S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

నర్సంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం వచ్చినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపంతో డిగ్రీ చదివిన ఓ నిరుద్యోగ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయ. నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇప్ప సాంబయ్యకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన ఇప్ప నరేష్ (20) రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. నాటినుండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యాడు. ఇదిలావుండగా గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జనం చనిపోతుంటే వేడుకలెందుకు?

న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే మరోవైపు రూ. వందల కోట్లు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా అని కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలపై మండిపడ్డారు. వడదెబ్బ, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే వేడుకలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మూలంగానే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దిగ్విజయ్ ట్వీట్ చేశారు.

తూ.గో.లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

రావులపాలెం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రంతటా నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తుంటే తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు నిర్వహించి కొందరు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి కూడలిలో గురువారం తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సంగినీడి సీతారాం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్థానిక అమలాపురం రోడ్డులో కోనసీమ ముఖ ద్వారం వద్దనుండి పలువురు తెలంగాణ సిఎం కెసిఆర్ చిత్రంతో ఉన్న ఫ్లెక్సీ చేతపట్టుకుని కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు.

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం గురువారం దర్శించుకుంది. సిఎం సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్ తదితరులు శ్రీవారి దర్శనార్థం గురువారం ఉదయం 9గంటలకు తిరుమలకు చేరుకున్నారు. రెండో పర్యాయం దేవాన్ష్‌కు తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంటనే స్వామివారిని దర్శించుకోవాలని భావించారు. అయితే ఆ సమయంలో వివిఐపిలకు కూడా ప్రత్యేక దర్శన సౌకర్యం లేకపోవడంతో సాధారణ భక్తులు దర్శనం చేసుకున్న విధంగా మహాలఘులో స్వామివారిని దర్శించుకుని ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు.

పాముకాటుతో తల్లి.. పాలు తాగి కొడుకు మృతి

గుత్తి, జూన్ 2: పాముకాటుకు గురైన తల్లితో పాటు ఆమె పాలు తాగిన ఏడాది కొడుకు మృతి చెందిన సంఘటన గురువారం అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన లింగన్న, చంద్రకళ (30) దంపతులు పశుపోషణ ద్వారా జీవనం సాగించేవారు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున చంద్రకళ పశువులపాకలో పాలు పితుకుతుండగా పాము కాటు వేసింది. అయితే ఆ విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. తన కుమారుడు ఉదయం 7 గంటలకు నిద్ర లేవగా ఆ బాలుడికి పాలు పట్టించింది.

విద్యుత్ ఆదాకు ఏపిఇఇడిసి ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా చేసేందుకు ఏపి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కాంలు, కేంద్రం పరిధిలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఏపి రాష్ట్ర ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఇఇడిసి)ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు రాష్టప్రభుత్వం జీవో 18ను జారీ చేసింది. ఈ వివరాలను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఆదా చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు.

టిఎమ్సెట్ మెడికల్‌కు 15వేల దరఖాస్తులు

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు గురువారం రాత్రికి 15వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు ఆరు వేల దరఖాస్తులు రాగా రెండో రోజు దరఖాస్తుల సంఖ్య 15వేలకు పెరిగింది. అబ్బాయిలు 6వేల మంది దరఖాస్తు చేయగా, అమ్మాయిలు 10వేల మంది దరఖాస్తు చేశారు. వారిలో ఉస్మానియా ఏరియా నుండి 9వేలు, ఆంధ్రా ఏరియా నుండి 3వేలు, ఎస్వీయు నుండి 1300, మిగిలినవి ఇతర ప్రాంతాల నుండి వచ్చాయి. దరఖాస్తుల్లో ఒసిలు 4వేలు, బిసిఎ 1013, బిసి బి 2204, బిసి సి 204, బిసిడి 2వేలు, బిసిఇ 1038, ఎస్సీ 2500, ఎస్టీ వెయ్యి మంది ఉన్నారు.

4న విస్తరణాధికారుల నియామక పరీక్ష

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ 4వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు 7645 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. 4వ తేదీన ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్-2 జరుగుతుందని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హెచ్‌ఎండిఎ పరిధిలో వీరికోసం 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, నలుగురు జోనల్ అధికారులు ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని పేర్కొన్నారు.

చంద్రబాబుది నయవంచన దీక్ష

హైదరాబాద్, జూన్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్షను చేయడం వింతగా ఉందని ప్రతిపక్ష పార్టీ వైకాపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో గురువారం నవ నిర్మాణ దీక్ష చేయలేదని, ఇదంతా నయ వంచన దీక్ష అని ఆ పార్టీ విమర్శించింది. అవినీతి మీద, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వజం ఎత్తాలన్న నవ నిర్మాణ దీక్ష, ప్రతిజ్ఞ ప్రకారం ప్రజల తొలి లక్ష్యం ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలన్నారు.

హిందూజా విద్యుత్‌లో మాకూ వాటా: తెలంగాణ

హైదరాబాద్, జూన్ 2: విశాఖపట్నంలోని హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్ నుంచి 1040 మెగావాట్ల విద్యుత్‌ను ఏపి డిస్కాంలే కొనుగోలు చేయాలంటూ ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 మెగావాట్ల హిందూజాకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ మొత్తం విద్యుత్‌ను ఏపి డిస్కాంలే వినియోగించుకోవాలని నిర్ణయించడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపి ప్రభుత్వం గురువారం జీవో ఎంఎస్ 17ను జారీ చేసింది.

Pages