S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్.. ఓ దగాకోరు

వాషింగ్టన్, జూన్ 2: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడటానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం గురువారం తీవ్రమయింది. ‘ట్రంప్ యూనివర్శిటీ’ వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ యూనివర్శిటీలో ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని పైకొచ్చిన విధంగానే ఇప్పుడు మొత్తం అమెరికా ప్రజలను దగా చేయడానికి ట్రంప్ యత్నిస్తున్నారని ఆమె న్యూజెర్సీలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈరోజు మనకు మరో కుంభకోణం గురించి తెలుస్తోంది.

నిజ నిర్ధారణ జరగకుండా ఎవ్వరినీ శిక్షించలేం

న్యూఢిల్లీ, జూన్ 2: ఆయుధాల వ్యాపా రి సంజయ్ భండారితో తన ఓఎస్‌డి అప్పారావు టెలిఫోన్‌లో వందాలాదిసార్లు సంభాషించినట్లు వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలు తెలుసుకుంటానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. అశోక్ గజపతిరాజు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నిజ నిర్ధారణ జరగకుండా ఎవ్వరినీ శిక్షించలేమన్నారు. సంజయ్ భండారి తనను కూడా ఒకసారి కలిశారని, ఎయిరోస్పేస్ పరిశ్రమతో సంబంధం ఉన్నవారంతా తనను కలుస్తుంటారు, సంజయ్ భండారీ కూడా ఇదే తరహలో తనను కలిశారు, బెంగళూరులో సంవత్సరం క్రితం ఎయిర్ షోలో కలిశారని ఆయన వివరించారు.

మరో కాస్మిక్ రికార్డు!

వాషింగ్టన్, జూన్ 2: ఖగోళ విజ్ఞానం ఇప్పటివరకు సాధించిన రోదసీ రికార్డులను అధిగమించింది. దాదాపు 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంనుంచి హైడ్రోజన్ వాయువు లేశప్రాయ సంకేతాలను ధార్మిక కిరణాల ఖగోళ విజ్ఞానం అందిపుచ్చుకోగలిగింది. గతంలో సాధించిన దానికంటే ఇది దాదాపు రెండింతల దూరం రికార్డు. వందలాది కోట్ల శైశవ ప్రాచీన నక్షత్రాలతో కూడిన ఈ సుదూర గెలాక్సీనుంచి హైడ్రోజన్ సంకేతాలను అమెరికాకు చెందిన నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించగలిగారు. ఈ గెలాక్సీ అంతా కూడా హైడ్రోజన్ వాయు మేఘాల మయమేనని వెల్లడించారు. విశ్వంలో నక్షత్రాలు ఏర్పడడానికి ముడిపదార్థంగా హైడ్రోజన్ మూలకం ఉపయోగపడుతోంది.

స్వల్పకాలిక యోగా కోర్సులు చేసే విదేశీయులకు టూరిస్టు, ఇ-వీసాలు

న్యూఢిల్లీ, జూన్ 2: యోగ విద్యను ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా యోగ విద్యలో స్వల్పకాలిక కోర్సు చేయడానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసా, ఇ-టూరిస్టు వీసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగా ప్రాధాన్యతను ప్రపంచమంతా గుర్తిస్తూ ఉండడాన్ని గ్రహించిన ప్రభుత్వం స్వల్పకాలిక యోగా కోర్సుకు హాజరు కావడాన్ని, భారతీయ వైద్య విధానాల్లో స్వల్పకాలిక చికిత్స తీసుకోవడానికి రావడాన్ని ఇ-టూరిస్టు వీసా కింద అనుమతించబడే కార్యకలాపాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు

న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరం శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది సగటుకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వారు వెల్లడించారు. సాధారణ నుంచి అతి సాధారణ స్థాయిలో వర్షాలుంటాయని చల్లని కబురు చెప్పారు. సగటు కంటే ఎక్కువగా వర్షాలుపడే అవకాశం 96 శాతం ఉందన్నారు. వాయువ్య భారతంలో 108 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. ఈశాన్య భారత్‌లో సగటుంటే ఎక్కువగానే వర్షాలుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మానవ హక్కులపై చర్చకు సిద్ధం

