S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలీ బతుకుల్లో.. కూలిన కొండరాయి

విజయవాడ (క్రైం), జూన్ 2: ప్రకృతి ప్రకోపానికి ఓ బడుగు కుటుంబం కూలిపోయింది. కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ బతుకుల్లో విషాదం నింపింది. కురిసిన భారీ వర్షానికి జారి పడిన కొండరాయి ఓ నిండు జీవితాన్ని చిదిమేసింది. కూలీ బతుల్లో కూలిన బండరాయి ఇల్లాలిని పొట్టన పెట్టుకోగా.. గాయపడిన చిన్నారి ఆస్పత్రిపాలైంది. ఇంటి దీపం ఆరిపోయిన ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇంటి యజమాని జీవితంలో చీకటి అలముకుంది. నగరంలో సంచలనం కలిగించిన ఈఘటన గుణదల కొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలి

పటమట, జూన్ 2: ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని కలిగించేలాగా మెరుగైన వైద్య సేవలు అదించడంతోపాటు, డాక్టర్లు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. గురువారం స్థానిక ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ ప్రాంగణంలోని కొత్త ఆసుపత్రి పక్కన పిఎంఎస్‌ఎస్‌వై 150 కోట్ల గ్రాంట్‌తో నిర్మించనున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారు, దేశాల వారు వైద్య చికిత్సల కోసం రాష్ట్రానికి వచ్చే లాగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ తీరు మెరుగుపరుచుకొని రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా, మెడికల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు.

నవనిర్మాణ దీక్ష కాదిది.. నయవంచన దీక్ష

పటమట, జూన్ 2: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో దీక్ష చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ విసిరారు. రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ‘మట్టీ నీరు’ తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన వెళ్లిన ఫెక్సీల ప్రదర్శన సందర్భంగా నగరంలోని లెనిన్ సెంటర్‌లో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది.

పురాతన పంచలోహ విగ్రహాలతో యువకుని అరెస్టు

విజయవాడ (క్రైం), జూన్ 2: గుంటూరు జిల్లా అమరావతి గ్రామంలో పురాతన పంచలోహ విగ్రహాల చోరీ చేసిన వ్యక్తి వాటిని విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన తాడిశెట్టి నరసింహారావు (32) లారీడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం అమరావతి గ్రామంలోని ఆర్టీసి బస్టాండు ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. నేరబాట పట్టిన నరసింహారావు ఆరుమాసాల క్రితం అమరావతి గ్రామంలో పురాతన విగ్రహాలైన పంచలోహ విగ్రహాలను దొంగిలించి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు.

నేడు తేలనున్న సస్పెండెడ్ ఉద్యోగుల భవితవ్యం?

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 2: కొండను తవ్వి ఎలుకను పట్టినట్టున్న సామెత చందంగా తయారైంది నకిలీ టిడిఆర్ బాండ్ల వ్యవహారం. ఈవిషయంపై కనె్నర్ర చేసిన చేసిన విఎంసి కమిషనర్ వీరపాండియన్ మే 17న టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లో మొత్తం 10 మంది అధికార, సిబ్బందిని మూకమ్మడిగా సస్పెండ్ చేసి సంచలనం రేపిన విషయం విధితమే. పది మంది ఉద్యోగుల్లో ఇద్దరు సూపరింటెండెంట్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరి సస్పెన్షన్‌పై మొదటి నుంచీ వ్యతిరేకతతో ఉన్న విఎంసి ఉద్యోగ సంఘం వీరిపీ సస్పెన్షన్ ఎత్తివేతలో సఫలీకృతులైనారనే చెప్పాలి.

సిఆర్‌డిఏ కార్యాలయంలో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 2: విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయంలో గురువారం నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసిసిఆర్‌డిఏ అదనపు కమిషనర్ ఎ.మల్లికార్జున అధికారులు, ఉద్యోగులందరితో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిస్తామని అందరూ ప్రతిన పూనారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వి.రామమనోహరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపిసిఆర్‌డిఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ బెంజిసర్కిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు.

దుర్గగుడి ఆదాయం రూ. 2.41 కోట్లు

ఇంద్రకీలాద్రి, జూన్ 2: ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధి శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో గురువారం ఉదయం ఇన్‌చార్జ్ ఇవో అజాద్ ఆదేశాల మేరకు సిబ్బంది హుండీలను లెక్కించగా 2కోట్ల, 41లక్షల, 49వేల, 644రూపాయలు లభించాయి. 31 రోజులుగాను అమ్మవారి సన్నిధిలో ఉన్న 50హుండీలను లెక్కించగా ఈ నగదు దేవస్థానానికి మూలధనంగా లభించాయి. ఈకార్యక్రమంలో దేవస్థానం సహాయ ఇవోలు బి వెంకటరెడ్డి, డి సాయిబాబానాయుడు, పర్యవేక్షణాధికారులు యన్ రమేష్, కె విజయ్‌కుమార్, కె చంద్రశేఖర్, అమృతరావు, గోపిచంద్, సిబ్బంది పాల్గొన్నారు.

బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి

పాయకాపురం, జూన్ 2: అతివేగంగా వస్తున్న బైక్ ఢీకొనటంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడిలో నివాసముంటున్న గజ్జెల దేవసహాయం అంధుడు. అతని భార్య సుబ్బులు (55) గురువారం సాయంత్రం పైపుల రోడ్డు సెంటర్ నుండి జక్కంపూడి రోడ్డుకి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా నగరం నుండి పాయకాపురానికి బైక్ వస్తున్న టి వెంకట సుబ్బారావు అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ నుండి వేగంగా వచ్చి సదరు దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భర్త దేవసహాయానికి స్వల్ప గాయాలుకాగా భార్య సుబ్బులుకి తీవ్రగాయాలయ్యాయి.

సాయినాథునికి పల్లకిసేవ

ఇంద్రకీలాద్రి, జూన్ 2: పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాతశివాలయం) ప్రాంగణంలో కొలువైన సాయినాథునికి గురువారం వేకువ జామున ఆలయ ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ భక్తిశ్రద్ధలతో పల్లకిసేవ నిర్వహించారు. గురుదేవుడైన సాయినాథునికి గురువారం ప్రీతిపాత్రమైన రోజుకావటంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పుష్పాలతో బాబా పల్లకిని అలకరించి ఉత్సవమూర్తిన్ని పల్లకిలో ఉంచి ఆలయ సంప్రదాయం ప్రకారం మూడుసార్లు ఊరేగింపు నిర్వహించారు.

జ్యూయలరీ పార్కు, ఆటోనగర్‌లో వౌలిక సదుపాయాలు కల్పిస్తాం

మచిలీపట్నం, జూన్ 2: పోతేపల్లి జ్యూయలరీ పార్కు, ఆటోనగర్‌లో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం స్థానిక జ్యూయలరీ పార్కు అసోసియేషన్ సమావేశపు హాలులో ఎపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్యతో కలిసి జ్యూయలరీ పార్కు, ఆటోనగర్ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రధాన సమస్యగా మారిన మంచినీరు, రహదారులు, డ్రైనేజీ, తదితరాల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని రోల్డుగోల్డు, ఆటోనగర్ యూనిట్లన్నీ సత్వరమే ఇక్కడకు వచ్చి యూనిట్లు నెలకొల్పుకోవాలని కోరారు.

Pages