S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి వాళ్లదే రాజ్యం!

మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భూ ఆక్రమణలు, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్వాధీన్ భారత్ సుభాష్ సేనకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. జవహర్‌బాగ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పార్కులో తిష్టవేసిన సేన సొంతంగా ‘ఓ వ్యవస్థ’నే ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. ఇది ఎంతవరకూ వచ్చిందంటే సొంతంగా తీర్పులివ్వడం, వాటిని అమలు చేయడానికి యంత్రాంగం, ఎదురుతిరిగితే చిత్రహింసలకు గురిచేయడం జరుగుతోంది. ప్రభుత్వ భూమినుంచి ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదాడికి దిగడమే కాకుండా ఓ ఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లతోపాటు 24 మందిని చంపేశారు.

హేమకు నో ఎంట్రీ

మధుర, జూన్ 4: సొంత నియోజకవర్గం మధురలోని జవహార్‌బాగ్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన బిజెపి ఎంపీ హేమమాలినికి పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. జవహార్‌బాగ్‌లో కూంబిం గ్ ఆపరేషన్ జరుగుతున్నందున ప్రజ లు ఎవరినీ అక్కడికి వెళ్లనీయడం లేదని వారన్నారు. ‘ఎంపీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని సమస్యగా చిత్రీకరించొద్దు. పోలీసు అధికారులు, నిపుణులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందుకే ఎవర్నీ అనుమతించడం లేదు’ అని అధికారులు చెప్పారు.

కిడ్నీ రాకెట్ దర్యాప్తులో పురోగతి

న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇక్కడి అపోలో ఆసుపత్రిలో జరిగిన కిడ్నీల మార్పిడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు శనివారం ముగ్గురు కిడ్నీ గ్రహీతలను, అయిదుగురు దాతలను గుర్తించారు.

హర్యానాలో హైఅలర్ట్!

చండీగఢ్, జూన్ 4: రిజర్వేషన్లకోసం జాట్‌లు మరోసారి ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఆదివారం నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని జాట్‌లు ప్రకటించారు. దీంతో 48 కంపెనీల పారా మిలటరీ దళాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘రాష్ట్ర పోలీసులతోపాటు 4,800 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించాం. వివిధ ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశాం, అదనంగా 15 సాయుధ బలగాలు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం’ అని హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) రాంనివాస్ శనివారం ఇక్కడ వెల్లడించారు.

రూ.50 లక్షలకు పరిహారం పెంపు

లక్నో, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భూకబ్జాదారుల దాడి లో మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచింది. విధి నిర్వహణలో అమరులయిన మధుర పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) ముకుల్ ద్వివేది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఒ) సంతోశ్ కుమార్ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆ కుటుంబాలకు పింఛను మంజూరు చేస్తామని కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం ప్రకటించారు. అమరులయిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

అనంతనాగ్‌లో ఇద్దరు పోలీసుల కాల్చివేత

శ్రీనగర్, జూన్ 4: కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో శనివారం ఉదయం 11.20 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కా ల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. వారిని అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. అనంతనాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 22న ఉపఎన్నిక జరగనుంది. జనవరి 7న ముఫ్తీ మహ్మద్ సరుూద్ మరణించడంతో ఈ సీటు ఖాళీ ఏర్పడింది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.

వాతావరణ మార్పులు, రక్షణ సహకారంపై దృష్టి

వాషింగ్టన్, జూన్ 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అనేక ప్రధాన అంశాలు చర్చించాలని ఒబామా ప్రభుత్వం భావిస్తోంది. భద్రత, రక్షణ సహకారం అలాగే వాతావరణ మార్పులపై మోదీతో చర్చిస్తామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. 2015 జనవరిలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడ్డాయ. ఆర్థిక వృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలు, వాతావరణ మార్పులు, రక్షణ సహకారంపై ఇరుదేశాధినేతల మధ్య చర్చలు జరుగుతాయని వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ జెన్నీఫర్ ఫ్రైడ్‌మాన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి చర్చలు దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు.

మేజర్‌గానే విచారణ

న్యూఢిల్లీ, జూన్ 4: ఢిల్లీలో మెర్సిడెస్ కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన టీనేజర్‌ను మైనారిటీ తీరిన వ్యక్తిగానే పరిగణించి విచారించాలని జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జెజెబి) శనివారం నిర్ణయించింది. ఈ టీనేజర్ చేసిన నేరం క్రూరమయిందని కూడా పేర్కొంది. ఒక నేరానికి పాల్పడిన మైనర్‌ను మేజర్‌గా భావించి విచారించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏప్రిల్ 4న ఢిల్లీలో ఒక టీనేజర్ తన తండ్రికి చెందిన మెర్సిడెస్ కారును వేగంగా నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మెర్సిడెస్ కారు ఢీకొనడంతో 32 ఏళ్ల ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

మహారాష్ట్ర మంత్రి ఖడ్సే రాజీనామా

ముంబయి, జూన్ 4: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, పుణెలో భూమి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు లాంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమన్న సామీతో నరేంద్ర మోదీ-అమిత్‌షా ద్వయం అదికారం చేపట్టిన తర్వాత బిజెపికి చెందిన ఓ మంత్రి అవినీతి ఆరోపణలపై పదవికి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి.

సరదా సరదా సిగరెట్టు...

సరదా సరదా సిగరెట్టు అంటూ ఈ వ్యసనానికి బానిసలవుతున్నవారు రోజురోజుకి అధికమవుతోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా సరదాగా ప్రారంభించిన ఈ అలవాటును మానుకోలేక సతమతమవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలని ఓవైపు వైద్యులు సూచిస్తున్నా..వీటి వాడకం ఏమాత్రం తగ్గకపోగా క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు 109 సిగరెట్లు కాల్చటం అధికంగా గుర్తించారు. అతి తక్కువుగా 82 సిగరెట్లు కాలుస్తున్నట్లు గుర్తించారు. గ్రీస్‌లో ప్రతి వెయ్యిమందికి 312 మంది సిగరెట్లు తాగుతున్నట్లు గుర్తించారు. అలాగే మెసడోనియాలో 307 మంది, సెర్బియాలో 298మంది ఉన్నట్లు గుర్తించారు.

Pages