S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందనపుబొమ్మ వస్తోంది

సుధాకర్, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కుందనపుబొమ్మ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ముళ్ళపూడి వరా మాట్లాడుతూ, ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ. బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయన్నారు. జూన్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ‘రాయుడు’. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ, రాయుడు తన కెరీర్‌లో స్పెషల్ మూవీ అని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా చేశానని చెబుతున్నారని, తాను చేసిన ప్రయత్నానికి వచ్చిన గెలుపుఇదని అన్నారు.

నచ్చే బంగారం

ఇటీవల విడుదలైన ‘శ్రీమతి బంగారం’ చిత్రం అందరికీ నచ్చే బంగారమని దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. రిషి, రాజీవ్ కనకాల, రిచాసిన్హా ప్రధాన తారాగణంగా వినయ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమతి బంగారం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ చిత్ర విశేషాలను తెలుపుతూ, అన్ని కేంద్రాలలో పాజిటివ్ టాక్ వచ్చిందని, దీంతో థియేటర్లు కూడా పెరుగుతున్నాయని, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రంతో వినయ్‌బాబు గుర్తింపు పొందాడని ఆయన అన్నారు.

ఇలా చేయండి

క్రింది వాక్యాల అర్థం, మూడు అక్షరాల మాటలో మధ్య
అక్షరం (ర) వచ్చేటట్లు పూరించండి.
1.దండకు ఇది అవసరం 2.స్వాతంత్య్రానికి ముందు మనల్ని వీళ్లు పాలించారు 3.ప్రతీ అలమారుకి ఇవి తప్పక ఉండాలి 4.ఇది పట్టుకొని ఆ చేతులతో కళ్లు తాకితే మంట 5.పొలం దున్నాలంటే ఇదే కావాలి 6.ఏ పిండైనా ఇలా ఉండకూడదు 7.మోయలేకపోతే ఇలా ఉందంటారు 8.్భమిలో ఇది లేకపోతే పంట పండదు 9.ప్రతీ నదికి చెరువుకి ఇది ఉంటుంది 10.జలపాతాల్లో ఇవి కనిపిస్తాయి 11.తాండ్రలో ఇవి ఎక్కువగా ఉంటాయి 12.కృష్ణుని చేతిలో ఉంటుంది 13.పిల్లలు ఇది చేస్తే ఎక్కువ చెడిపోతారంటారు 14.కొంత మంది డ్రెస్సులు ఇలా ఉంటేనే ఇష్టపడతారు.
**

-చామర్తి వెంకట రామకృష్ణ

పగతీర్చుకునే నాగాభరణం

రమ్య, దివంగత విష్ణువర్థన్ ప్రధాన తారాగణంగా పెన్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజిద్ ఖురేషి రూపొందించిన చిత్రం ‘నాగాభరణం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేసి కోడి రామకృష్ణ చిత్రాలు అంటే గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా వుంటాయని, గత 30 ఏళ్ళుగా ఆయనతో సినిమాలు తీస్తున్న తాను తరువాత కూడా ఆయనతోనే రూపొందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విష్ణువర్థన్ పాత్రను ఈ చిత్రంలో సృష్టి చేయడం ఓ కొత్త అనుభూతిగా తాము భావిస్తున్నామని, ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని మకుట గ్రాఫిక్స్ దొరబాబు తెలిపారు.

విమర్శే ప్రశంస

ఒకానొక అడవిలో.. వసంత రుతువు రాగానే శిశిరంలో... ఆకులు రాల్చిన చెట్లన్నీ కొత్త చిగుళ్లు తొడిగి, నూతన వస్త్రాలు కట్టుకున్నట్లు ఆహ్లాదంగా కనిపించాయి.
గానుగ చెట్టు చిలకాకుపచ్చ చీరె కట్టుకుంటే, రావిచెట్టు.. లేత ఎరుపు రంగుతో కూడిన ముదురాకు పచ్చ చీరె సింగారించుకుంటుంది. నిద్ర గనే్నరు ఊదారంగు పూల చీరె చుట్టుకుంది. తురాయి చెట్లు.. ఎర్రని పూమొగ్గలు ఎప్పుడు ఆకాశం వైపు తలెత్తి చూడాలా అన్నట్లు ఎదురుచూస్తున్నాయి.

-పి.ఎల్.ఎన్.మంగారత్నం

ఇప్పుడే నటుడిగా మారా!

రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో విలన్‌గా తెరంగేట్రం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఆ తరువాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయనకు ‘బాహుబలి’ చిత్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాలకేయుడిగా నటించిన ఆయన, ఇప్పుడు బిజీగా మారాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ‘రైట్ రైట్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు ప్రభాకర్.
నటుడిగా ఊహించుకోలేదు

- శ్రీ

5-6-2016

అవధుల్లేని ఆనందం!

అందాలతార సమంత క్రేజ్ రోజు రోజుకీ బాగా పెరిగిపోతూనే వుంది. ఈ క్రేజ్ ఒక్క టాలీవుడ్‌లోనే కాదు...తమిళంలోనూ ఊపందుకుంటోంది. తెలుగులో ‘అ ఆ’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా, ‘జనతా గ్యారేజ్’ సెట్స్‌పై ఉరకలు వేస్తోంది. తమిళంలోనూ సమంత హవా బాగానే ఉంది. ‘24’, ‘తెరి’ చిత్రాలు అక్కడ మంచి విజయాలను నమోదు చేసుకోవడంతో కోలీవుడ్ మొత్తం ఈ ముద్దుగుమ్మ వైపే చూస్తోంది. సమంత కోరిక కూడా ఇదే. తమిళనాట మంచి విజయాలను అందుకోవాలన్నదే ఈ అమ్మడి లక్ష్యం. టాలీవుడ్‌లో ఇప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికైనా కోలీవుడ్‌లో టాలీవుడ్ అంతటి క్రేజ్ సంపాదించుకోవాలన్నదే సమంత ఆశ.

-సమీర్

కథకే ప్రాధాన్యం!

అగ్ర హీరోల చిత్రాల్లో నటించిన చాలా మంది భామలు యువతరం హీరోల చిత్రాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపరు. అతి తక్కువ కాలంలో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది అందాలతార హన్సిక. తమిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలోనే యువ, కొత్త హీరోల సరసన నటించేందుకు హన్సిక ప్రాముఖ్యత ఇస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయం గురించి హన్సికను కదిలిస్తే-‘‘నేను నటించే చిత్రంలో హీరో ఎవరనేది చూడను. ఆ చిత్ర కథ ఎలా వుంది? చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అన్నదే ముఖ్యం. కథ ఓకే అనిపిస్తేచాలు..నటించడానికి నేను సిద్ధంగానే వుంటాను’’అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ హన్సిక.

-సమీర్

Pages