S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీచర్ల గైర్హాజరుకు చెక్

వరంగల్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపట్టబోతోంది. అందులో భాగంగా ముందుగా టీచర్లపై కొరడా ఝుళిపించనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ వృత్తితో పాటు అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, నెలవారి చిట్టీలతో పాటు ఇతర వృత్తుల్లో కూడా కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు రాకపోవడమే కాకుండా మరికొన్ని పాఠశాలల్లో వంతుల వారీ డ్యూటీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అన్ని పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుండే ఈ విధానం అమలు చేయబోతున్నారు.

సాదాబైనామాపై అవగాహన కల్పించండి

జనగామ టౌన్, జూన్ 7: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమం ద్వారా అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారిణి శోభారాణి కోరారు. సాదాబైనామా కార్యక్రమంపై మంగళవారం జనగామలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. మీసేవల ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తులను తీసుకోవాలన్నారు. 2జూన్ 2014కు ముందు ఇతర రైతుల నుంచి వ్యవసాయ భూములను సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుందని అన్నారు.

మహిళా అడ్వకేట్‌పై సీనియర్ అడ్వకేట్ దాడి

వరంగల్, జూన్ 7: జూనియర్ మహిళా అడ్వకేట్‌పై సీనియర్ అడ్వకేట్ తీవ్రంగా దాడి చేసిన సంఘటన మంగళవారం కాజీపేటలో చోటు చేసుకుంది. కాజీపేట ఎస్సై భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దార్థ నగర్‌లో ఉంటున్న దయాన్ శ్రీనివాస్ అనే అడ్వకేట్ వద్ద 30 సంవత్సరాల ఒక మహిళా జూనియర్ అడ్వకేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ మహిళా అడ్వకేట్ తనకు తెలిసిన అతని బైక్‌పై వెళ్తుండగా అడ్వకేట్ దయాన్ శ్రీనివాస్ చూశాడు. ఇది జీర్ణించుకోలేక కాజీపేట విష్ణుపురిలో ఉంటున్న జూనియర్ మహిళా అడ్వకేట్ వద్దకు వెళ్లి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో విపరీతంగా కొట్టాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చేర్యాల, జూన్ 7: అప్పుల బాధతో నరకుల ప్రవీణ్ (35) అనే రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కడవేర్గు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం... వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవీణ్ పంటలు పండక అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కోదండరాం విమర్శల వెనుక కుట్ర

వరంగల్, జూన్ 7: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న తరుణంలో ప్రభుత్వంపై పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసిన విమర్శల వెనుకు కుట్ర దాగివుందని టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొదటి సారిగా మంగళవారం వరంగల్ నగరానికి చేరుకున్నారు. ముందుగా ఆయనకు నాయకులు, కార్యకర్తలు యూనివర్సిటీ రోడ్ వద్ద ఘనస్వాగతం పలికారు.

ప్రజారక్షణే ధ్యేయం కావాలి

బాలసముద్రం, జూన్ 7: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజారక్షణే ధ్యేయంగా పని చేయాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని నార్త్‌జోన్ ఐజి నాగిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో వరంగల్ రేంజ్ పరిధి సమీక్ష సమావేశంలో డిఐజి ప్రభాకర్‌రావు, ఖమ్మం ఎస్పీ షానవాజ్‌ఖాసీం, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి నాగిరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరంగా ఎన్ని ఒత్తుడులు వచ్చినా రాజీపడవద్దని, బాధితులకు న్యాయం చేసేలా పోలీసుల అభిమతం ఉండాలన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు కోదండరాం

వరంగల్, జూన్ 7: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై టిఆర్‌ఎస్ మంత్రులు చేసిన విమర్శలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో గల్లీ గల్లీకి తిరిగి అందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాంపై మంత్రులు చేసిన విమర్శలను ఆయన ఘాటుగా తిప్పికొట్టారు.

జిల్లాలో వర్షాలు..

కరీంనగర్, జూన్ 7: జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మూడు మండలాలు మినహా జిల్లా అంతటా వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోగా, ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు సింగరేణి బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని ఒసిపి-1,2,3,4 గనుల్లోకి వరద నీరు చేరి కొద్దిసేపు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓసిపి-2,3,4 గనుల్లో కలిపి మొత్తం 23వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఏర్పడింది. జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యమ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి

కరీంనగర్, జూన్ 7: ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లే క్రీడల్లో అంకితాభావం, సమిష్టి కృషితో క్రీడాకారులు రాణించి ప్రపంచ స్థాయి పోటీల్లో తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో 61వ అఖిల భారత పాఠశాలల క్రీడా సమాఖ్య బాల బాలికల ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ అన్ని రంగాలతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రాన్ని హరితవనంగా మారుస్తాం

కరీంనగర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రాన్ని హరితవనంగా మారుస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హరితహారంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3.5 కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఆ గ్రామంలో ఎవరెవరికి ఎన్ని మొక్కలను ఇస్తున్నారో గ్రామ పంచాయతీ బోర్డుపై రాయాలని తెలిపారు.

Pages