S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగిలింది ‘ఒక్కరే’

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో, ఇక ఆ పార్టీ ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటుసభ్యుడు మల్లారెడ్డి మహానాడు ముగిసిన రెండోరోజునే పార్టీ ఫిరాయించి టిడిపికి షాక్ ఇచ్చారు.చివరిరోజున పార్టీకి విరాళం ఇచ్చి, బాబుతో ఫొటో కూడా దిగిన మల్లారెడ్డి, హైదరాబాద్ వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరటం పార్టీ నేతలు ఖంగుతినిపించింది. గతంలో ఇదేవిధంగా బాబు సమక్షంలో జరిగిన టిటిడిపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు..

తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర చరిత్రాత్మకమైంది

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత గడచిన రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర చారిత్రాత్మకమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రరారెడ్డి, ఎన్‌వివిఎస్ ప్రభాకర్, జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధనరెడ్డి, చింతా సాంబమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.

నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరం శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది సగటుకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వారు వెల్లడించారు. సాధారణ నుంచి అతి సాధారణ స్థాయిలో వర్షాలుంటాయని చల్లని కబురు చెప్పారు. సగటు కంటే ఎక్కువగా వర్షాలుపడే అవకాశం 96 శాతం ఉందన్నారు. వాయువ్య భారతంలో 108 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. ఈశాన్య భారత్‌లో సగటుంటే ఎక్కువగానే వర్షాలుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవతెలంగాణ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన జనజాతర సభకు అనుమతించొద్దంటూ లా విద్యార్థి రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్శిటీలో రాజకీయ నాయకుల ప్రవేశం, బహిరంగ సభలతో యూనివర్శిటీ వాతావరణం కలుషితమవుతోందని, వర్శిటీలో ఎలాంటి సభలు నిర్వహించకూడదంటూ పిటిషనర్ రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషన్‌ను స్పెషల్ లంచ్‌మోషన్ కింద విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం స్పందిస్తూ వర్శిటీలో ఎలాంటి సభలకు అనుమతించొద్దంటూ ఆదేశించారు.

ఝాన్సీది హత్యే

నకిరేకల్, జూన్ 2: నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిరేకల్‌కు చెందిన బిటెక్ విద్యార్థిని గూడూరు ఝాన్సీరాణి (21) మృతి మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కట్టుకున్న భర్త, కన్నతల్లి కలిసి ఆమెను హత్య చేసినట్లు నిర్థారించారు. ఈ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నల్లగొండ డిఎస్పీ ఎస్.సుధాకర్ తెలిపారు. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని తల్లి, భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఝాన్సీ ఈనెల 23న సరూర్‌నగర్ పోస్ట్ఫాసు నుంచి పోలీస్ అధికారులకు పోస్టు ద్వారా లేఖను పంపండంతో నకిరేకల్ సిఐ జె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో పోలీసులకు పతకాలు

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో శౌర్యం, ప్రతిభ కనబర్చిన పోలీసులకు వివిధ పతకాలను పరేడు గ్రౌండ్‌లో జరిగిన వేదికపై ముఖ్యమంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి శౌర్యపతకం, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర మహోన్నత సేవా పతకం, ముఖ్యమంత్రి సర్వోత్తమ సేవా పతకం వంటి నాలుగు రకాల పతకాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా బహుకరించారు.

‘రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కెసిఆర్’

హైదరాబాద్, జూన్ 2: బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కెసిఆర్ కుట్ర పన్నారని టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అభినందన దినోత్సవంగా జూన్ 2ను జరుపుతున్నామన్నారు. సోనియా వల్లనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఒక భ్రమని, ఈ స్కీంకు నిధులు లేవన్నారు.

నేడు కేబినెట్ భేటీ

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం పనె్నండు గంటలకు సచివాలయంలో జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి విస్తృతంగా చర్చించనున్నారు. జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే కొత్త జిల్లాల ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి తొలుత భావించారు. వివిధ జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించిన తరువాతనే కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించేందుకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ అంశం గురించి కేబినెట్‌లో ముఖ్యమంత్రి వివరిస్తారు.

కేరళ పీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టాపర్‌గా సెంట్రల్ వర్శిటీ విద్యార్థి

హైదరాబాద్, జూన్ 2: కేరళ విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్షలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్థులు ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఎకనామిక్స్‌లో ఎంఎ, పిహెచ్‌డి చేసిన అంజు సుశాన్ థామస్ ఎంపిక పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు. నాలుగో ర్యాంకులో జానకి ఎస్‌ఆర్, ఐదో ర్యాంకు సాధించిన గోపిక జిజి, ఏడో ర్యాంకు సాధించిన దీపికా రఘుకుమార్, 22వ ర్యాంకు సాధించిన బషీర్ కెకె, 47వ ర్యాంకు సాధించిన షీజాఎం, 54వ ర్యాంకు సాధించిన ఎం రషీద్‌లు కూడా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులేనని రిజిస్ట్రార్ ఎం సుధాకర్ చెప్పారు.

ఎల్‌ఎస్‌ఏఈ చైర్మన్‌గా జస్టిస్ సుబ్రమణియన్

హైదరాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు జడ్జి జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయవ్యవహారాల కార్యదర్శి ఎ. సంతోష్‌రెడ్డి పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2015 మే 23 నుండే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు.

Pages