S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పోలవరం’ పరిశీలించిన సిడబ్ల్యుసి డైరెక్టర్లు

పోలవరం, జూన్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెరుగుతున్న అంచనాలు, సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు వచ్చినట్టు సిడబ్ల్యుసి డైరెక్టర్లు వీరేంద్రశర్మ, ప్రమోద్ నారాయణలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వచ్చిన డైరెక్టర్లు కాంట్రాక్టు ఏజెన్సీ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, కుడి కాలువ, ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు విషయాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధి సత్యంబాబు వివరించారు.

భీమవరంలో భారీ వర్షం

భీమవరం, జూన్ 7: భీమవరం పట్టణంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సుమారు అయిదు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పట్టణమంతా జలమయమైంది. చిన్న చిన్న చినుకులతో ప్రారంభమై ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పల్లపుప్రాంతాలతో పాటు రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై సుమారు నాలుగు అడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపునీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. ప్రధాన రహదారులపైనే ట్యాంకర్ టైర్లను ఆనుకుని వర్షపునీరు ప్రవహించింది.

ఆకివీడులో అప్రత్తమైన పోలీసులు

ఆకివీడు, జూన్ 7: తుని సంఘటనలో జరిగిన విధ్వంసాల నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల పై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ముద్రగడ పద్మనాభంకు పోలీసుల మధ్య మరోసారి వివాదం తలెత్తడంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన గ్రామాలు ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచారు. గతంలో వంగవీటి రంగా హత్య అనంతరం జరిగిన పరిణామాలను ఆకివీడులో విధ్వంసకాండ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కుప్పనపూడి, ఆకివీడు, మాదివాడ, దుంపగడప, పెదకాపవరం, చినకాపవరం ప్రాంతాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారిపై పోలీసులు దృష్టిసారించారు.

బ్యాంకు మేనేజర్‌పై వేధింపుల కేసు

మొగల్తూరు, జూన్ 7: బ్యాంకు రుణం మంజూరు చేసినందుకు తన కోరిక తీర్చమని వేధించిన స్టేట్ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు మొగల్తూరు ఎస్సై డిజె రత్నం మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మొగల్తూరుకు చెందిన ఒక మహిళ మొగల్తూరు స్టేట్ బ్యాంకులో కాపురుణం కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయలు మంజూరైందన్నారు. రుణం మంజూరు చేసినందుకు ఆమెను బ్యాంకు మేనేజర్ కెవియస్‌యన్ ప్రసాద్ తన కోరిక తీర్చమని వేధింపులకు గురిచేశారన్నారు. వేధింపులు భరించలేని ఆమె బ్యాంకు మేనేజర్ సంభాషణను సెల్‌ఫోనులో రికార్డు చేసిందన్నారు.

నేడు ఏలూరులో మహా సంకల్పం

ఏలూరు, జూన్ 7 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహా సంకల్పం కార్యక్రమం మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ప్రారంభమవుతుందని ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్ తెలిపారు. సాయంత్రం 5.05 గంటల నుండి 6 గంటల వరకూ ముఖ్యమంత్రి మహా సంకల్పం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారానికి రెండు ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నిబంధనలు పాటించాల్సిందే

ఏలూరు, జూన్ 7 : జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కచ్చితంగా నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో పాఠశాలలను మూసివేయడంతోపాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డిఇఓ డి మధుసూధనరావు తెలిపారు. స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1235 గుర్తింపు పొందిన ప్రవేటు పాఠశాలలు వున్నాయన్నారు. వీటిపై తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా అధికంగా ఫీజులు వసూలు చేయడం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు.

దళితుల అభ్యున్నతే ప్రధాని ధ్యేయం

తాడేపల్లిగూడెం, జూన్ 7: దళితులు, బడుగు వర్గాలు కలిసి సమీకృత అభివృద్దిని సాధించాలని బిజెపి రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో మంగళవారం దళిత యువ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దళిత మోర్ఛ జిల్లా అధ్యక్షులు బూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘురాం మాట్లాడుతూ బడుగుల అభ్యున్నతే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రగతి సాధించాలన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి మోదీ బాటలు వేస్తున్నారన్నారు.

మరో ఎటిఎం మోసం

పోలవరం, జూన్ 7: మీ ఎటిఎం కార్డు రెన్యువల్ చేయాలి, కార్డు నెంబరు చెప్పమని కాల్ రాగా నమ్మి నెంబరు చెప్పడంతో రూ.18వేలు మరో ఖాతాకు మళ్లించిన సంఘటన మంగళవారం పోలవరం మండలంలో చోటుచేసుకుంది. నూతనగూడెంనకు చెందిన జల్లేపల్లి సుబ్బలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం ఫోన్ రావడంతో ఆమె భర్త రామచంద్రరావు మాట్లాడగా ‘హైదరాబాద్ ఎస్‌బిఐ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఎటిఎం కార్డు రెన్యువల్ చేయాలి, నెంబరు చెప్పమని’ అవతలి వ్యక్తి అడిగాడు. దీంతో సీక్రెట్ నెంబరు కదా ఎలా చెప్పను అని రామచంద్ర అనుమానం వ్యక్తంచేయడంతో..

సిబ్బంది పిల్లల ప్రతిభకు ఎస్పీ అభినందన

ఆకివీడు, జూన్ 7: కిందిస్థాయి ఉద్యోగుల బాగోగులు చూసే పోలీసు అధికారిగా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పేరుపొందారు. ఇప్పటివరకు జరగని రీతిలో పోలీస్‌శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లల ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేశారు. ఇటీవల జరిగిన పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను ఆయన అభినందించారు. జిల్లాలోని సుమారు 80 మంది పదవతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించారు. ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డివి రమణ కుమార్తె ఉష ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో 9.5 గ్రేడు సాధించింది.

విప్లవ ఉద్యమనేత రాఘవులు కన్నుమూత

ఉండి, జూన్ 7: విప్లవ కమ్యూనిస్టు ఉద్యమ నేత జివి రాఘవులు(83) మహాదేవపట్నం శివారు ఉప్పరగుడెంలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటివలే ఆయన నాయకత్వంలో ఏర్పాటుచేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాశక్తి పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన నాలుగు నెలలోనే ఆయన మృతి చెందటం విప్లవోద్యమానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు. సుమారు 60 సంవత్సరాలు అవిశ్రాంతంగా విప్లవోద్యమంలో పనిచేసిన రాఘవులు మృతివార్త తెలిసిన వెంటనే అనేక జిల్లాల నుండి విప్లవ సంఘాల నాయకులు, పౌరహక్కుల సంఘం నాయకులు, సిపిఐ నాయకులు ఉప్పరగుడెం వచ్చిన ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Pages