S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔత్సాహిక క్రీడాకారులకు కేంద్రం చేయూత

హైదరాబాద్, బేగంపేట, జూన్ 7: ఔత్సాహిక క్రీడాకారులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి కల్గిన యువతను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని నెహ్రు యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావుతెలిపారు. హిమాలయ పర్వతాలలో 5226 మీటర్ల ఎత్తు కల్గిన వౌంట్‌నార్బు పర్వతాన్ని అధిరోహించి ఈ నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను పర్వతంపై జాతీయ జెండా, తెలంగాణ పటం, తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించిన ఏడుగురు పర్వతారోహకులను ఆయన మంగళవారం సికిందరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి

హైదరాబాద్, జూన్ 7: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్పించి నమోదు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈనెల 8 నుంచి 16 వరకు నిర్వహించే జయశంకర్ బడిబాట నిర్వహణపై ఎంఇఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

10న బిజెపి బహిరంగ సభ

హైదరాబాద్, జూన్ 7: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10న సూర్యాపేటలో భారతీయ జనతాపార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు కూడా లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం బర్కత్‌పురాలోని సిటీ బిజెపి ఆఫీసులో గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బిజెపి నగర పదాధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షుల సమావేశం జరిగింది.

పోడు సాగుదారులకు పట్టాలివ్వాలి

చార్మినార్, జూన్ 7: రాష్ట్రంలో గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల వారికి పోడు సాగుదారుల భూములకు పట్టాలు ఇవ్వాలని రిటైర్డు ఐ ఎ ఎస్ ఎ.గోపాల్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన గోపాల్ రావు మాడ్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలు గడిచినా, పేద ప్రజలకు ఆర్ధికంగా స్వాతంత్రం రాలేదన్నారు.

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

సరూర్‌నగర్, జూన్ 7: బడంగ్‌పేటలో మార్చి 18న దారుణ హత్యకు గురైన నాగలక్ష్మి మృతి మిస్టరీని మీర్‌పేట పోలీసులు చేధించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎల్బీనగర్ డిసిపి మక్బుల్ ఇక్బల్ వివరాలను వెల్లడించారు. నాగలక్ష్మి తన ఇద్దరు కుమారులతో బడంగ్‌పేటలో నివాసముంటుంది. ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం తన కుమారులను నిత్యం పాఠశాలకు తీసుకువెళ్లి వచ్చేవాడు. కొన్నాళ్ల క్రితం డ్రైవింగ్ వృత్తిని వదిలి బిస్కెట్ కంపెనీలో పనికి చేరాడు. అక్కడే పని చేస్తున్న యాదమ్మతో పరిచయమయింది. ఇరువురు వివాహం చేసుకొని డిఆర్‌డిఒలో కాపురం పెట్టారు.

ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాలు సంధానకర్తలుగా వ్యవహరించాలి

రాజేంద్రనగర్, జూన్ 7: పరిశోధనా ఫలితాలను రైతులకు చేరవేయడంలో ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాలు సంధాన కర్తలుగా వ్యవహరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయం విస్తరణ కేంద్రాల రాష్ట్ర స్థాయి సాంకేతిక, వార్షిక ప్రణాళికలపై నాలుగురోజుల పాటు జరిగే సమావేశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో యంత్రీకరణ, నీటియాజమాన్యంపై ప్రత్యేక దృష్టి నింపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా కిసాన్ మేళాల నిర్వహణకు కృషి చేయాలని సూచించారు.

వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతాంగానికి అందాలి

హైదరాబాద్, జూన్ 7 : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాల్సి ఉందని, ఇందుకోసం ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు సంధానకర్తలుగా పనిచేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విస్తరణ కేంద్రాల రాష్టస్థ్రాయి సాంకేతిక, వార్షిక ప్రణాళికలపై నాలుగు రోజుల పాటు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశాలను మంగళవారం ప్రవీణ్‌రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, నీటి యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల బీమా మరో ఆరు నెలల పొడిగింపు

హైదరాబాద్, జూన్ 7:ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హెల్త్ రీయింబర్స్‌మెంట్ పథకం బాగుందని, దీనిలోని మంచి అంచశాలను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను అమలు చేయనున్నట్టు చెప్పారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్యోగుల బీమా పథకాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సచివాలయంలో మంత్రి సమీక్ష జరిపారు.

ఉద్యమా ద్రోహులా కోదండరామ్‌ని విమర్శించేది

కుషాయిగూడ, జూన్ 7: అరవై ఏళ్ళ సుదీర్ఘ తెలంగాణ పోరాటాన్ని భుజాన ఎత్తుకుని తెలంగాణ ఆకాంక్షను సకలజనుల పోరాటంగా మార్చిన జెఎసి చైర్మన్ కోదండరామ్‌ని విమర్శిస్తే మరోపోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని విద్యావంతుల వేదిక హెచ్చరించింది. ఇసిఐయల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు మాట్లాడుతూ జెఎసి ఏర్పాటు చేసింది తెలంగాణ నాయకులు అని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలిపారు. జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడితే అత్మబలిదానాల పునాదులపై ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు.

ఉద్యమంతో సంబంధంలేని మంత్రులు కోదండరామ్‌ను విమర్శించడమా

సికింద్రాబాద్, జూన్ 7: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినంత మాత్రాన తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మెన్ ప్రొ.కోదండరామ్‌పై మంత్రులు మూకుమ్మడి దాడి చేయడం అమానుషకరమని టిడిపి నగర సెక్రటరీ జనరల్ ఎంఎన్.శ్రీనివాస్, మేకల సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం నగర టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనకోసం అలుపెరుగని ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధనలో కీలకంగా పాత్ర పోషించిన కోదండరామ్‌పై కేసిఆర్ మెప్పుకోసం తెరాస మంత్రులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ,ప్రొ.జయశంకర్, కాళోజీవంటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వారిని విస్మరించి తెరాస పాలన కొనసాగిస్తుందని అన్నారు.

Pages