వాషింగ్టన్, జూన్ 2: మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై సమానత్వం, భాగస్వామ్యం ప్రాతిపదికన అమెరికాతో చర్చించడానికి భారత్ సిద్ధంగా ఉందని, అయితే దీనికి సంబంధించి ఎలాంటి ‘తీర్పుల’ను ఆమోదించబోదని భారతీయ అధికారులు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో భారతీయ అధికారులు ఈ విషయం స్పష్టం చేశారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో కొంతమంది అమెరికన్ సెనేటర్లు భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడంతో భారతీయ అధికారులు కూడా భారత్ వైఖరిని స్పష్టంగా, దృఢంగా అమెరికాకు తెలియజేశారు.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే బిజెపికి అచ్ఛే దిన్

న్యూఢిల్లీ, జూన్ 2: ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీని త్వరలోనే పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయడం అంటే బిజెపికి ‘అచ్ఛేదిన్’(మంచిరోజులు) రావడమే’అని ఒక ఇంగ్లీషు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ మరో 15 సంవత్సరాలు ప్రధానిగా కొనసాగుతారని కూడా స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారంటూ బుధవారం మీడియాలో కథనాలు రావడం తెలిసిందే.

రాహుల్‌కు పగ్గాలిస్తే రాజీనామా చేస్తా

న్యూఢిల్లీ, జూన్ 2: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా నియమిస్తే రాజీనామా చేసి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకుంటానని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ జోగి హెచ్చరించి సంచలనానికి తెరతీశారు. రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించటాన్ని పలువురు సీనియర్ నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తున్న తరుణంలో అజిత్‌జోగి తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అజిత్ జోగి గురువారం ట్విట్టర్‌లో ఈ మేరకు ఒక సందేశం పెట్టారు.

మంటల పాలైన పటిమ

రక్షణ విభాగానికి చెందిన స్థావరాలకే అగ్ని బీభత్సం నుండి రక్షణ లేకపోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మాయని మచ్చ. మహారాష్ట్ర వార్థా జిల్లా ఫూల్‌గావ్ పట్టణంలో నెలకొని ఉన్న సైనిక దళాల కేంద్ర ఆయుధ స్థావరం-సెంట్రల్ ఆమ్యునేషన్ డిపోలో మంగళవారం సంభవించిన భయంకర వహ్ని విలయం ఈ రక్షణలేని తనానికి మరో ఉదాహరణ. ఆధునిక పరిజ్ఞానం విస్తరిస్తుండడంతోపాటు అధికార నిర్లక్ష్యం వ్యవస్థీకృతం అవుతుండడం ఇలా దావానల కీలలు దాడి చేస్తుండడానికి ప్రధాన కారణం. ఇద్దరు అధికారులు సహా పదహారుమంది సైనికులు, సిబ్బంది ప్రమాద కీలలకు ఆహుతి అయిపోవడం ప్రమాదం విరుచుకుపడిన తరువాత వదలని అలసత్వానికి చిహ్నం.

అక్రమ వలసలే అసలు సమస్య

భారతీయ జనతాపార్టీ మొట్టమొదటిసారిగా హిందీ రాష్ట్రాలనుంచి ఈశాన్య ప్రాంతాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద రాష్టమ్రైన అసోంలో పూర్తి మెజారిటీతో అధికార పగ్గాలను చేపట్టింది. ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన ఆరు రాష్ట్రాల మొత్తం జనాభా కంటె అసోం జనాభా రెట్టింపుకంటె అధికం. టీ, ముడిచమురు, అడవులు, నీరు వంటి సహజవనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రం కూడా. తొలిసారి అధికారాన్ని చేపట్టిన సర్వానంద సోనోవాల్ ముందు ఇప్పుడున్న అతిప్రధానమైనది అక్రమ వలసల సమస్య. 1993లో ఒకసారి నేను కోల్‌కతాను సందర్శించడం తటస్థించింది. అప్పట్లో తూర్పు సైనిక కమాండర్ జమీల్ మహమ్మద్‌ను కలుసుకోవడం తటస్థిం చింది.

-ఎస్.కె. సిన్హా

Pages