S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీచ్ అభివృద్ధికి నిధుల కొరత లేదు

మచిలీపట్నం, జూన్ 2: మంగినపూడి బీచ్ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు ఉన్నాయని, త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మంగినపూడి బీచ్‌ను పరిశీలించిన అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో మంత్రి కొల్లు రవీంద్రతో భేటీ అయ్యారు. మంగినపూడి బీచ్ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి రవీంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. మంగిపూడి బీచ్‌ను అభివృద్ధి పర్చేందుకు తగినన్ని నిధులు ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ ప్రసాద్ మంత్రి రవీంద్రకు హామీ ఇచ్చారు.

ఆంజనేయస్వామికి లక్ష మల్లెల అర్చన

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 2: స్థానిక ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మందిరంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి లక్ష మల్లెలార్చన నిర్వహించారు. అర్చకులు చల్లపల్లి నాగ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన సభలో సరస్వతి కళాసమితి అధ్యక్షులు సి శేషాచార్యులు (అప్పాజి), ప్రముఖ సంగీత విద్వాంసులు చిట్టా గోపాలకృష్ణమూర్తి మందిర చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు భక్తి గీతాలు, హనుమాన్ ఛాలీసా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.

యోగ సాధకుడు హనుమ

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 2: హనుమ యోగ సాధకుడని ప్రముఖ సాహితీవేత్త, ఆర్ష విద్యాసాగర మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. స్థానిక బచ్చుపేట శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి వేడుకల్లో భాగంగా 3వ రోజైన గురువారం ఆయన హనుమత్ వైభవంపై ప్రసంగించారు. సాధనలో ఎదురయ్యే అన్ని విఘ్నాలను జయించే విధానాన్ని ఆచరణ ద్వారా ప్రబోధించిన యోగి పుంగవుడు ఆంజనేయుడన్నారు. సత్యానే్వషణ ఆత్మదర్శన సాధన అని, మైనాకుడు, సురస, సింహికలు సత్వ, రజ, తమో గుణ సంబంధమైన విజ్ఞానాలకు ప్రతీకలని, వాటిని సౌమ్య వచనాలతో, యుక్తి, శక్తితో జయించిన సాధకుడు హనుమ అన్నారు. కార్యసాధకులకు, సేవాతత్పరులకు ఆయన ఆదర్శమన్నారు.

మన అంగన్‌వాడీ పిలుస్తోందని ర్యాలీ

మైలవరం, జూన్ 2: మన అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంపై గురువారం మైలవరంలో ర్యాలీ జరిగింది. స్థానిక పంచాయితీ కార్యాలయం నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, కిషోర బాలికలతో ర్యాలీ ప్రారంభమై మైలవరం పుర వీధులలో తిరిగింది.

పొందుగల బిజెపి అధ్యక్షునిగా నాగరాజు

మైలవరం, జూన్ 2: మండలంలోని పొందుగల గ్రామ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఆరేపల్లి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ కన్వీనర్ పి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వజ్రాల వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈమేరకు కమిటీని ఎన్నిక చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం కార్యదర్శిగా సంకటి ఏసు, కోశాధికారిగా వంగూరి పనే్నరు, సభ్యులుగా నూతక్కి ఏసు, బాబు, బోడే నాగేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన సభ్యులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

మైలవరంలో నవ నిర్మాణ దీక్ష ర్యాలీ

మైలవరం : ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మైలవరంలో గురువారం నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయితీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులలో తిరిగి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎంపిడిఓ వై హరిహరనాథ్ ఆధ్వర్యంలో నవ నిర్మాణ దీక్ష గురించి వివరించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఉద్యోగులు, పురప్రముఖులు, పార్టీ నేతలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.

రహదారి విస్తరణకు మా స్థలాలు ఇవ్వలేం

మైలవరం, జూన్ 2: రహదారి విస్తరణకు తాము విలువైన తమ స్థలాలు ఇవ్వలేమని మండలంలోని వెల్వడం గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరం నుండి నూజివీడు వరకూ రహదారిని 25కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మండలంలోని వెల్వడం, చంద్రాల గ్రామంలో కొన్ని ఆక్రమణలను ఇప్పటికే అధికారులు తొలగించగా కొన్నిచోట్ల ఇళ్లు అడ్డుగా ఉన్నాయి. ఇవి పక్కా ఇళ్లయినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సంబంధిత యజమానులకు మార్కెట్ ధర ప్రకారం సొమ్ము చెల్లించి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది.

రాష్ట్భ్రావృద్ధికి పునరంకితవౌదాం

మచిలీపట్నం, జూన్ 2: కుల, మత, ఆర్థిక అసమానతలను పక్కన పెడదాం.. చెయ్యిచెయ్యి కలుపుదాం.. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితవౌదాం.. అంటూ జిల్లా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జిల్లా అంతటా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార, అనధికార వర్గాలతో పాటు సామాన్య ప్రజలు నవ నిర్మాణ దీక్షలో పాల్గొని రాష్ట్భ్రావృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.

చంద్రబాబుది నయవంచక దీక్ష

జగ్గయ్యపేట, జూన్ 2: రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు ఇచ్చి రాష్ట్ర విభజనకు లోక్‌సభలో తొలి ఓటు మా పార్టీదే అని ప్రకటించి రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని కృష్ణా, గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.

కనుల విందుగా ఆవిర్భావ పండుగ

హైదరాబాద్, జూన్ 2: ఉద్యమాల ఖిల్ల నల్గొండ జిల్లా..తెలంగాణ ఉద్యమ పరవళ్లు ఓరుగల్లు..కళల ఊరు పాలమూరుతో పాటు తెలంగాణలోని పదిజిల్లాలకు విభిన్న కళా, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరోసారి రాజకీయపార్టీలకతీతంగా అమరులను స్మరించుకుంది. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో, సాంస్కృతిక వేదికల్లో ఘనంగా జరిగాయి.

Pages