S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఇఎఫ్‌డిఎస్ విధానంలో ఎరువుల పంపిణీ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: దేశంలోనే ప్రప్రథమంగా ఎరువుల వినియోగ క్రమబద్ధీకరణ విధానంలో పైలెట్‌గా ఎంపికైన కృష్ణా జిల్లాలో జూన్ 2వ వారంలో జిల్లాలోని 1100 ఎరువుల దుకాణాల్లో అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. మంగళవారం ఆధార్, ఆధారిత, ఎలక్ట్రానిక్ మేనేజ్‌మెంట్ విధానంలో ఎరువుల పంపిణీపై జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, వ్యవసాయశాఖ డిడి ఎన్.బాలూనాయక్, ఎన్‌ఐసి అధికారి శర్మ, డిడిఓ అనంత్, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని ఆయా ప్రాంతాల, పంటల ఆధారంగా సక్రమంగా వాడాల్సిన ఆవశ్యకత వుందన్నారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములుకండి

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: రాష్ట్రంలో సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. నగరంలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రగతి సన్నాహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సమస్యల సుడిలో రాష్ట్రం

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: సమస్యల సుడిగుండంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాంఘిక సంక్షేమం, సాధికారిత, నైపుణ్యాభివృద్ధి చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్దామని, రాష్ట్భ్రావృద్ధికి అందరూ భుజం భుజం కలిపి నడవాలన్నారు. అంతర్జాతీయ రాజధాని నిర్మాణమే తన లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరతామని, కరవుకు చెక్ పెడతామని పేర్కొన్నారు.

కలసాకరవౌతున్న వేళ..

బెంజిసర్కిల్, జూన్ 7: అడ్టంకులు... అంతరాలు... అభ్యంతరాలన్నిటినీ అధిగమించి చివరి ప్రతిపాదిత ఫైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది. దశాబ్దకాలంగా నగర వాసులు కలలు కంటున్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణ కల సాకారం కానుంది. గతంలో ప్రతిపాదించిన 618 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థానికుల విన్నపాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అదనంగా మరో 820 మీటర్లు ప్రతిపాదిత నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అదనంగా మరో 120 కోట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది.

విద్యాభివృద్ధితోనే సమగ్రాభివృద్ధి

బెంజిసర్కిల్, జూన్ 7: దేశాభివృద్ధి విద్యాభివృద్ధితోనే ఎక్కువ ముడిపడి ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు విద్యార్థులు కీలక భూమిక పోషించాలన్నారు. గత ప్రభుత్వాలు విస్మరించిన విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేసి సంస్కరణలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని కెబిఎన్ కళాశాలలో మంగళవారం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు.

ఎమ్మెల్యే వత్తాసుతోనే శారదానది నీరు

అనకాపల్లి, జూన్ 7: శారదానది నీ టిని స్టీల్‌ప్లాంట్‌కు తరలింపులో రైతుల పక్షాన ఎమ్మెల్యే పీలాగోవింద్ అడ్డుకోవాల్సిందిపోయి ప్లాంట్ యాజమాన్యానికి వత్తాసు పలకడం తీరని ద్రోహమని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అ మర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి తరలింపును తక్షణమే నిలుపుదల చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చే చర్యల ను ఎమ్మెల్యే చేపట్టకపోతే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. శారదానది నుండి ఎల్లయ్య గ్రోయిన్‌కు వెళ్లాల్సిన నీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించే చ ర్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇటీవ ల అడ్డగించిన విషయం విధితమే.

సర్పంచ్ చెక్ పవర్ రద్దు

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూన్ 7: గ్రామాలు అభివృద్ధి విషయంలో సర్పంచ్‌లు నిర్లక్ష్యం వహించినట్లయితే ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి చెక్‌పవర్ రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే పీ లా గోవింద హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మంగళవారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఎ మ్మెల్యే పీలా పైవిధంగా అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అ తీతంగా అన్ని గ్రామాలు అభివృద్ధి చే యడానికి తన వంతుగా కృషి చేస్తున్నానన్నారు. సుమారు నాలుగు గ్రామాల్లో వైకాపా సర్పంచ్‌లు నిర్లక్ష్యం వలన ఆ గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.

భారీ వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయం

పాడేరు(టౌన్), జూన్ 7: మండలం లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ అధికంగా ఉండి మధ్యాహ్నం రెండు గంటలకు భారీ వ ర్షం పడడంతో వాతావరణం ఒక్కసారి గా చల్లబడింది. మైదాన ప్రాంతాలకు దీ టుగా ఏజెన్సీలో కూడా గత కొన్ని రో జుల నుంచి ఎండలు అధికంగా ఉండడంతో అల్లాడిపోయిన ప్రజలకు గత రె ండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కొ ంత ఊరట కలిగించాయి. వరుసగా రెం డు రోజుల నుంచి వర్షం కురుస్తుండడం తో రోడ్లు, పల్లపుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువల్లో రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తాచెదారాలు వర్షం నీటి దాటికి కొట్టుకుపోయాయి. వాగులు, బావులు, ఊటగెడ్డల్లో నీరు అధికమొత్తంలో చేరింది.

26 నుండి సిటు మహాసభలు

విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా సిఐటీయు మహాసభల విజయవాడలో నిర్వహిస్తామని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. యల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులపాటు ఇవి జరుగుతాయన్నారు. రాష్ట్రంలో గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు రంగం, అసంఘటిత రంగం, చిన్న తరహా పరిశ్రమలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర రంగాలకు చెందిన కార్మిక నాయకులు పాల్గొంటారన్నారు. మహాసభల తొలి రోజున లక్షమంద కార్మికులతో విజయవాడలో భారీ ర్యాలీ ఉంటుందన్నారు.

గ్రామాలకు రక్ష దేవతలే..

సింహాచలం,జూన్ 7: భారతీయ సనాతన సంప్రదాయం లో గ్రామ దేవతలకు విశేష స్థానం ఉందని, గ్రా మాలకు దేవతలే (అమ్మవార్లే) రక్షగా ఉంటూ వస్తున్నారని విశాఖ శారదా పీ ఠాధిపతి శ్రీ స్వరూప నం దేంద్ర సరస్వతీమహా స్వా మి అన్నారు. మంగళవా ర ం ఆయన అడివివరం గ్రా మ దేవత శ్రీ పైడితల్లమ్మవారి పండగ సందర్భంగా సదకంపట్టు వద్ద ఘటాల ఊరేగింపును స్వామిజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. హిందువుల ఆ చారాలు ఎంతో గొప్పవని, గ్రామ దేవతలను అన్ని కులాలు ఆరాధించి ఆశీర్వాదం పొందుతారని స్వామిజీ అన్నారు. పైడితల్లమ్మవారి పండగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ప్రజలకు స్వామిజీ అభినందనలు తెలియజేశారు.

Pages