రచానొక్ ఇంతనాన్‌ను ఢీ కొంటుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-19, 21-12 ఆధిక్యంతో సోనీ ద్వి కున్కొరోపై గెలిచి, సెమీస్‌లో వాంగ్ హీ హియోతో పోరును ఖరారు చేసుకున్నాడు.

పీలే వరల్డ్ కప్ ట్రోఫీకి రూ. 3.8 కోట్లు!

లండన్, జూన్ 9: బ్రెజిల్‌కు చెందిన ‘లెజెండరీ సాకర్ ఐకాన్’ పీలే 1970లో సాధించిన వరల్డ్ కప్ ట్రోఫీకి ఇక్కడ జరిగిన వేలంలో 5,70,000 డాలర్లు (సుమారు 3.8 కోట్ల రూపాయలు) లభించాయి. 1970 మెక్సికో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ విజయభేరి మోగించింది. ఆ జట్టులో సభ్యుడైన పీలే మిగతా ఆటగాళ్లతోపాటు వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని అందుకున్నాడు. లాస్ ఏంజిలిస్ ఆక్షన్ హౌస్ పేరుమీద లండన్‌లో నిర్వహించిన వేలంలో 75 ఏళ్ల పీలే 1958, 1962, 1970 సంవత్సరాల్లో బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా తాను సాధించిన మూడు వరల్డ్ కప్ ట్రోఫీలను అమ్మకానికి ఉంచాడు.

కోపా అమెరికా ఫుట్‌బాల్

లాస్ ఏంజిలిస్, జూన్ 9: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా హైతీతో జరిగిన మ్యాచ్‌ని బ్రెజిల్ 7-1 తేడాతో గెల్చుకుంది. ఫిలిప్ కౌంటిన్హో హ్యాట్రిక్‌తో రాణించి బ్రెజిల్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ 14వ నిమిషంలో మొదటి గోల్ చేసిన కౌంటిన్హో 29వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. ఇంజురీ టైమ్‌లో మూడో గోల్‌ను నమోదు చేశాడు. రెనాటో ఆగస్టో 35, 86 నిమిషాల్లో గోల్స్ సాధించగా, బ్రెజిల్‌కు మిగతా రెండు గోల్స్ గాబ్రియెల్ (59వ నిమిషం), లూకాస్ లిమా (67వ నిమిషం) ద్వారా లభించాయి. హైతీ తరఫున మార్సెలిన్ 70వ నిమిషంలో గోల్ చేశాడు.

Pages