S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఇంటికీ వంట గ్యాస్ కనెక్షన్

విజయవాడ, జూన్ 8: రెండేళ్ల తమ పరిపాలనలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి ఆయన 4,800 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రేసులో సంధూ, ప్రసాద్

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం తాత్కాలిక కోచ్‌గా సంజయ్ బంగార్ వ్యవహరిస్తుండగా, హేమాహేమీలు ఒక్కొక్కరే బరిలోకి దిగుతున్నారు. భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్లు వెంటేశ్ ప్రసాద్, బల్వీందర్ సింగ్ సంధూ కూడా రేసులోకి దూకారు. భారత క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ పేరు ఆరంభంలో వినిపించినప్పటికీ, అతను ఇంకా దరఖాస్తు చేసుకోలేదు.

సమష్టి కృషితో విజయం

ప్రోవిడెన్స్ (గుయానా), జూన్ 8: ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను ఢీకొన్న దక్షిణాఫ్రికా సమష్టి కృషి ఫలితంగా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తరఫున ఆరోన్ ఫించ్ (72) ఒక్కడే ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. అతనితోపాటు టెయిలెండర్లు నాథన్ లియాన్ (30), జొష్ హాజెల్‌వుడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కు పరిమితమై నిష్క్రమించారు. ఫలితంగా ఆస్ట్రేలియా 34.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది.

వికాల్ట్ ‘రికార్డు’ పరుగు

మాంట్రెయుల్ (ఫ్రాన్స్), జూన్ 8: ఫ్రెంచ్ స్ప్రింటర్ జిమీ వికాల్ట్ 100 మీటర్ల పరుగును రికార్డు సమయంలో పూర్తి చేశాడు. ఇక్కడ జరిగిన మాంట్రెయిల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొన్న అతను లక్ష్యాన్ని 9.86 సెకన్లలో పూర్తి చేసి, ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన టైమింగ్స్‌ను నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ స్ప్రింట్‌లో ఇదే రికార్డు కావడం విశేషం. ఇటీవల రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 100 మీటర్ల దూరాన్ని 9.99 సెకన్లలో చేరిన అతను రియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఇప్పుడు ఈ సీజన్‌లోనే మెరుగైన పరుగుతో ప్రత్యర్థులకు పరోక్షంగా సవాళ్లు విసిరాడు.

టార్గెట్ వైట్‌వాష్!

లండన్, జూన్ 8: చారిత్రక లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై వైట్‌వాష్ సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే సిరీస్‌ను గెల్చుకున్న కారణంగా చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడారని, ఫలితంగా పరాజయాన్ని చవిచూశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడ్డాయి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇంగ్లాండ్ జాగ్రత్త పడుతున్నది.

ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ రెండో రౌండ్‌కు సైనా

సిడ్నీ, జనవరి 8: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరింది. అయితే, మరో హైదరాబాదీ పివి సింధు మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ శుభారంభం చేయగా, గురుసాయిదత్ పోరు మొదటి రౌండ్‌కే పరిమితమైంది. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను అందుకున్న సైనా మొదటి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి జోయ్ లయ్‌పై 21-10, 21-14 తేడాతో సునాయాసంగా గెలిచింది. ఆమె తర్వాతి రౌండ్‌లో మలేసియాకు చెందిన జిన్ వెయ్ గోను ఢీ కొంటుంది.

జింబాబ్వే టూర్‌కు ధోనీ బృందం పయనం

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో బుధవారం జింబాబ్వే టూర్‌కు బయలుదేరి వెళ్లింది. 2017లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌పై దృష్టి కేంద్రీకరించిన ధోనీ అప్పటి వరకూ వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా కొనసాగాలని ఆశిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న అతనికి అవకాశాలు మెరుగుపడాలంటే జింబాబ్వే టూర్‌లో, భారీ తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలి. ఈ టూర్‌లో భాగంగా భారత్ ఈనెల 11న, 13, 15 తేదీల్లో మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఆతర్వాత 18, 20, 22 తేదీల్లో టి-20 ఇంటర్నేషనల్స్‌లో జింబాబ్వేను ఢీ కొంటుంది.

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు

వాషింగ్టన్, జూన్ 8: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భారత ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌లో పెద్ద ఎత్తున వాటాను అందుకోవాలని చూస్తోంది అమెజాన్. ఇప్పటికే 2014లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ ప్రకటించింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మరో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని అమెజాన్ వ్యవస్థాకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇక్కడ మంగళవారం జరిగిన భారత్-అమెరికా వ్యాపార మండలి (యుఎస్‌ఐబిసి) రౌండ్ టేబుల్ సమావేశంలో బెజోస్ తెలిపారు.

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 10.99 పాయింట్లు పెరిగి 27,020.66 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.60 పాయింట్లు అందుకుని 8,273.05 వద్ద నిలిచింది. ఐటి, టెక్నాలజీ, హెల్త్‌కేర్ మినహా మిగతా విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు, ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ లాభపడగా, హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.

సిఇఒ పదవికి ఒసాము సుజుకి దూరం

టోక్యో, జూన్ 8: జపాన్ చిన్న కార్ల తయారీ దిగ్గజం.. సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో తప్పుడు మైలేజీ టెస్టింగ్ తీవ్ర ప్రకంపనలకే దారి తీసింది. ఈ వివాదంతో సిఇఒ పదవిని ఒసాము సుజుకి వదులుకున్నారు. ‘తప్పుడు మైలేజీ టెస్టింగ్ పద్ధతుల వివాదం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.’ అని బుధవారం ఇక్కడ ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. ఈ వివాదం తదనంతర పరిణామాల మధ్య సంస్థ డైరెక్టర్ల వేతనాల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్న సుజుకి మోటార్ కార్పొరేషన్.. డైరెక్టర్ల మార్పు కూడా జరుగుతోందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సంస్థ చైర్మన్, సిఇఒగా కొనసాగుతున్న ఒసాము సుజుకి తన సిఇఒ పదవి నుంచి తప్పుకుంటారని వెల్లడించింది.

Pages