S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌యుబి వలన నష్టం జరుగకుండా చూస్తా

కొత్తవలస, జూన్ 7: కొత్తవలస జంక్షన్ వద్ద ఉన్న రైల్వే గేటు సమస్య నుండి బయట పడేందుకు రెండు రోజుల క్రితం రైల్వే అధికారులు ఆర్‌యుబి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కొత్తవలస-అరకు రోడ్డును ఆనుకుని ఉన్న రైల్వే షాపుల వద్ద ఉన్న గెడ్డ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం సుమారు 40 షాపులకు చెందిన వ్యాపారులు ఆర్‌యుబి వలన ఉపాధి కోల్పోతామని, కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని చెబుతూ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆమె స్పందిస్తూ ఆర్‌యుబి ప్రతిపాదనలు తమకు తెలియవని, స్థలపరిశీలన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పారు.

నగర పంచాయతీని రద్దు చేయాలి

నెల్లిమర్ల, జూన్ 7: నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి జరజాపుపేట, నెల్లిమర్ల గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేయాలని జడ్పీటిసి గదల సన్యాసినాయుడు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ సాధనకోసం జరజాపుపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరహారదీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరజాపుపేట గ్రామస్థులు న్యాయమైన సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రిలేదీక్షలు చేపట్టి 20 రోజులపైబడినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. నగర పంచాయితీ రద్దుకోసం చేసిన పోరాటానికి వైసిపి నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు.

రైతు బజార్ వినియోగమెప్పుడో?

శృంగవరపుకోట, జూన్ 7: పట్టణవాసులు, మండల పరిసర ప్రాంతాల రైతులు ఎప్పుడా అని ఎదురు చూసినా రైతు బజారు ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి ప్రారంభించి 20రోజులపైగా కావస్తున్నా వౌలిక సదుపాయాలు లేక వినియోగంలోకి రాలేదు. ప్రజల సౌకర్యార్థం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ పక్కన మార్కెటింగ్ నిధులు 12 లక్షల రూపాయలతో షెడ్లు మాత్రం నిర్మించారు. దీనికి చుట్టూ ప్రహారీ, లోపల రోడ్లు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. స్టాల్స్‌కు ఎటువైపు గోడలు లేవు అంతేకాకుండా ఎస్టేట్ ఆఫీసర్ గది, స్టోర్ రూమ్, నైట్‌వాచ్‌మెన్ గదులు లేవు.

జాతీయ రహదారి విస్తరణకు రూ. 27 కోట్లు మంజూరు

విజయనగరం, జూన్ 7: జిల్లాలో ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. జాతీయ రహదారులపై పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను ముఖ్యమైన ప్రాంతాలలో విస్తరించేందుకు కేంద్రం నుండి పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శ్రద్ధ తీసుకుని కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పించి అనుమతులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా ప్రయాణికులు, వాహనాల త్వరతగతిన గమ్యం చేరుకునేలా విజయనగరం పట్టణం ప్రదీప్‌నగర్ కూడలి నుండి గొట్లాం వరకు 26వ నెంబరు జాతీయ రహదారిని నాలుగు లై న్లుగా విస్తరించేందుకు 17 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నిధులు మంజూరు చేసారు.

చురుగ్గా పైలట్ ప్రాజెక్టు పనులు

దత్తిరాజేరు, జూన్ 7: మండలంలోని 35 గ్రామ పంచాయితీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు పైలట్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే మండలంలోని ఎస్. చింతలవలస, షికారుగంజి, పాచలవలస, రామభద్రపురం, విజయరాంపురం, లింగరాజపురం, చెరుకుపల్లి, లింగరాజపురం, జగన్నాథపురం, కొరపుకొత్తవలస, పాపయ్య వలస తదితర గ్రామాలకు నీరందిస్తున్నట్లు పైలట్ ప్రాజక్టు జె. ఇ. సునీల్ మంగళవారం తెలిపారు. 36కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న ఈ పనులు, జూలై నెలాఖరునాటికి పూర్తిచేస్తామని తెలిపారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

గరివిడి, జూన్ 7 : పేదల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మంగళవారం చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభజన వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అధ్వాన్నంగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా చేపడుతున్నారని చెప్పారు.

సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం (్ఫర్టు), జూన్ 7: ఎస్సీ నిరుద్యోగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. నవ నిర్మాణ వారోత్సవాలలో భాగంగా ఎస్సీ యువకులకు సబ్సిడీ రుణాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దీనిలోభాగంగా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలను అందిస్తుందని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల రుణమొత్తంలో ఎస్సీ కార్పోరేషన్ లక్ష రూపాయల సబ్సిడీని అందిస్తుందని అన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు వాహనాలపై దాడులు

విజయనగరం (్ఫర్టు), జూన్ 7: మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు వాహనాలపై దాడులు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలపై కూడా దాడులు చేస్తున్నామని చెప్పారు. దీనికి మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బృందం ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలపై దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

తుని ఘటనకు జగన్ మనుషులే కారణం

పాలకొల్లు, జూన్ 7: ఉభయగోదావరి జిల్లాలో ఉన్న కాపులు నేర ప్రవృత్తి కలిగిన వారు కాదని, కడప నుంచి జగన్ పంపిన మనుషులే ఈ తునిలో రైలు దగ్ధం చేశారని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ నేరం రుజువు కావటంతో ఆత్మరక్షణ కోసం వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆరవ రోజు నవ నిర్మాణ దీక్షా శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేర ప్రవృత్తి, మోసం, ప్రభుత్వ ఆస్తులు కాజేయటం వంటి పద్ధతులకు అలవాటు పడిన జగన్‌కు సెంట్రల్ జైలు యోగం తప్పదని ఆమె హెచ్చరించారు.

రెండేళ్లలో ఏం చేశారు ?

భీమవరం, జూన్ 7: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాలు చేపట్టి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏంచేశారని సిపిఎం నేతలు ప్రశ్నించారు. భీమవరంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి బి బలరాం అధ్యక్షత వహించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఎంఎ గఫూర్ తదితరులు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షలు ఏవరి కోసం చేస్తున్నారని రాఘవులు ప్రశ్నించారు. విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం చేకూరలేదన్నారు.

Pages