S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి ఆర్టీసిలో కార్గో

నెల్లూరు, జూన్ 2: ఏపిఎస్ ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా సరకుల పార్శిల్ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్రబాబు తెలిపారు. గురువారం నెల్లూరు ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులతో పాటు సరకులను రవాణా చేసేందుకు నెల్లూరు జిల్లాలో 97 సర్వీసులను ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఈ సర్వీసుల్లోని లగేజి కేబిన్లను ఎవరికైనా కాలపరిమితి కాంట్రాక్టుగా కూడా ఇస్తామన్నారు. ఇతర పార్శిళ్లను కూడా చేరవేస్తామని తెలిపారు.

భారత క్రికెట్ జట్టుకు స్వదేశీ కోచ్!

ముంబయి, జూన్ 2: భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, స్వదేశీ కోచ్‌నే నియమించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇతరత్రా అర్హతలతోపాటు హిందీలో మాట్లాడడం వచ్చిన వ్యక్తినే కోచ్‌గా నియమిస్తామని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీనితో స్వదేశీ కోచ్‌ని బిసిసిఐ నియమిస్తుందన్న వాదన బలాన్ని పుంజుకుంది. అదే నిజమైతే, రేసులో అందరి కంటే ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ రేసులో ముందు ఉంటాడు.

టైటిల్ దిశగా జొకోవిచ్

పారిస్, జూన్ 2: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను థామస్ బెర్డిచ్‌ని 6-3, 7-5, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరాడు. 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఈ ట్రోఫీని అందుకోవడానికి జొకోవిచ్ మరోసారి రంగంలోకి దిగాడు. తొమ్మిది పర్యాయాలు విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ మణికట్టు గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో జొకోవిచ్‌కి టైటిల్ సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి.

సానియా మీర్జా ముందంజ

పారిస్: ఇవాన్ డోడింగ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. వీరు క్వార్టర్ ఫైనల్‌లో చాన్ యుంగ్ జన్, మాక్స్ మిర్నియ్ జోడీని 6-1, 3-6, 10-6 తేడాతో ఓడించారు. కాగా, వేరువేరు భాగస్వాములతో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్, రోహన్ బొపన్న పరాజయాలను చవిచూశారు. పురుషుల డబుల్స్‌లో రుమేనియాకు చెందిన ఫ్లోరియన్ మెర్గియాతో కలిసి ఆడిన బొపన్న 4-6, 4-6 తేడాతో ఇవాన్ డోడింగ్, మార్సెలో మెలో జోడీ చేతిలో ఓటమిపాలయ్యాడు. మార్సిన్ మాట్కోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన 6-7, 3-6 స్కోరుతో మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్ జోడీ చేతిలో ఓడింది.
సెమీస్ చేరిన ముగురుజా

ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా

జకార్తా, జూన్ 2: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. స్థానిక క్రీడాకారిణి ఫిత్రియానిని ఆమె 21-11, 21-10 తేడాతో చిత్తుచేసి, నాలుగోసారి ఈ టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. 2009, 2010, 2012 సంవత్సరాల్లో ఆమెకు ఇండోనేషియా ఓపెన్ టైటిల్ లభించింది. గత కొంతకాలంగా కాలి మడమ నెప్పితో బాధపడుతున్న సైనా కోలుకొని, మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం.

క్యూ స్పోర్ట్స్‌కు పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్, జూన్ 2: క్యూ స్పోర్ట్స్ పట్ల ఆదరణ పెరుగుతున్నదని, ఇది శుభ పరిణామమని ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ అన్నాడు. వివిధ అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం మాదాపూర్‌లోని బాల్క్‌లైన్ క్యూ స్పోర్ట్స్ అకాడెమీలో గురువారం ప్రారంభమైన ట్రయల్స్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని అన్నాడు. అయితే, క్యూ స్పోర్ట్స్ కూడా మిగతా క్రీడల మాదిరిగానే అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నాడు.

టీమిండియా మేనేజర్‌గా రమేష్

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) సెంట్రల్ జోన్ కార్యదర్శి కె. రమేష్ జింబాబ్వే పర్యటనకు వెళ్లే టీమిండియాకు మేనేజర్‌గా నియమితులయ్యారు. భారత జట్టు జింబాబ్వేలో ఈ నెల 11 నుండి మూడు వనే్డలు, మూడు టి 20 మ్యాచ్‌లు ఆడనుంది. 2012 కౌలాలంపూర్‌లో పర్యటించి ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న అండర్-19 భారత జట్టుకు రమేష్ మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా సౌత్‌జోన్ అండర్-16, 19 జట్లకు కోచ్, మేనేజర్‌గా వ్యవహరించారు.
సచిన్‌ను కలిసిన శాప్ చైర్మన్

టెస్టులను బతికించుకోవాలి

లండన్, జూన్ 2: టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డాడు. ఇందుకుగాను పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని, వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. లండన్‌లో జరిగే ఐసిసి క్రికెట్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రిచర్డ్‌సన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా సభ్యదేశాల్లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రసార హక్కులతో తగినంత ఆదాయం లభించడం లేదని అన్నాడు. దీనితో టెస్టు సిరీస్‌లతో నష్టాలే తప్ప లాభం ఉండడం లేదని చెప్పాడు.

ప్రొ కబడ్డీ ఎథిక్స్ కమిటీ ఖరారు

ముంబయి, జూన్ 2: ప్రొ కబడ్డీ ఎథిక్స్, గవర్నెస్ కమిటీ ఖరారైంది. నాలుగో సీజన్‌కు గాను ఈ కమిటీలో ఢిల్లీ, మద్రాసు హైకోర్టులకు న్యాయమూర్తిగా సేవలు అందించి రిటైరైన ఎపి షా, మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎఎన్ రాయ్ సభ్యులుగా ఉంటారు. కమిటీలో దీపక్ జాకబ్, చారు శర్మ, ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామిలకు కూడా ఈ కమిటీలో స్థానం లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న షా చేరికతో ఈ కమిటీ ప్రాధాన్యం పెరిగింది. కాగా, తనపై నమ్మకంతో ప్రొ కబడ్డీ అధికారులు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షా అన్నాడు.

ఉద్యమస్ఫూర్తి కసితో అభివృద్ధిపథంలోకి..

బెంజిసర్కిల్, జూన్ 2: అన్యాయంగా... అవమానాలతో.. అప్పులతో రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితుల నుండి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కట్టుబట్టలతో ఉన్న మనం అనేక సవాళ్లను స్వీకరించి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ పునరంకితం కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమస్ఫూర్తితోనే నేడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు నడుం బిగించాలన్నారు.

Pages