S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.

‘స్థారుూ’ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, జూన్ 2: మహానగర పాలక సంస్థ అభివృద్ది పనులు, పౌరసేవల నిర్వహణతో పాటు పరిపాలన అంశాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు స్థారుూ సంఘం కూడా అందుబాటులోకి వచ్చింది. స్థారుూ సంఘం ఎన్నికకు సంబంధించి ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 15మంది కార్పొరేటర్లను స్థారుూ సంఘం సభ్యులుగా ఎన్నుకోవల్సి ఉండగా, మజ్లిస్, టిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన మొత్తం 46 మంది కార్పొరేటర్లు నామినేషన్లు సమర్పించిన సంగతి తెలిసిందే!

అంకితభావంతో పనిచేయాలి

హైదరాబాద్, జూన్ 2: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర ద్వితీయ ఆవిర్భవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సుదర్ఘీ పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ శ్రేణి నగరంగా రూపొందించటంలో మరింత చిత్తశుద్ధితో అభివృద్ధి, పారిశుద్ధ్యం కార్యక్రమాల నిర్వహణను చేపట్టాలని కోరారు.

బంగారు తెలంగాణ సాధనకు కృషి

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం సంబురంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.సునీతారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణాకు బాటలు వేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంఘటితంగా అవినీతి రహిత పాలన సాగిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో ముందంజలో దూసుకుపోతుందని అన్నారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో 603 మందికి శిక్ష

హైదరాబాద్, మే 2: హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 603 మందికి జైలు శిక్ష పడింది. రూ. 26.96 లక్షల జరిమానా విధిస్తూ ఎర్రమంజిల్ 3వ, 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు తీర్పు చెప్పాయి. వీరిలో 11 మందికి 10 రోజులు, ఇద్దరికి ఏడు రోజులు, ఆరుగురికి ఐదు రోజులు, ఎనిమిది మందికి నాలుగు రోజులు, 34 మందికి మూడు రోజులు, 95 మందికి రెండు రోజులు, 74 మందికి ఒక రోజు చొప్పున కోర్టులు జైలు శిక్ష విధించాయి. మరో 373 మందికి కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలోనే ఉండాలని శిక్ష విధించాయి.

సచివాలయంలో సందర్శకులకు డిజిటల్ పాస్‌లు

హైదరాబాద్, జూన్ 2 : తెలంగాణ సచివాలయంలో సందర్శకులకు బుధవారం నుండి డిజిటల్ పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. సచివాలయ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ పాస్‌ల కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా తెలంగాణ సచివాలయం సాధారణ పరిపాలన శాఖ అడిషనల్ సెక్రటరీ ఎన్. శంకర్ ప్రారంభించారు. వాస్తవంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధానాన్ని మే 21 న తన ఛాంబర్‌లో పరిశీలించి పైలట్ విధానంలో ప్రారంభించారు. సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారు తమ గుర్తింపు కార్డును (ఆధార్ లేదా ప్రభుత్వం ఇచ్చిన ఇతర గుర్తింపు కార్డు) ను తీసుకురావలసి ఉంటుందని సచివాలయంలోని చీఫ్ రిసెప్షనిస్ట్ ఆఫీసర్ బంగారురాజు తెలిపారు.

ప్రగతిపథంలో నడుద్దాం

హైదరాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ఉద్యోగులంతా తమ వంతు కృషి చేయాలని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ వినోద్ కుమార్ అగర్వాల్ పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన సంస్థ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగాలకు ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నారు. స్వర్ణ తెలంగాణ కోసం పాటుపడాలని, దీన్ని సాధించాలని సూచించారు. అంధుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు దేవనార్ ఫౌండేషన్‌తో కలిసి అంధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

బంగారు తెలంగాణ దిశగా అధికారులు కృషి చేయాలి: జెసి సైనీ

హైదరాబాద్, జూన్ 2: ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించి బంగారు తెలంగాణ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని జేసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలదరికి చేరేలా అధికారులు కృషి చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి బంగారు తెలంగాణకు అడుగులు వేసిన వారమవుతామన్నారు.

రూ. 5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

వనస్థలిపురం, జూన్ 2: నగర శివారులో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. వనస్థలిపురం ఆటోనగర్‌లోని ఓ హోటల్‌లో డిఆర్‌ఐ అధికారులు గురువారం మధ్యాహ్నం సోదా చేశారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న డిఆర్‌ఐ అధికారులు హోటల్‌లో తనిఖీ చేయగా సుమారు ఐదు కోట్లు విలువ చేసే 50కిలోల ఎపిడ్రిన్ మత్తు పదార్థం లభ్యమైంది. అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి విచారించగా ఈ మాదక ద్రవ్యాన్ని చెన్నైకు తరలిస్తున్నట్టు నిందితులు అంగీకరించారని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. నిందితులను సిసిఎస్ పోలీసులకు అప్పగించారు.

ఓయులో జనజాతర సభతో ఉద్రిక్తత

సికింద్రాబాద్,నాచారం, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు రాష్టవ్య్రాప్తంగా ఘనంగా జరుగుతున్న సమయంలో ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో మాత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీసుల లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన తెలంగాణ ఉద్యమవీరులను తయారు చేసిన ఓయు క్యాంపస్‌లో తెలంగాణ కోసం మరోసారి అలజడి ఆరంభమైంది. అయితే గతంలో జరిపిన ఉద్యమం స్వరాష్ట్ర సాధనకోసమైతే ప్రస్తుతం విద్యార్థులు జనజాతర వేదిక చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వంపైనే కావడం విశేషం.

Pages